దేశవాళీ క్రికెటర్లకు బీసీసీఐ (భారత క్రికెట్ నియంత్రణ మండలి) కార్యదర్శి జై షా గుడ్‌న్యూస్ చెప్పారు. దేశవాళీ క్రికెటర్ల మ్యాచ్‌ ఫీజులను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు. 2019-20 సీజన్‌కు గానూ ఆటగాళ్లందరికీ 50 శాతం మేర అదనంగా మ్యాచ్‌ ఫీజు చెల్లించనున్నట్లు ప్రకటించారు. బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశాల్లో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.


కరోనా కారణంగా 2020-2021 సీజన్‌లో ఆర్థిక నష్టానికి పరిహారంగా ఈ మేరకు అదనపు ఫీజు చెల్లించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు జైషా ట్వీట్ చేశారు.










ఎంత పెరిగింది..?



  •  సీనియర్ ప్లేయర్లకు (40 మ్యాచులకుపైగా ఆడిన వారు): రూ. 60 వేలు,

  •  అండర్‌-23 ప్లేయర్లకు: 25 వేలు

  •  అండర్‌-19 క్రికెటర్లకు: 20 వేలు


ఇందుకు సంబంధించి ట్విటర్‌ వేదికగా జై షా ప్రకటన చేశారు. ఈ మేరకు బీసీసీఐ అపెక్స్‌ కౌన్సిల్‌ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. సెప్టెంబర్ 20 నుంచి డొమెస్టిక్ క్రికెట్ షెడ్యూల్ మొదలు కానుంది. 



  1. సీనియర్‌ ఉమెన్‌ వన్డే లీగ్‌: 2021 సెప్టెంబరు 21 నుంచి ప్రారంభం

  2. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ: 2021 అక్టోబరు 20- 2021 నవంబరు 12

  3. సీనియర్‌ ఉమెన్‌ వన్డే ఛాలెంజర్‌ ట్రోఫీ- 2021, అక్టోబరు 27

  4. రంజీ ట్రోఫీ: 2021 నవంబరు 16 - 2022, ఫిబ్రవరి 19

  5. విజయ్‌ హజారే ట్రోఫీ: 2022 ఫిబ్రవరి 23- 2022, మార్చి 26