Viral Video: కోహ్లీ డ్రాప్ పై ముందే చర్చ జరిగిందా..? టాస్ కు ముందే రోహిత్, గంభీర్ మంతనాలు.. రెండో వన్డేకి కోహ్లీ..

మోకాలిలో స్వెల్లింగ్ రావడంతో ముందు జాగ్రత్తగా కోహ్లీకి విశ్రాంతినిచ్చారు. ఈ విషయం టాస్ అయిపోయి, జట్టును ప్రకటించేంత వరకు తెలీదు. టాస్ కన్నా ముందే విరాట్ ను డ్రాప్ చేయాలనే విషయంపై చర్చ జరిగింది. 

Continues below advertisement

Kohli Injury Update: ఇంగ్లాండ్ తో గురువారం జరిగిన తొలి వన్డేలో భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 68 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ ను ఛేదించి మ్యాచ్ సొంతం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్ లో స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ గాయం కారణంగా ఆడలేదు. మోకాలిలో స్వెల్లింగ్ రావడంతో ముందు జాగ్రత్తగా తనకు విశ్రాంతినిచ్చారు. అయితే ఈ విషయం టాస్ అయిపోయి, జట్టును ప్రకటించేంత వరకు తెలియపర్చలేదు. టాస్ కన్నా ముందే విరాట్ ను డ్రాప్ చేయాలనే విషయంపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

Continues below advertisement

తాజాగా సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన వీడియోలో కోహ్లీ గాయానికి సంబంధించి జట్టు ఫిజియోతో కలిసి హెడ్ కోచ్ గౌతం గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మ.. కోహ్లీతో చర్చిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ క్లిప్పింగ్ లో కోహ్లీకి వారు నచ్చజెబుతున్నట్లుగా అనిపిస్తోంది. తాజాగా ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తూ షేర్లు, లైకులు చేస్తున్నారు. 

మెగాటోర్నీకి ముందు జాగ్రత్తగా..
ఇక ఆ వీడియోలో తన గాయం గురించి గంభీర్, రోహిత్ లకు కోహ్లీ వివరించినట్లుగా తెలుస్తోంది. సంభాషణ అనంతరం కోహ్లీ భుజం తడుతూ రోహిత్, గంభీర్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇక ఈ మ్యాచ్ లో ఇద్దరు ఆటగాళ్లు అరంగేట్రం చేశారు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ విఫలమవగా, పేసర్ హర్షిత్ రాణా మూడు వికెట్లతో సత్తా చాటాడు. దీంతో మూడు ఫార్మాట్లలో అరంగేట్ర మ్యాచ్ లోనే కనీసం మూడు వికెట్లు తీసిన భారత బౌలర్ గా రికార్డులకెక్కాడు. కోహ్లీ స్థానంలో జట్టులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ మెరుపు ఫిఫ్టీతో ఆట స్వరూపమే మార్చాడు. తన దూకుడైన బ్యాటింగ్ తోనే జట్టు త్వరగా కోలుకుని, 11 ఓవర్ల ముందుగానే మ్యాచ్ ను ఫినిష్ చేసింది. తనతోపాటు వన్ డౌన్ బ్యాటర్ శుభమాన్ గిల్, అక్షర్ పటేల్ కూడా ఫిఫ్టీలతో చెలరేగి పోయారు. 

వన్ డౌన్ లో అలవాటే..

ఇక సడెన్ గా తొలి వన్డేలో తనను వన్ డౌన్ లో బ్యాటింగ్ చేయాలని జట్టు కోరినప్పుడు ఎలాంటి ఇబ్బంది అనిపించలేదని శుభమాన్ గిల్ తెలిపాడు. టెస్టుల్లో తాను వన్ డౌన్ బ్యాటింగ్ చేస్తానని, అదే ఫార్ములాను ఇక్కడ కొనసాగించానని తెలిపాడు. పరిస్థితులకు అనుగుణంగా గేర్ మార్చాల్సిన అవసరాన్ని ఈ బ్యాటింగ్ పొజిషన్ లో పాటించాల్సి ఉంటుందని గుర్తు చేశాడు. త్వరగా వికెట్లు పడితే సంయమనంతో ఆడాల్సి ఉంటుందని, అదే మెరుపు ఆరంభం దక్కితే దాన్ని అలా కొనసాగించాల్సి వస్తుందని పేర్కొన్నాడు. ఇక ఈ మ్యాచ్ లో 87 పరుగులు చేసిన గిల్.. త్రుటిలో సెంచరీన చేజార్చుకున్నాడు. ఇక హార్దిక్ పాండ్యా దూకుడుగా ఆడటంతో ఒత్తిడికి లోనైన గిల్ సెంచరీని చేజార్చుకున్నాడని గిల్ అభిమానులు ఆరోపిస్తున్నారు. గతంలో కూడా పాండ్యా ఇలాగే చేశాడని పేర్కొంటున్నారు. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ, వెస్టిండీస్ తో మ్యాచ్ సందర్భంగా 49 పరుగుల వద్ద ఉన్నప్పుడు అతనికి స్ట్రైక్ ఇవ్వకుండా బౌండరీతో ఇన్నింగ్స్ ను ముగించాడని గుర్తు చేశారు. అతని కారణంగానే గిల్ సెంచరీ మిస్సయ్యిందని ఫీలవుతున్నారు. ఏదైమేనా నాగపూర్ లో జరిగిన తొలి వన్డేలో గెలిచిన భారత్, 3 వన్డేల సిరీస్ లో 1-0తో ఆధిక్యంలో ఉంది. సిరీస్లో తర్వాత వన్డే ఈనెల 9న కటక్ లో జరగుతుంది. ఈ మ్యాచ్ కు విరాట్ కోహ్లీ అందుబాటులోకి వచ్చే అవకాశముందని టీమ్ వర్గాలు తెలుపుతున్నాయి. 

Also Read: Harshit Rana Record: హర్షిత్ అరుదైన రికార్డు.. మూడు ఫార్మాట్లలో అది సాధించిన తొలి బౌలర్ గా ఘనత..

Continues below advertisement