Vidura Niti: విదురుడు దాసి కుమారుడు. అతను ధృతరాష్ట్ర మహారాజుకి సవతి సోదరుడు. మహాభారత సమయంలో అతను తన విధానాలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రయత్నించాడు. విదురుడు నిష్ణాతుడైన రాజకీయ నాయకుడని అంటారు. ఆయన మాటలను పాటించడం ద్వారా జీవితంలో విజయం సాధించవచ్చు. జీవితాన్ని భరించగలిగేలా, విజయవంతం కావడానికి అతను చాలా సులభమైన మార్గాలను అందించాడు. ఇది జీవించడానికి, ముందుకు సాగడానికి జీవితాన్ని సులభతరం చేస్తుంది. విదుర‌ నీతి ఆనాటి పరిస్థితుల‌కే కాదు, నేటి ప్రపంచానికి కూడా వర్తిస్తుంది. విదుర నీతిలోని ఈ సూత్రాలు పాటిస్తే ఆ వ్యక్తికి అన్ని సమస్యలు తీరి పేదరికం దూర‌మ‌వుతుంది.


విదురుడు చెప్పిన‌ ఈ 6 సూత్రాలను పాటించడం వలన మ‌న‌ జీవితంలోని అన్ని దుఃఖాలు, బాధ‌లు తొలగిపోతాయి. మ‌రి విదురుడు చెప్పిన‌ ఆ నైతిక పాఠాలు ఏమిటి? మన సమస్యల పరిష్కారానికి విదుర నీతికి సంబంధం ఏమిటి..?


Also Read : ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నలుగురి సలహాలు తీసుకోకండి..!


1) అసూయ అన్నింటినీ నాశనం చేస్తుంది
అసూయ అనేది ఒక వ్యక్తి జీవితంలో అత్యంత నీచమైన లక్షణం అని విదుర‌డు చెప్పాడు. అసూయ అనేది ఒక రకమైన మానసిక రుగ్మత. అసూయపడే వ్యక్తికి కూడా ఆనందం ఉండదు, ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఆ వ్యక్తి ఇతరుల సంతోషం చూసి తన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటాడు. అసూయపడే వ్యక్తి ఎప్పుడూ సంతోషంగా ఉండడు. కాబట్టి, మీరు జీవితంలో సంతోషంగా ఉండాలంటే, అసూయపడే అలవాటును వదిలించుకోవాలి.


2) ధిక్కారాన్ని వదిలేయండి
ఇతరుల కంటే తనను తాను ఉన్నతంగా భావించి ఇతరులను అజ్ఞానులుగా భావిస్తూ అవమానపరచకూడదు. దీనివల్ల ఆ వ్యక్తి ఎప్పుడూ దుఃఖాన్ని, కష్టాలను అనుభవించాల్సి వస్తుంది. తృణీకరణ‌కు గురైన‌వ్యక్తికి సహాయం అవసరమైనప్పుడు, ఎవరూ అతనికి సహాయం చేయరు. మహాభారతంలో దుర్యోధనుడు ఎప్పుడూ పాండవులను అవమానిస్తూ, చిన్నచూపు చూసేవాడు. చివరికి పాండవుల చేతిలో అవ‌మాన‌క‌ర‌మైన రీతిలో మరణించాడు.


3) అసంతృప్తి వ‌ద్దు
కొందరికి ఎన్ని సుఖాలు ఉన్నా తృప్తి కలగదు. అతని మనసు ఎప్పుడూ గంద‌ర‌గోళంగానే ఉంటుంది. దీనివల్ల మనిషి ఎప్పుడూ బాధపడాల్సి వస్తుంది. అన్ని విషయాలలో తృప్తిక‌ర‌మైన‌ వైఖరి కలిగి ఉండాలి. మనకు ఉన్నదాంట్లో తృప్తి పొంద‌డ‌మ‌నే ల‌క్ష‌ణాన్ని అల‌వ‌ర‌చుకోవాలి.


4) కోపాన్ని అదుపులో ఉంచుకునే సామర్థ్యం
కోపాన్ని అదుపు చేసుకోలేని వ్యక్తి జీవితంలో ఎప్పటికీ విజయం సాధించలేడు. ఈ లక్షణం కార‌ణంగా స్నేహితులు కూడా శత్రువులుగా మారతారు. వ్య‌క్తి మితిమీరిన కోపం సంబంధాలను, సంతోషకరమైన క్షణాలను విచారంగా మారుస్తుంది. మితిమీరిన కోపం మనిషి ఆలోచనా శక్తిని, జ్ఞానాన్ని తగ్గిస్తుంది. దీని వల్ల అలాంటి వారు నిత్యం కష్టాలు ఎదుర్కొన‌వ‌ల‌సి వస్తుంది.


5) సందేహాస్ప‌ద మ‌న‌స్త‌త్వం
సందేహం అనే దుర్గుణం ఉన్నవాడు ఎప్పుడూ సంతోషకరమైన జీవితాన్ని అనుభవించలేడు. ఒక వ్యక్తి మొత్తం జీవితాన్ని నాశనం చేసే శక్తి సందేహానికి ఉంది. అనుమానాస్పద వ్యక్తిత్వం ఉన్న వారు ఎవరినీ ఎప్పుడూ నమ్మలేరు. అలాంటి వారు సొంత కుటుంబాన్ని కూడా ద్వేషిస్తారు. సందేహ స్వభావం ఆ వ్యక్తి మానసిక ఒత్తిడిని పెంచుతుంది.


Also Read : ఈ వస్తువులు మీ చేతిలోంచి జారిపడితే అశుభం


6) సోమరితనం వదలండి
ఏ వ్యక్తి జీవితంలోనూ సోమరితనం ఉండకూడదు. సోమరితనం ఉన్న వ్యక్తి జీవితంలో ఎప్పటికీ పురోగతి సాధించలేడు.


ఈ దుర్గుణాల నుంచి విముక్తుడైన వ్యక్తి జీవితంలో శ్రేయస్సు సాధిస్తాడని విదురుడు చెప్పాడు. మంచి లక్షణాలు ఉన్న వ్యక్తి మాత్రమే జీవితంలో పురోగ‌తి సాధించ‌గలడ‌ని స్ప‌ష్టంచేశాడు.


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.