Rohit Sharma Records | విశాఖపట్నం: టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. విశాఖపట్నం వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో 27 పరుగుల వద్ద అంతర్జాతీయ క్రికెట్లో రోహిత్ శర్మ 20 వేల పరుగుల మైలురాయి చేరుకున్నాడు. ఈ ఘనత సాధించిన నాలుగో భారత బ్యాటర్ రోహిత్. ఈ జాబితాలో అగ్రస్థానంలో సచిన్ టెండూల్కర్ ఉన్నాడు.
13.4వ ఓవర్లో కేశవ్ మహారాజ్ వేసిన బంతిని రోహిత్ లాంగ్ ఆఫ్ వైపు ఆడి సింగిల్ తీశాడు. తద్వారా రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో 20,000 పరుగులు పూర్తి చేశాడు. ఎలాంటి ఒత్తిడి లేకుండా సింగిల్స్ తీస్తూ, వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ హిట్ మ్యాన్ రోహిత్ బ్యాటింగ్ కొనసాగించాడు. ఈ క్రమంలో 54 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇందులో 6 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి.
2023 నుండి ODIలలో భారత్ తరఫున వికెట్ కోల్పోకుండా పవర్‌ప్లేలో చేసిన అతి తక్కువ స్కోరు ఇదే 48/0.
అంతర్జాతీయ క్రికెట్లో 20 వేల పైగా పరుగులు చేసిన భారత ఆటగాళ్లు- 34357 - సచిన్ టెండూల్కర్- 27910 - విరాట్ కోహ్లీ (ఇంకా ఆడుతున్నాడు)- 24208 - రాహుల్ ద్రవిడ్ - 20000 - రోహిత్ శర్మ (ఇంకా ఆడుతున్నాడు)- 18,433 - సౌరవ్ గంగూలీ
రోహిత్ రికార్డుల జోరువన్డే కెరీర్లో రోహిత్ శర్మకు ఇది 60వ హాఫ్ సెంచరీ. వన్డేలలో దక్షిణాఫ్రికాపై భారత్‌కు ఇది 10వ 100కు పైగా ఓపెనింగ్ భాగస్వామ్యం. జైస్వాల్ తో కలిసి రోహిత్ 20 ఓవర్లలో శతక భాగస్వామ్యం నెలకొల్పాడు. కార్డిఫ్‌లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ 2013 ఓపెనర్‌లో రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ మధ్య నమోదైన 127 పరుగుల భాగస్వామ్యం తర్వాత ఇదే తొలిసారి. అంటే 12 ఏళ్ల తరువాత సఫారీలతో ఓపెనర్ల సెంచరీ భాగస్వా్మ్యం ఇది. ఇందులోనూ రోహిత్ శర్మ భాగస్వామి కావడం విశేషం. రోహిత్ ODIలలో మొదటి వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యంలో 35వ సారి పాలుపంచుకున్నాడు. భారత్ నుంచి సచిన్ టెండూల్కర్ (40) తరువాత రోహిత్ ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో 20 వేల పరుగుల మైలురాయి చేరుకున్న నాలుగో భారత బ్యాటర్‌గా నిలిచాడు.