Christmas Celebrations 2025: యేసు క్రీస్తు పుట్టిన రోజును డిసెంబర్ 25వ తేదీన క్రైస్తవులందరూ ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటారని అందరికీ తెలిసిన విషయం. అయితే ప్రపంచంలోని కొన్ని దేశాల్లోని క్రైస్తవులు మాత్రం డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్ పండుగను నిర్వహించుకోరు. డిసెంబర్ 25వ తేదీన కాకుండా మరో రోజున వీరు క్రిస్మస్ సంబరాలు జరుపుకుంటారు. అయితే ఆ దేశాలు ఏంటి? ఎందుకు అనేది ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.

Continues below advertisement

డిసెంబర్ 25వ తేదీన జరుపుకోని దేశాలు ఇవే..

యేసుక్రీస్తు పుట్టుకను ఈస్టర్న్ ఆర్థడాక్స్ (Eastern Orthodox) దేశాలు డిసెంబర్ 25వ తేదీన జరుపుకోవు.

Continues below advertisement

ఆ దేశాల జాబితా ఇదే:

రష్యా (Russia)

ఉక్రెయిన్ (Ukraine) - కొన్ని చర్చిలు

సెర్బియా (Serbia)

జార్జియా (Georgia)

బెలారస్ (Belarus)

మోల్డోవా (Moldova)

మాంటెనెగ్రో (Montenegro)

ఉత్తర మాసిడోనియా (North Macedonia)

ఎథియోపియా (Ethiopia)

ఎరిట్రియా (Eritrea)

ఈజిప్ట్ (Egypt) - కాప్టిక్ క్రిస్టియన్స్

ఈ దేశాలు ఇప్పటికీ జూలియన్ క్యాలెండర్ (Julian Calendar) అనుసరిస్తాయి. ఈ కారణంగా డిసెంబర్ 25వ తేదీని క్రీస్తు జన్మదినంగా జరుపుకోవు. మన క్యాలెండర్‌లోని డిసెంబర్ 25వ తేదీ, వారు అనుసరించే జూలియన్ క్యాలెండర్ ప్రకారం జనవరి 7వ తేదీ అవుతుంది. ఆ కారణంగా ఈ దేశాల్లోని క్రైస్తవులు జనవరి ఏడో తేదీన యేసు క్రీస్తు జన్మదినపర్వాన్ని ఆచరిస్తారు.

ఆర్మేనియా (Armenia) దేశానిది మరో ప్రత్యేకత

ఇక ఆర్మేనియా దేశం క్యాలెండర్ ప్రకారం కాకుండా, వారి పాత సంప్రదాయాలను అనుసరించడం వల్ల యేసు క్రీస్తు జన్మదినాన్ని భిన్నంగా జరుపుకుంటోంది. ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవులు డిసెంబర్ 25వ తేదీన ఈ పండుగ జరిపితే, జూలియన్ క్యాలెండర్ ప్రకారం మరికొంత మంది జనవరి ఏడో తేదీన జరుపుతారు. ఈ ఆర్మేనియన్ క్రైస్తవులు మాత్రం జనవరి ఆరో తేదీన క్రిస్మస్ పండుగ జరుపుతారు. జనవరి ఆరో తేదీన యేసు జననంతో పాటు ఆయన బాప్తిస్మం తీసుకోవడాన్ని ఒకే రోజున జరుపుకోవడం సంప్రదాయంగా వస్తోంది. యూరోపియన్ దేశాలు క్యాలెండర్ ప్రకారం యేసు క్రీస్తు జన్మదినోత్సవం జరుపుతుంటే, ఆర్మేనియా మాత్రం పాత సంప్రదాయాల ప్రకారమే ఈ పండుగను జరుపుకుంటోంది.