Spiritual News

Continues below advertisement

ఓ రోజు మంచిగా..

మరో రోజు చికాకుగా..

Continues below advertisement

ఎందుకిలా?

మనసు మార్పులకు కారణం ఏంటి?

సైన్స్ ఏం చెబుతోంది? వేదాలు ఏం చెప్పాయ్?  

మనిషి ప్రవర్తన రోజుకోలా మారడం గురించి శాస్త్రం, సైన్స్ లో ఏముందంటే.. మనసు ఎప్పుడూ స్థిరమైనది కాదు. ఇందుకు ప్రధానంగా 7 కారణాలు చెబుతారు ఆధ్యాత్మికవేత్తలు..ఏ కారణంతో ఎప్పుడు ఎలా మనసు మారుతుందో వివరిస్తున్నారు. ఆ ఏడు కారాణాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

భగవద్గీత ప్రకారం మనలో సత్వ, రజో, తమో గుణాలుంటాయి. అవి ఎప్పుడూ మారుతుంటాయి. సత్వ గుణం అంటే శాంతం, రజో గుణం అంటో కోపం, తమస్సు అంటే సోమరితనం ఉంటుంది. మీలో ఏ గుణం ఉంటే మీ ప్రవర్తన అలా మారిపోతుంది

మనసు కోతిలాంటిది..ఎప్పుడూ ఓ కొమ్మ మీద ఉండిపోదు. ప్రతి క్షణం ఆలోచన మారుతుంది. రోజు వరకూ ఎందుకు కొద్దిసేపటికే ప్రవర్తన మారిపోతుంది కొందరిలో..

సంతోషంగా ఉన్నప్పుడు ఒకలా, బాధలో కష్టంలో ఉన్నప్పుడు ఇంకోలా ఉంటారు. డబ్బు ఉన్నప్పుడు - లేనప్పుడు, స్నేహితులు ఉన్నప్పుడు ఒంటరిగా ఉండేటప్పుడు ప్రవర్తనలో మార్పు స్పష్టంగా తెలుస్తుంది ఆరోగ్య స్థితి, ఆహారం, ఆకలి, నిద్రలేమి...ఇవన్నీ కూడా మీ ప్రవర్తనపై ప్రభావం చూపిస్తాయి ముఖ్యంగా సాంగత్య దోషం అని చెబుతారు ఆధ్యాత్మికవేత్తలు. ఎలాంటివారితో స్నేహం చేస్తే అలాంటి ఆలోచనలే మీక్కూడా వస్తాయ్, మీ ప్రవర్తన కూడా అలా మారిపోతుంది. కర్ణుడిలో అంత విద్య ఉన్నప్పటికీ కేవలం దుర్యోధనుడితో స్నేహం కారణంగానే తన ప్రతిభకు తగిన గుర్తింపు పొందలేకపోయాడు. 

కొన్నిసార్లు పాతవాసనలు డామినేట్ చేస్తాయి. పుట్టుకతో వచ్చిన అలవాట్లు పోయేవరకూ పోవంటారు. మధ్యలో కొన్ని చెడు అలవాట్లు వదిలేశాం అని చాలామంది చెబుతుంటారు కానీ వాటి వాసనలు అలానే ఉండిపోతాయ్. అవి బయటపడిన క్షణం..మళ్లీ ప్రవర్తనలో మీరు ఊహించనంత మార్పు వస్తుంది నాది నేను అనే అహం దెబ్బతిన్నప్పుడు మీకు తెలియకుండానే ప్రవర్తన మారిపోతుంది. పొగిడితే పొంగిపోవడం, విమర్శిస్తే కుంగిపోవడం ఇవన్నీ కూడా ప్రవర్తనలో మార్పులకు కారణం

మనసు మారడం గురించి రమణ మహర్షి చెప్పిన సమాధానం

మనసు గురించి ఓ భక్తుడు..రమణ మహర్షి వద్దకు వెళ్లి ఇలా అడిగాడు. స్వామీ... నా మనసు నిలకడగా ఉండడం లేదు, ఈ రోజు పూజ చేస్తాను, రేపు బద్ధకంగా ఉంటోందని. చిన్నగా నవ్విన రమణ మహర్షి.. మనసు అంటేనే ఆలోచనల సమూహం, ఆలోచన మారినప్పుడు మనసు మారుతుంది కానీ నువ్వు మారవు. సముద్రంపై అలలు వస్తుంటాయ్, పోతుంటాయ్ కానీ సముద్రం అలానే ఉంటుంది. అలలను చూసి సముద్రం మారిందనడం ఎంత తప్పో, ఆలోచనలు మారితే ‘నేను మారిపోయాను’ అనుకోవడం కూడా అంతే తప్పు. అలలు - సముద్రం మధ్య వ్యత్యాసం తెలుసుకుంటే నీ ప్రవర్తన ఎప్పటికీ నిన్ను ఇబ్బంది పెట్టదు అని సెలవిచ్చారు రమణ మహర్షి.

మరి మనుసుని స్థిరంగా ఎలా ఉంచుకోవాలి?

ఇందుకోసం 3 ముఖ్యసూత్రాలు సూచించారు ఆధ్యాత్మికవేత్తలు రోజుకి 5 నిముషాల పాటు కళ్లు మూసుకుని ఈ రోజు నా మనసు, నా ఆలోచనలు ఎలా ఉన్నాయని గమనించు. మార్చాలని చూడొద్దు.. గమనించు, వ్యత్యాసాన్ని తెలుసుకో.. ఇది జరిగితే సగం మార్పు సాధ్యమైనట్టే 5 నిముషాల ధ్యానంలో మీకున్న మంచి అలవాట్లు ఏమున్నాయో ఆలోచించి.. ఓ అలవాటుని పట్టుకుంటే చాలు..రోజంతా ప్రశాంతంగా గడిచిపోతుంది బాగా కోపం వచ్చినా సంతోషం వచ్చినా, చెడు జరిగినా మంచి జరిగినా కానీ..ఇదే శాశ్వతం కాదని గుర్తుపెట్టుకో.. అప్పుడు మీ ప్రవర్తనలో వచ్చే హెచ్చుతగ్గులు మీరే గుర్తించి సరిచేసుకోగలరు

ప్రవర్తన మారడం తప్పా?

ప్రవర్తన మారడం తప్పా అని ప్రశ్నిస్తే అస్సలు కాదు.  కానీ ప్రవర్తనలో  మార్పు వచ్చిందంటే ఎదురుగా ఉన్న వ్యక్తి, సందర్భం డిమాండ్ చేయాలి. ఆంజనేయుడు సీతమ్మ ముందు వినయపూర్వకంగా ప్రవర్తిస్తే..రావణుడి ముందు రుద్రుడిలా విజృంభించాడు. ప్రవర్తన మారింది కానీ రామభక్తి అనే తన ఉద్దేశం మారలేదు. అలానే మీ ప్రవర్తనలో మార్పులు రావొచ్చు కానీ.. మూలం బలంగా ఉండాలి. అది ధర్మం, సత్యం, ప్రేమ ఏదైనా కావొచ్చు. 

ఉద్యోగం, వ్యాపారంలో మంచి ఫలితాలు రావడం లేదా? ఎప్పుడైనా '8888' పద్ధతిను పాటించారా?

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. పండితులు చెప్పిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల నుంచి సేకరించి అందించిన వివరాలు ఇవి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.

దేవుళ్ల ఫొటోల్లో ఒళ్లంతా బంగారమే! వాళ్లకు ఆ ఆభరణాలు ఎక్కడి నుంచి వచ్చాయ్? మనకు ఎప్పటి నుంచి అలవాటైంది?