Asian Games 2023: ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు దూసుకుపోతున్నారు. తాజాగా మరో పతకం సాధించారు. పురుషుల డబుల్ కనోయ్ 1000 మీటర్ల ఫైనల్ లో భారత క్రీడాకారులు కాంస్య పతకం సాధించారు. అర్జున్ సింగ్, సునీల్ సింగ్ తో కూడిన భారత జట్టు బ్రాంజ్ మెడల్ సాధించింది. భారత జట్టు 3.53.329 సెకన్లతో మూడో స్థానంలో నిలిచింది. ఇక 3.43.796 సెకన్లతో ఉజ్జెకిస్థాన్ గోల్డ్ సొంతం చేసుకుంది. 3.49.991 సెకన్లతో రెండో ప్లేస్ లో నిలిచిన కజకిస్థాన్ రజతం గెలుచుకుంది. అయితే.. పురుషుల కనోయ్ 1000 మీటర్ల విభాగంలో భారత దేశానికి పతకం రావడం ఇదే తొలిసారి కావడం విశేషం.
పతకాల పట్టికలో భారత్ 61 మెడల్స్ తో భారత్ ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉంది. ఇందులో 13 స్వర్ణాలు, 24 కాంస్యాలు, 24 రజత పతకాలు ఉన్నాయి. 9వ రోజు 3 రజతాలు, 4 కాంస్య పతకాలను భారత ఆటగాళ్లు గెలుపొందారు. ఇదే జోరు సాగిస్తే 100 పతకాలు సాధించడం ఏమంత కష్టం కాదని క్రీడారంగ నిపుణులు అంటున్నారు.
ఆసియా క్రీడలు 2023లో చివరి పూల్ మ్యాచ్ లో భారత మహిళల హాకీ జట్టు హాంకాంగ్ ను ఓడించింది. టీమ్ ఇండియా ఇప్పటికే సెమీ ఫైనల్ లోకి ప్రవేశించినప్పటికీ, ఈ విజయం జట్టులో మనోధైర్యాన్ని మరింత పెంచుతుంది. హాంకాంగ్ పై భారత జట్టు 13-0 తో విజయం సాధించింది. అంతేకాకుండా మహిళల ఆర్చరీ సెమీ ఫైనల్ మ్యాచ్ లో భారత్ కు చెందిన జ్యోతి సురేఖ, అదితి గోపీచంద్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్ లో జ్యోతి 149-146 స్కోరుతో అదితిపై జ్యోతి సురేఖ విజయం సాధించింది. ఈ విజయంతో జ్యోతి ఫైనల్స్ లోకి ప్రవేశించింది. ఇక అదితి కాంస్య పతకం కోసం పోటీ పడనుంది.
ఆసియా క్రీడల్లో భారత కబడ్డీ జట్టు శుభారంభం చేసింది. భారత జట్టు తన తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్ ను 55-18 తో ఓడించింది. కబడ్డీలో భారత్ విజయంతో శుభారంభం చేసింది. భారత పురుషుల కబడ్డీ జట్టు తన తొలి పూల్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ ను ఘోరంగా ఓడించి 37 పాయింట్లు సాధించింది.
ఈ మ్యాచ్ లో భారత కబడ్డీ జట్టు మొదటి నుంచి బంగ్లాదేశ్ పై ఒత్తిడి పెంచింది. భారత ఆటగాళ్లు దూకుడుగా దాడి చేశారు. నవీన్, అర్జున్ దేస్వాల్ చాలా దూకుడుగా ఆడారు. వీరిద్దరూ ఒకరి తర్వాత ఒకరు బంగ్లాదేశ్ డిఫెన్స్ ను పూర్తిగా బద్దలు కొట్టారు. మరోవైపు డిఫెన్స్ లో కూడా బంగ్లాదేశ్ రైడర్ లను భారత జట్టు తెలివిగా ఎదుర్కొంది.