ప్రతి సంవత్సరం క్రికెట్‌లో కొత్త రికార్డులు నమోదవుతూనే ఉంటాయి, కానీ కొన్ని రికార్డులు బద్దలు కొట్టడం దాదాపు అసాధ్యం అని చెప్పవచ్చు. అందులో సచిన్ టెండూల్కర్ 100 సెంచరీల రికార్డు కూడా ఒకటి. కోహ్లీ సచిన్ శత సెంచరీల రికార్డును ఈజీగా బద్దలుకొడతారని అన్నారు. కానీ అంత తేలికకాదని తేలిపోయింది. సర్ డాన్ బ్రాడ్‌మన్ టెస్ట్ క్రికెట్‌లో అద్భుత బ్యాటింగ్ సగటు కలిగి ఉన్నారు. బద్దలు కొట్టడం దాదాపు అసాధ్యమైన 5 క్రికెట్ రికార్డుల గురించి మీకు తెలియజేస్తున్నాం.
క్రికెట్‌లోని 5 రికార్డులు బద్దలు కొట్టడం దాదాపు అసాధ్యం
- సచిన్ టెండూల్కర్ 100 సెంచరీలు
క్రికెట్ దేవుడిగా పేరుగాంచిన భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తన కెరీర్‌లో 100 సెంచరీలు సాధించాడు. ఇది దాదాపు ప్రతి క్రికెటర్ కలలుగనే రికార్డు.. కానీ ఈ రికార్డ్ బద్దలు కొట్టడం దాదాపు అసాధ్యం. 70, 80 సెంచరీలు చేయడం సాధ్యమే కానీ, వంద శతకాలు అంటే ఆ స్థాయిలో రిటైర్మెంట్ వరకు ఆడక తప్పదు.
- సర్ డాన్ బ్రాడ్‌మన్ 99.94 బ్యాటింగ్ సగటు
ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్ సర్ డాన్ బ్రాడ్‌మన్ పేరు మీద ఏ బ్యాట్స్‌మన్ కూడా చేరుకోలేని ఒక రికార్డు ఉంది. బ్రాడ్‌మన్ 52 టెస్ట్ మ్యాచ్‌లలో 99.94 సగటుతో 6996 పరుగులు చేశాడు. 60 సగటు కొనసాగించడమే కష్టమవుతోంది. ఇక 70 అనే బ్యాటింగ్ సగటునే ఊహించలేం.
- వన్డే మ్యాచ్‌లో రోహిత్ శర్మ 264 పరుగులు చేసిన రికార్డు
ఒకే వన్డే మ్యాచ్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన రికార్డు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట ఉంది. రోహిత్ శర్మ 2014లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 264 పరుగులు సాధించాడు. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ చేసిన ఈ రికార్డును కూడా ఎవరైనా బద్దలు కొట్టడం అంత సులభం కాదు. కెరీర్ మొత్తంలో ఓ వన్డేలో ఎవరైనా రోహిత్ చేసిన ఈ స్కోరును దాటినా.. వన్డేల్లో 3 డబుల్ సెంచరీలను చేయడం కూడా దాదాపు అసాధ్యం.
- ఒక టెస్ట్‌లో జిమ్ లేకర్ 19 వికెట్లు
ఇంగ్లండ్ ఆఫ్ స్పిన్ బౌలర్ జిమ్ లేకర్ ఒక టెస్ట్ మ్యాచ్ లో ఏకంగా 19 వికెట్లు తీశారు. 1956లో ఒక టెస్ట్‌లో 69 సంవత్సరాల కిందట 19 వికెట్లు తీశాడు. ఈ రికార్డు నేటికీ బద్దలు కాలేదు. ఇది దాదాపు అసాధ్యం అని క్రికెట్ ఫ్యాన్స్ సైతం చెప్పేస్తారు. కానీ ఓ ఇన్నింగ్స్ లో 10 వికెట్లు మాత్రం అనిల్ కుంబ్లే లాంటి బౌలర్ చేసి చూపించాడు.
- ముత్తయ్య మురళీధరన్ 1347 వికెట్లు
శ్రీలంక గొప్ప బౌలర్ ముత్తయ్య మురళీధరన్ అంతర్జాతీయ క్రికెట్‌లో మేటి బౌలర్. స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ అంతర్జాతీయ క్రికెట్‌లో ఏకంగా 1347 వికెట్లు తీశాడు. ఇందులో టెస్టుల్లోనే 800 వికెట్లు, వన్డేల్లో 534 వికెట్లు, టీ20ల్లో 13 వికెట్లు తీశాడు. దిగ్గజ బౌలర్ మురళీధరన్ వికెట్ల రికార్డును బద్దలు కొట్టడం కూడా దాదాపు అసాధ్యం అని చెప్పవచ్చు. దాదాపు 15 ఏళ్లకు పైగా క్రికెట్ ఆడితే.. ఏ గాయాలు లేకుండా అన్ని ఫార్మాట్లలో కొనసాగితే మాత్రం ఈ రికార్డుకు సమీపానికి రావచ్చు.