లలు దాదాపు ప్రతి ఒక్కరికీ వస్తాయి. నిద్రలో వచ్చే కొన్ని కలలు మాత్రమే గుర్తుంటాయి. కొన్ని కలలైతే నిజంగానే జరిగిన అనుభూతిని కలిగిస్తాయి. కొన్ని సార్లు కలలో చాలా సంతోషిస్తాం. చాలా సార్లు భయపడతాం. అబ్బ ఎంత భయంకరమైన పీడకలో అని తలచుకుంటుంటాము కూడా. అయితే కలలో చూసిన విషయానికి ప్రాధాన్యత ఉంటుందని స్వప్నశాస్త్రం చెబుతుంది. మనకు గుర్తున్న ప్రతి కలలో ఏదో ఒక సందేశం ఉంటుందని నమ్మకం. కొన్ని చాలా ప్రత్యేకంగా పరిగణిస్తారు. అటువంటి కలలు భవిష్యత్తు తెలిపే సూచనలు కావచ్చని పండితులు అభిప్రాయపడతున్నారు.


హిందూ సనాతన ధర్మంలో పాముకు చాలా విశిష్టమైన స్థానం ఉంది. ఇది శివుడి ఆభరణమైతే, విష్ణువుకు ఆవాసం. కనుక పామును చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. పన్నెండు నెలల్లో శ్రావణం ప్రత్యేకమైంది కూడా. అలాంటి శ్రావణ మాసంలో పాము కలలో కనిపిస్తే తప్పకుండా దానికి ప్రత్యేక కారణం ఉంటుందని పండితులు అంటున్నారు. స్వప్నశాస్త్రాన్ని అనుసరించి శ్రావణ మాసంలో పాము కలలో కనిపిస్తే దానికి రకరకాల విశ్లేషణలు అందుబాటులో ఉన్నాయి.


పడగ విప్పిన పాము


శ్రావణ మాసంలో కలలో పాము అది తన మీదకు పడగఎత్తి చూసినట్టు కనిపిస్తే అది చాలా పవిత్రమైన కలగా భావించాలి. ఈ కల మీకు త్వరలో రాబోయే అతి పెద్ద లాభానికి సంకేతం. ఆర్థికంగా పెద్ద మొత్తంలో లాభపడబోతున్నారని అర్థం. లేదా స్థిర చరాస్థులేవో పెద్ద మొత్తంలో మీకు చెందబోతున్నాయని కూడా భావించవచ్చు.


పసుపు రంగు పాము


శ్రావణ మాసంలో పసుపు రంగు పాము కలలో కనిపిస్తే ఉద్యోగం లేదా వ్యాపార నిమిత్తం మరో ప్రదేశానికి వెళ్లాల్సి వస్తుందని అనుకోవాలి. ఇది స్థాన చలనానికి ప్రతీక


ఆకు పచ్చని పాము


ఆకుపచ్చ రంగులో ఉన్న పాము కలలో వస్తే రాబోయే రోజుల్లో మీకు మంచి అవకాశాలు వస్తాయని అర్థం. శ్రావణంలో వచ్చిన ఈ కల చాలా పవిత్రమైందిగా స్వప్న శాస్త్రం చెబుతోంది.


స్వేత సర్పం


స్వప్నశాస్త్రాన్ని అనుసరించి కలలో తెల్లని స్వేత సర్పం కనిపిస్తే చాలా మంచిదట. త్వరలోనే చాలా పెద్ద మొత్తంలో సంపద మీకు రాబోతోందనే సంకేతమట. ఉద్యోగ వ్యాపారాల్లో చాలా మంచి లాభాలు ఆర్జించబోతున్నారనే సందేశం అని పండితులు చెబుతున్నారు.


పాము పట్టుకున్నట్టు


ఒక వ్యక్తి కలలో పామును పట్టుకున్నట్టు కల వస్తే చాలా భయ పడతాము కానీ స్వప్నశాస్త్రం ప్రకారం ఇలాంటి కల చాలా పవిత్రమైందట. జీవితంలో మిమ్మల్ని వేధిస్తున్న సమస్యల నుంచి మీకు త్వరలోనే విముక్తి లభిస్తుందని అర్ధం. లేదా రాబోయే ఆర్థిక లాభానికి కూడా సంకేతం కావచ్చని స్వప్న శాస్త్రం విశ్లేషిస్తోంది.


Also read : రావణుడు చనిపోతూ లక్ష్మణుడికి ఏమని జ్ఞానబోధ చేశాడు?


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.