పుట్టిన తేది, సమయాన్ని అనుసరించి, నక్షత్రాన్ని బట్టి రాశులు నిర్ణయించబడుతాయి. అలా కొన్ని సమయాల్లో పుట్టిన వారికి కొన్ని టాలెంట్లు పుట్టుకతో వస్తాయట. అలా కొన్ని రాశుల్లో పుట్టిన వారు మనసులో మాటలు చదవగలరట.


చాలా మందికి ఏదో తెలియని నేర్పు ఉంటుంది. విషయాలను త్వరగా ఆకళింపు చేసుకుంటారు. చెప్పకుండానే మనసులో మాట కనిపెట్టి అందుకు అనుగుణంగా ప్రవర్తిస్తారు. నిజానిఏ రాశి వారికి మనసులో మాట చదివినట్టు తెలుసుకునే ప్రత్యేక వరం ఉండదు. కానీ కొందరిలో అది ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారు ఎదుటి వారి భావాలను త్వరగా అర్థం చేసుకో గలుగుతారు. సున్నితమైన మనసు కలిగి.. ఎదుటి వారిని చాలా త్వరగా అర్థం చేసుకోగలుగుతారు. అలాంటి రాశులు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.


కర్కాటక రాశి


జ్యోతిషం ప్రకారం కర్కాటక రాశిలో పుట్టిన వారు చాలా ప్రేమ పూరితమైన, సానుభూతి కలిగిన వ్యక్తులు. అందువల్ల వీరు ఎదుటి వారి మనసు చదవగలిగిన వారుగా చలామణిలో ఉంటారు. మనసులో మాట బయటికి చెప్పకుండానే గ్రహించి అందుకు తగిన విధంగా వారు ప్రతిస్పందించగలుగుతారు. కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి. అందువల్ల చాలా సున్నిత మసస్కులుగా ఉంటారు. వీరు మంచి లిజనర్స్. ఎవరు ఏం చెప్పినా శ్రద్ధగా వింటారు. అవసరానికి తప్పక ఆదుకునే మనసు కలిగిన వారు.


మీన రాశి


రాశి చక్రంలో సానుభూతి తో వ్యవహరించే మరో రాశి మీన రాశి. మీన రాశి జలతత్వ రాశి. ఈ రాశివారు విషయమైనా వివాదమైనా ఎదుటి వారి దృష్టి కోణం నుంచి చూడగలిగే మనసున్న వారు. ఎదుటి వారి మనసెరిగి నడచుకునే మనస్తత్త్వం కలిగి ఉంటారు. అందుకే వీరికి మనసు చదవడం తెలుసు అని అంటుంటారు. వ్యక్తుల అవసరాలను గుర్తించడంలో ముందుంటారు. అందుకు తగిన రీతిలో నడచుకుంటారు కూడా. అడగకుండానే అవసరాలు తీర్చడం వీరి నైజంగా ఉంటుంది. వీరితో కలిసి ఉండడం ఒక సెక్యూర్ పీలింగ్ ఇస్తుంది.


తులా రాశి


తులారాశి వారు చాలా లౌక్యం తెలిసిన వారు. ప్రశాంతంగా ఉంటారు. ఒక విషయాన్ని వివిధ కోణాల్లో ఆలోచించగలిగే సామర్థ్యం ఉన్నవారు. వీరిని మైండ్ రీడర్స్ అని చెప్పవచ్చు. వీరు సహజంగా సానుభూతి కలిగిన వారు. అనుబంధాలను శ్రద్ధగా సంతులన పరిచే సామర్థ్యం కలిగి ఉంటారు. ఇతరుల భావోద్వేగాలను, ఆలోచనలను ఇట్టే పసిగట్టగలుగుతారు. అందువల్ల వీరితో ఉండడం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.


ఈ మూడు రాశులకు చెందిన వారు మీ ఆత్మీయుల్లో ఉంటే మీరు అదృష్టవంతులన్నట్టే.


Also Read : Mohini Ekadashi 2024: మోహిని ఏకాదశి ఈ ఏడాది ఎప్పుడు వస్తుంది? ఆ రోజు ప్రత్యేకతలు ఏమిటీ?







Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలు, పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు.. ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.