Sivaji Reaction On His Heroines Dressing Comments : హీరోయిన్ల డ్రెస్సింగ్ సెన్స్‌పై తన కామెంట్స్‌కు కట్టుబడి ఉంటానని... అయితే ఆ రెండు పదాలు వాడడం చాలా తప్పు అని సీనియర్ హీరో శివాజీ అన్నారు. అందుకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపారు. 'దండోరా' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తన కామెంట్స్‌పై తాజా ప్రెస్ మీట్‌లో వివరణ ఇచ్చారు.

Continues below advertisement

నా ఉద్దేశం అదే

ఇప్పటికే తాను సారీ చెబుతూ ఓ వీడియో రిలీజ్ చేశానని... తన సినీ జీవితంలో ఎప్పుడూ అలాంటి పదాలు మాట్లాడలేదని, పాలిటిక్స్‌లోనూ ఎవరినీ హద్దు మీరి దూషించలేదన్నారు శివాజీ. అసభ్య పదాలు వాడినందుకు అందరూ క్షమించాలని కోరారు. 'ఆ రోజు వేదికపై నా తోటి నటీనటులు, ఆడబిడ్డలకు క్షమాపణలు. ఈవెంట్‌లో అలా ఎందుకు మాట్లాడానా? అని బాధపడ్డా. లులు మాల్‌లో నిధి అగర్వాల్ పడ్డ వేదన నా మైండ్‌లోంచి పోలేదు. ఆ తర్వాత సమంత గారిని కూడా వేధించారు. నేను ఎవ్వరినీ ఆ డ్రెస్సులు వేసుకోండి ఈ డ్రెస్సులు వేసుకోండి అని చెప్పలేదు. అసలు నేనెవరిని చెప్పడానికి.

Continues below advertisement

సినిమాల వల్లే చెడిపోతున్నారని అంటున్నారు. సినిమాల వల్లే ఈ ప్రపంచం నాశనం అవుతుందనే మాటలు వింటున్నాం. సినిమా, సినిమా ఇండస్ట్రీని ఎవరూ ఏమీ అనకూడదు. మనమెందుకు వారికి అవకాశం ఇవ్వాలి? అనే ఆలోచనతో ఆ సందర్భంలో వచ్చిన మాటలు అవి. 30 ఏళ్ల సినీ జీవితంలో నేను ఎప్పుడూ అలా మాట్లాడలేదు. ఆ 2 పదాలు మాట్లాడడం తప్పు. బయటకు రాగానే అలా ఎందుకు మాట్లాడానా? అని మథన పడ్డా. అందుకు మనస్ఫూర్తిగా క్షమాపణ చెబుతున్నా. నేను ఇచ్చిన స్టేట్మెంట్‌కు కట్టుబడి ఉన్నా. ఎవరికీ భయపడే పనే లేదు.' అని అన్నారు.

Also Read : 'దండోరా' సెన్సార్ రివ్యూ - 15 మార్పులు సూచించిన బోర్డు... ఆ సీన్స్, డైలాగ్స్ కట్

ఆవేశంగా కంప్లైంట్... బలైందెవరు?

ఆ కామెంట్స్‌పై కనీసం వివరణ ఏమీ అడగకుండానే తనపై ఆవేశంగా 'మా'కు లేఖ రాశారని శివాజీ ఆవేదన వ్యక్తం చేశారు. 'నేను తప్పుగా మాట్లాడానని భావించి ఫస్ట్ నా భార్యకు సారీ చెప్పా. వెంటనే ఓ వీడియో రికార్డు చేసి మూవీ టీంకు పంపాను. అనవసరంగా దీన్ని పెద్దది చేయడం ఎందుకని వద్దని చెప్పారు. అర్ధరాత్రి తర్వాత సింగర్ చిన్మయి, యాంకర్ అనసూయ గారికి ట్వీట్స్ ట్యాగ్ చేయడం మొదలుపెట్టారు.

నా వైపు తప్పు దొర్లింది కాబట్టి వారు ఏమన్నా సర్దుకుపోవాలి. ఆవేశంలో కొందరు 'మా'కు లేఖ రాశారు. ఎవరికి వారు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు సహా మహిళా కమిషన్‌కు కంప్లైంట్ చేశారు. 'శివాజీతో మాట్లాడి క్షమాపణ చెప్పిద్దాం' అని ఎవరూ అనలేదు. నేను ఎవరినీ ఫలానా పేరు పెట్టి అనలేదు. కానీ ఇప్పుడు ప్రజల చేతుల్లో బలైంది ఎవరు? నేను దేనికీ భయపడను. తప్పు చేసినప్పుడు క్షమాపణ చెప్పేందుకు క్షణం కూడా ఆలోచించను. నన్ను దోషిగా సమాజం ముందు నిలబెట్టాలనుకునే వారందరికీ వందనాలు. మీరు బాధ పడ్డందుకు మీకు కూడా క్షమాపణలు. అంతకు ముందు చాలా జరిగినా వారిని ఎవరూ అడగలేదు. నేను మంచి ఉద్దేశంతోనే మాట్లాడినా ఆ రెండు పదాలు మాత్రం తప్పు. అంతకు మించి నేను ఏ తప్పూ చేయలేదు. నా ఇంటెన్షన్ అర్థం చేసుకున్న వారందరికీ థాంక్స్.' అని చెప్పారు.