Ashwath Kaushik Chess : భారత సంతతికి చెందిన ఎనిమిదేళ్ల చిచ్చరపిడుగు చెస్‌లో సంచలనం సృష్టించాడు. సింగపూర్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న భారత సంతతికి చెందిన ఎనిమిదేళ్ల అశ్వత్‌ కౌశిక్‌(Ashwath Kaushik)... స్టాటాస్‌ ఓపెన్‌( Stadthaus Open) చెస్‌ టోర్నీలో పోలెండ్‌ గ్రాండ్‌మాస్టర్‌ జాక్‌ స్టోపా( Poland Grand Master )కు షాకిచ్చాడు. అశ్వథ్‌ కౌశిక్‌ నాలుగో రౌండ్‌లో ఉక్రెయిన్‌ గ్రాండ్‌మాస్టర్‌, 37 ఏళ్ల జాసెక్‌ స్టొపాపై విజయం సాధించాడు. క్లాసికల్‌ గేమ్‌ చెస్‌ చరిత్రలో గ్రాండ్‌మాస్టర్‌ను ఓడించిన అత్యంత పిన్న వయసు ఆటగాడిగా అశ్వథ్‌ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. క్లాసికల్‌ చెస్‌లో పిన్న వయసులో గ్రాండ్‌మాస్టర్‌ను ఓడించిన ఆటగాడిగా 8 ఏళ్ల 6 నెలల 11 రోజుల అశ్వత్‌ రికార్డు సృష్టించాడు. సెర్బియాకు చెందిన లియోనిడ్‌ ఇవానోవిచ్‌ 8 ఏళ్ల 11 నెలల 7 రోజుల రికార్డును అశ్వత్‌ బద్దలు కొట్టాడు. ప్రస్తుతం ఫిడే ర్యాంకింగ్స్‌లో 37,338 ర్యాంక్‌తో ఉన్న అశ్వథ్‌ భారత్‌కు చెందినవాడే. అయితే, అతని కుటుంబం 2017లో సింగపూర్‌కు వలస వెళ్లడంతో ఆ దేశం తరఫున ఆడుతున్నాడు. రెండేళ్ల క్రితం ఈస్ట్రన్‌ ఆసియా యూత్‌ చాంపియన్‌షిప్‌లో అండర్‌-8 కేటగిరిలో పోటీపడ్డ అశ్వథ్‌.. ఆ టోర్నీలోని మూడు విభాగాల్లోనూ విజేతగా నిలిచాడు.  2022లో ఆసియా యూత్‌ ఛాంపియన్‌షిప్‌లో అశ్వత్‌ అండర్‌-8 క్లాసిక్‌, ర్యాపిడ్‌, బ్లిట్జ్‌ టైటిళ్లు గెలిచి సత్తా చాటాడు. 


దివ్య సంచలన ఆరోపణలు
చెస్ టోర్నీ చూసేందుకు వ‌చ్చిన ప్రేక్ష‌కుల‌కు త‌న‌ను వేధింపుల‌కు గురి చేసారంటూ  భార‌తీయ చెస్ ప్లేయ‌ర్ దివ్య దేశ్‌ముఖ్(Chess Player Divya Deshmukh)సంచలన ఆరోపణలు చేసింది. ఇటీవ‌ల నెద‌ర్లాండ్స్‌లో జ‌రిగిన టాటా స్టీల్ మాస్ట‌ర్స్ టోర్నీ( Tata Steel Masters Tournament)లో ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు ఆమె పేర్కొంది. 


భారత చెస్ క్రీడాకారిణి దివ్య దేశ్ ముఖ్ ఇటీవల నెదర్లాండ్స్ (Netherlands)లో నిర్వహించిన టాటా స్టీల్ చెస్ మాస్టర్స్ టోర్నీలో పాల్గొంది.  అయితే ఈ  చెస్ టోర్నీ వీక్షించేందుకు వ‌చ్చిన ప్రేక్ష‌కులు ఆట మీద ధ్యాస క‌న్నా.. త‌న కురులు, దుస్తులు, మాట‌తీరుపైనే ఫోక‌స్ పెట్టార‌ని దివ్య ఆరోపించింది. చెస్ లో క్రీడాకారిణులు అంటే ప్రేక్షకులకు చులకన భావం ఉందని పురుషులు చెస్ ఆడుతుంటే ప్రేక్షకులు వారి నైపుణ్యం గురించి మాట్లాడుకుంటారని, కానీ, మహిళలు చెస్ ఆడుతుంటే ప్రేక్షకుల దృష్టి అంతా ఆ క్రీడాకారిణులు ధరించిన దుస్తులు, ఆమె కట్టుబొట్టు, యాస... ఇలాంటి అనవసర విషయాలపైనే ఉంటుందని దివ్య ఆవేదన వ్యక్తం చేసింది.


అసలు ఆటగాళ్లను ఎందుకిలా పురుషులు, మహిళలు అంటూ వేరు చేసి చూస్తారు? అని ప్రశ్నించింది. అసలు ఇటువంటి అంశాల గురించి ఎప్పట్నించో తాను మాట్లాడాలనుకుంటున్నానని, కానీ ఇప్పుడు సమయం వచ్చిందని వివరించింది. అంతేకాదు, అసలు తాను ఏ మీడియా ఇంటర్వ్యూకైనా హాజరైనా ఇదే పరిస్థితి అని, ఆట గురించి వదిలేసి, ఇతర విషయాలే ప్రస్తావనకు వస్తుంటాయని అసహనం వ్యక్తం చేసింది. నాగ‌పూర్‌కు చెందిన 18 ఏళ్ల అంత‌ర్జాతీయ మాస్ట‌ర్ ప్లేయ‌ర్ దివ్య‌.. గ‌త ఏడాది ఏషియ‌న్ వుమెన్స్ చెస్ చాంపియ‌న్‌షిప్ గెలుచుకుంది. ఇప్పుడు ప్రస్తుతం చెస్ లో ఇంటర్నేషనల్ మాస్టర్ హోదాతో కొనసాగుతోంది. గతేడాది ఆసియా మహిళల చెస్ చాంపియన్ షిప్ విజేతగా నిలిచింది.


Also Read: ఇక బరిలోకి పంత్‌, ప్రాక్టీస్‌ మ్యాచ్‌కు సిద్ధం


Also Read: నాకౌట్‌కు భారత జట్లు, ఒలింపిక్స్‌కు రెండడుగులే దూరం