WPL 2023, Gujarat Giants: మహిళల ఐపీఎల్ మొదటి సీజన్ మార్చి 4వ తేదీ నుండి ప్రారంభం కానుంది. ఈ సీజన్‌కు గానూ ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ బెత్ మూనీకి గుజరాత్ జెయింట్స్ పెద్ద బాధ్యతను అప్పటించింది. డబ్ల్యూపీఎల్ మొదటి సీజన్‌కు గుజరాత్ జెయింట్స్ జట్టుకు కెప్టెన్‌గా బెత్ మూనీని నియమించింది. గుజరాత్ జెయింట్స్ మార్చి 4వ తేదీన డివై పాటిల్ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది. బెత్ మూనీ చాలా కాలంగా ఆస్ట్రేలియా మహిళల జట్టులో కీలక సభ్యురాలుగా ఉంది.


ప్రపంచకప్ ఫైనల్లో అద్భుత ఇన్నింగ్స్
ఇటీవల ఆడిన మహిళల టీ20 వరల్డ్ ఫైనల్ మ్యాచ్‌లో బెత్ మూనీ జట్టు తరఫున అద్భుత ఇన్నింగ్స్ ఆడింది. తను 53 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 74 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. ఈ ఇన్నింగ్స్‌లో తన స్ట్రైక్ రేట్ 139.62గా ఉండటం విశేషం. ఆస్ట్రేలియా విజయంలో ఆమె ఇన్నింగ్స్ కీలక పాత్ర పోషించింది. ఫైనల్స్‌లో ఆస్ట్రేలియా జట్టులో బెత్ మూనీ టాప్ స్కోరర్‌గా నిలిచింది.


ఇంటర్నేషనల్ కెరీర్ రికార్డులు కూడా సూపర్
బెత్ మూనీ 2016లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసింది. అప్పటి నుండి ఆమె మొత్తం నాలుగు టెస్టులు, 57 వన్డేలు, 83 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడింది. టెస్టుల్లో 26.29 సగటుతో 184 పరుగులు సాధించింది. ఇది మాత్రమే కాకుండా ఆమె వన్డేలలో 51.08 సగటుతో 1941 పరుగులు సాధించింది. ఇందులో ఆమె మూడు సెంచరీలు, 13 అర్ధ సెంచరీలు సాధించింది.


టీ20 ఇంటర్నేషనల్‌లో 77 ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 40.52 సగటు, 124.6 స్ట్రైక్ రేట్‌తో మొత్తం 2,350 పరుగులు సాధించింది. ఇందులో తన బ్యాట్ నుంచి మొత్తం రెండు సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలు వచ్చాయి. తన అత్యధిక స్కోరు 117 పరుగులుగా ఉంది.


మహిళల ప్రీమియర్ లీగ్ 2023 కోసం గుజరాత్ జెయింట్స్ జట్టు
సోఫియా డంక్లీ, సబ్బినేని మేఘన, బెత్ మూనీ, సుష్మా వర్మ, ఆష్లే గార్డనర్, హర్లీన్ డియోల్, డియాండ్రా డోటిన్, అన్నాబెల్ సదర్లాండ్, స్నేహ రాణా, జార్జియా వేర్‌హామ్, మానసి జోషి, దయాళన్ హేమలత, తనుజా కన్వర్, హర్లీ గాలా, అశ్విని కుమార్, అశ్విని కుమార్, మోనికా పట్సోడియా కుమార్, షబ్నం షకీల్.


యూపీ వారియర్స్‌ కూడా విదేశీ కెప్టెన్‌నే ఎంపిక చేసింది. ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్‌ అలీసా హేలీకి నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. మహిళల ప్రీమియర్‌ లీగు (WPL)లో ఆమె తమకు విజయాలు అందిస్తుందని ధీమా వ్యక్తం చేసింది. స్థానిక అమ్మాయి, టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మను కాదని ఆమెకు కెప్టెన్సీ ఇవ్వడం గమనార్హం. మార్చి 4 నుంచి డబ్ల్యూపీఎల్‌ మొదలవుతున్న సంగతి తెలిసిందే.


'మహిళా క్రికెటర్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్న టోర్నీ డబ్ల్యూపీఎల్‌. యూపీ వారియర్స్‌ (UP Warriarz) జట్టు అద్భుతంగా ఉంది. టోర్నీ మొదలవ్వగానే మెరవాలని ఆశగా ఉంది. మా జట్టులో అనుభవంతో పాటు యువ ప్రతిభావంతులు ఉన్నారు. అభిమానులను అలరించాలని వారంతా కోరుకుంటున్నారు. మేం గెలిచేందుకే వస్తున్నాం. భయం లేని క్రికెట్‌ బ్రాండ్‌తో ముందుకెళ్తాం' అని అలీసా హేలీ తెలిపింది.