WFI Former Cheif, BJP Ex MP Brij Bhushan Acquitted In Case:  ఇండియా టాప్ రెజ్లర్ల‌కు ఢిల్లీ కోర్టులో బిగ్ షాక్ తగిలింది. మహిళా రెజ్లర్లు దాఖలు చేసిన హైప్రొఫైల్ లైంగిక వేధింపుల కేసులో డబ్ల్యూఎఫ్ఐ (WFI) మాజీ చీఫ్, బీజేపీ మాజీ  ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ కోర్టు సోమవారం తీర్పునిచ్చింది. కో-ఆక్యుజ్డ్ వినోద్ తోమర్‌పై ఉన్న ఆరోపణలను కూడా రౌస్ అవెన్యూ కోర్టు అదనపు చీఫ్ జుడీషియల్ మేజిస్ట్రేట్ అశ్విని పన్వార్ కొట్టివేశాడు. ఈ తీర్పుపై వినేష్ ఫోగట్, భజరంగ్ పునియా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఈ డెసిషన్ ను హైకోర్టులో ఛాలెంజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు.

Continues below advertisement

Continues below advertisement

జంతర్ మంతర్ ప్రొటెస్ట్.. అధికార దుర్వినియోగంపై వినేష్ ఫైర్తీర్పు వచ్చిన వెంటనే వినేష్, భజరంగ్ లీగల్ నోట్ రిలీజ్ చేస్తూ, 2023 లో జంతర్ మంతర్ వద్ద రోడ్డుపైకి వచ్చి పోరాడటానికి చాలా కష్టపడ్డామని చెప్పారు. "రూలింగ్ పార్టీకి చెందిన పవర్‌ఫుల్ పొలిటీషియన్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి ఎంతో ధైర్యం కావాలి. తన పవర్, మజిల్ పవర్ ఉపయోగించి చాలా మంది అమ్మాయిలను బెదిరించి పేర్లు వెనక్కి తీసుకునేలా చేశాడు. అయినప్పటికీ కొంతమంది మహిళా రెజ్లర్లు కోర్టులో ఫైట్ చేశారు. కోర్టు అతడిని దోషిగా తేల్చకపోవడం బాధాకరం" అని వాళ్లు ఆవేదన వ్యక్తం చేశారు. బ్రిజ్ భూషణ్‌ను కాపాడేందుకు ప్రభుత్వ వ్యవస్థలు పనిచేశాయని వినేష్ ఆరోపించింది.

హైకోర్టులో అప్పీల్ కి రెడీ.. హోప్స్ లూజ్ అవ్వలేదన్న వినేష్ ట్రయల్ కోర్టు తీర్పు వ్యతిరేకంగా వచ్చినప్పటికీ లీగల్ టీమ్‌కి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చామని, త్వరలోనే ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ ఫైల్ చేస్తామని వినేష్ కన్ఫర్మ్ చేసింది. "మేము ఇంకా ఆశలు వదులుకోలేదు, మా లీగల్ ఫైట్ కంటిన్యూ అవుతుంది" అని వినేష్ స్పష్టం చేసింది. 2023 లో సాక్షీ మాలిక్, వినేష్, భజరంగ్ లీడ్ లో రెజ్లర్లు భారీ ప్రొటెస్ట్ చేశారు. సుప్రీంకోర్టు జోక్యంతో ఢిల్లీ పోలీస్ జూన్ 2023 లో 1,500 పేజీల ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది.

బ్రిజ్ భూషణ్ హ్యాపీనెస్.. న్యాయపోరాటం కంటిన్యూ అన్న బాధితులుకోర్టు తీర్పును వెల్‌కమ్ చేస్తూ గౌరవప్రదంగా నిర్దోషిగా బయటపడ్డానని బ్రిజ్ భూషణ్ హ్యాపీనెస్ ఎక్స్‌ప్రెస్ చేశాడు. అయితే ఈ తీర్పును ఉన్నత న్యాయస్థానంలో సవాల్ చేయడానికి బాధితులు రెడీ అవుతుండటంతో ఈ లీగల్ బాటిల్ ఇంకా ఎండ్ కాలేదని తెలుస్తోంది.