EPFO News: భారత్‌లో ప్రభుత్వం, ప్రైవేట్ రంగంలో కోట్లాది మంది ఈపీఎఫ్ సభ్యులుగా ఉన్నారు. చాలా కాలం నుంచి ఉద్యోగ సంఘాలు EPS వేతన పరిమితిని పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. దీనికి ఇటీవల ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. దీంతో ఉద్యోగులకు త్వరలోనే శుభవార్త రానుంది. ఉద్యోగుల PFకు సంబంధించిన పెన్షన్ పొదుపు మరింతగా పెరగనుంది. దీనిపై కేంద్రం ఇటీవల నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. 

Continues below advertisement

కేంద్ర ప్రభుత్వ ఏం నిర్ణయం తీసుకుంది ?కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి EPF, EPS పరిమితిని పెంచేందుకు సిద్ధమైంది. అవసరమైన రిటైర్మెంట్ ఫండ్ వేతన పరిమితిని నెలకు రూ.15 వేల నుంచి 25 వేల రూపాయలకు పెంచే ప్రతిపాదనకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. నెక్ట్స్ ఈ ప్రతిపాదనను కేబినెట్ ఆమోదం కోసం పంపనున్నారు. ఆ తర్వాతే కొత్త పరిమితి అమలులోకి వచ్చే తేదీపై నిర్ణయాన్ని ప్రకటిస్తారు. 

ఉద్యోగులకు కలిగే బెనిఫిట్స్ఈ కొత్త పరిమితి అమలులోకి రావడంతో 15000 నుంచి 25 వేల రూపాయల వరకు వేతనం ఉండే ఉద్యోగులకు కూడా భవిష్యత్తు కోసం పొదుపు, పెన్షన్ సౌకర్యం లభిస్తుంది. దీని వల్ల ప్రైవేట్ రంగంలో పనిచేసే ఉద్యోగులకు సామాజిక భద్రత పెరగడంతో వారికి మేలు జరగనుంది.

Continues below advertisement

కంపెనీలపై పెరగనున్న భారంకేంద్ర ప్రభుత్వం చేయనున్న ఈ మార్పు ప్రభావం కంపెనీలపై పడుతుంది. ఎక్కువ మంది ఉద్యోగులను EPF, EPSలో చేర్చాల్సి రావడంతో కంపెనీలు ఎక్కువ వాటా చెల్లించాల్సి వస్తుంది. దీంతో వారి పేరోల్ ఖర్చు మరింత పెరగవచ్చు. EPF వ్యవస్థలో యజమాని బేసిక్ జీతంలో 8.33 శాతం పెన్షన్ ఫండ్‌కు చెల్లిస్తాడు.  ప్రభుత్వం 1.16 శాతం వాటా ఇస్తుంది. ఈ క్రమంలో ఉద్యోగుల సంఖ్య పెరగడంతో ప్రభుత్వ ఖర్చులు సైతం పెరుగుతాయి. ఫైనాన్షియల్ ఇయర్ 2026-27లో EPS కోసం కేంద్రం 11,144 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించింది.

ప్రతిపాదన ఆమోదం పొందిన తరువాత ఏమవుతుందిఈ ప్రతిపాదన ఆమోదం పొందితే, 15000 నుంచి 25 వేల వరకు శాలరీ పొందే ఉద్యోగులు కూడా తప్పనిసరిగా EPF, EPS పరిధిలోకి వస్తారు. ప్రస్తుతం 15 వేల వరకు శాలరీ ఉన్న ఉద్యోగులు ఈ పథకాలలో చేరడం తప్పనిసరి. అంతకంటే ఎక్కువ సంపాదించే ఉద్యోగులు కావాలంటే స్కీమ్ నుంచి బయటకు వెళ్లవచ్చు. వారిని చేర్చాల్సిన చట్టపరమైన బాధ్యత యజమానిపై ఉండదు. 

కొత్త రూల్ ఎప్పుడు అమలులోకి వస్తుంది?కేబినెట్ ఆమోదం తర్వాత కంపెనీలు తమ పేరోల్ సిస్టమ్, అవసరమైన ప్రక్రియల్లో మార్పులు చేసుకోవడానికి సమయం పట్టవచ్చు. అందువల్ల ఈ రూల్ తక్షణమే అమలులోకి రాదు. ప్రస్తుతం కొత్త EPF వేతన పరిమితి 1 ఏప్రిల్ 2027 నుంచి అమలులోకి రావచ్చని భావిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఆర్థిక శాఖ నిర్ణయంపై కేంద్ర కేబినెట్ ఆమోదం, ప్రభుత్వ నిర్ణయం తర్వాతే ఖరారు కానుంది.