Babar Azam: పాకిస్థాన్ కెప్టెన్, ఓపెనర్ బాబర్ ఆజం 2022 సంవత్సరానికి ఉత్తమ క్రికెటర్‌గా ఎన్నికయ్యాడు. ఐసీసీ అతనికి సర్ గార్‌ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీని ప్రదానం చేస్తుంది. ప్రతి సంవత్సరం ఈ గౌరవం 'క్రికెటర్ ఆఫ్ ది ఇయర్'గా నిలిచిన ఆటగాడికి అందిస్తారు. అయితే చాలా కాలంగా సరైన ఫాంలో లేని బాబర్ ఆజం చివరకు గత ఏడాది అత్యుత్తమ క్రికెటర్‌గా ఎలా నిలిచాడనే ప్రశ్న చాలా మందిలో తలెత్తింది.


బాబర్ ఆజం ఆసియా కప్ 2022లో ప్రత్యేకంగా ఏమీ ఆడలేక పోయాడు. అలాగే T20 ప్రపంచ కప్‌లో అతని బ్యాట్ నుంచి భారీ ఇన్నింగ్స్ రాలేదు. దీని తర్వాత దేశవాళీ సిరీస్‌లో కూడా అతను అంతంత మాత్రంగానే ఆడింది. అయినప్పటికీ అతను 'క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2022' అయ్యాడు. ఎందుకంటే ఆసియా కప్ ఆగస్టులో ప్రారంభమైంది మరియు. అప్పటి నుంచి అతను ఫామ్‌లో లేడు. కానీ అంతకు ముందు, 2022 సంవత్సరం మొదటి ఏడు నెలల్లో, అతని బ్యాట్ నుంచి భారీగా పరుగులు వచ్చాయి.


2022 సంవత్సరంలో టీ20 క్రికెట్‌లో బాబర్ ఆజం కొద్దిగా ఫాంలో లేనట్లు కనిపించాడు. అయితే వన్డేలు,టెస్ట్ క్రికెట్‌లలో అతను క్రమం తప్పకుండా మంచి ఆట కనపరుస్తూనే ఉన్నాడు. గతేడాది టెస్టు క్రికెట్‌లో బాబర్ తొమ్మిది మ్యాచ్‌లు ఆడాడు. 17 ఇన్నింగ్స్‌ల్లో 1,184 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతని బ్యాటింగ్ సగటు ఏకంగా 69.64గా ఉంది. ఈ తొమ్మిది మ్యాచ్‌ల్లో అతను నాలుగు సెంచరీలు, ఏడు హాఫ్ సెంచరీలు సాధించాడు.


'వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్'గా కూడా...
కాబట్టి బాబర్ బ్యాట్ వన్డేల్లో కూడా చాలా పరుగులు చేసింది. గతేడాది తొమ్మిది వన్డేల్లో బాబర్ 84.87 బ్యాటింగ్ సగటుతో 679 పరుగులు చేశాడు. ఈ తొమ్మిది మ్యాచ్‌ల్లో అతను మూడు సెంచరీలు, ఐదు అర్ధ సెంచరీలు సాధించాడు. అంటే ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లో ఎనిమిది సార్లు 50కి పైగా పరుగులు చేశాడన్న మాట. అందుకే అతను 'వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2022'గా కూడా ఎంపికయ్యాడు.


అయితే బాబర్ ఆజం ఆసియా కప్, టీ20 ప్రపంచ కప్‌లో విఫలమయ్యాడు. ఇతర ద్వైపాక్షిక సిరీస్‌లలో అడపాదడపా కొన్ని మంచి ఇన్నింగ్స్‌లు ఆడాడు. 2022లో బాబర్ 26 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఇక్కడ అతను 31.95 సగటుతో, 123.32 స్ట్రైక్ రేట్‌తో 735 పరుగులు చేశాడు. ఇక్కడ అతను ఒక సెంచరీ, ఐదు అర్ధ సెంచరీలు చేశాడు.


ఇటీవలే బాబర్‌ అజమ్‌ హనీ ట్రాప్‌లో కూడా చిక్కుకున్నాడు. అతను తన తోటి క్రికెటర్‌ గర్ల్‌ఫ్రెండ్‌తో అభ్యంతరకరంగా ఛాటింగ్ చేసిన వీడియోలు బయటికొచ్చాయి. ఆ అమ్మాయితో నగ్నంగా వీడియో కాల్స్‌లో మాట్లాడినట్లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.


ప్రస్తుతం పాకిస్థాన్‌ క్రికెట్‌లో ఇది పెద్ద సంచలనంగా మారింది. దీంతో బాబర్‌ ఆజమ్‌పై తీవ్ర స్థాయిలో విమర్శల వర్షం కురుస్తోంది. ‘నువ్వు నాతో ఇలాగే ఛాటింగ్ చేస్తేనే నీ బాయ్‌ ఫ్రెండ్‌ పాకిస్థాన్‌ టీమ్‌లో కొనసాగుతాడు.’ అని బాబర్‌ ఆజమ్ ఈ అమ్మాయితో అన్నట్లు వీడియోల్లో కనిపించింది. బాబర్ ఆజమ్‌కు సంబంధించిన కొన్ని వాయిస్‌ మెసేజ్‌లు కూడా సోషల్‌ మీడియాలో ఇప్పుడు హల్‌చల్‌ చేస్తున్నాయి.