Lent 2026: ఏటా రంజాన్ సమయంలోనే క్రైస్తవులు లెంట్ పాటిస్తారు. క్రీస్తు శ్రమని, బలిదానాన్ని గుర్తుచేసే పవిత్రమైన ఈ 40 రోజులు ఏ నియమాలు పాటిస్తారో తెలుసుకుందాం..
లెంట్ అంటే..
క్రైస్తవమతంలో ముఖ్యంగా కాథలిక్ చర్చ్ లో , క్రీస్తు శ్రమను - బలిదానాన్ని గుర్తుచేసుకునే పవిత్రకాలం. ఇది ఈస్టర్ (పునరుత్థాన దినం) ముందు 40 రోజుల పాటు పాటిస్తారు. క్రీస్తు అరణ్యంలో 40 రోజుల పాటూ ఉపవాసం చేశారని ఆ సంఘటనకు సూచనగా క్రైస్తవులు కూడా ఈ 40 రోజులు నిమయాలు పాటిస్తారు. 2026 లో లెంట్ ఫిబ్రవరి 18న (ఆష్ వెడ్నెస్‌డే) ప్రారంభమైంది
ఏప్రిల్ 5 ఈస్టర్ తో ముగుస్తుంది
సాధారణంగా విభూది బుధవారం ( ఆష్ వెడ్నెస్‌డే) నుంచి ఈస్టర్ ముందు వచ్చే శనివారం వరకూ మొత్తం 46 రోజులుంటుంది. ఈ మధ్యలో వచ్చే 6 ఆదివారాలు మినహాయించి 40 రోజులుగా లెక్కిస్తారు లెంట్ లో 2 ప్రధాన నియమాలు
1. ఉపవాసం
2. మాంసాహార నిషేధం
ఇవి స్వీయ నియంత్రణ, పాప ప్రాయశ్చిత్తం , దేవుడి సమర్పణ కోసం ఇవి అనుసరిస్తారు
కాథలిక్ చర్చ్ నియమాల ప్రకారం...
ఉపవాసం ఎప్పుడు పాటించాలి?
లెంట్ 40 రోజులు క్రైస్తవులు మాంసాహారం ముట్టుకోరు
ప్రతి బుధవారం, శుక్రవారం సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకూ తప్పనిసరిగా ఉపవాసం ఆచరించాలి. ఈ 40 రోజులు రోజంతా ఉపవాసం ఆచరించేవారూ ఉన్నారు.. ఒకవేళ భోజనం చేసినా రోజుకి ఒక్కసారి మాత్రమే. నీళ్లు, కాఫీ, టీ, జ్యూసెస్ ఇవన్నీ ఎప్పుడైనా తీసుకోవచ్టు..ఆల్కాహాల్, మాంసాహారం తీసుకోరాదు లెంట్ నియమాలు ఎవరు పాటించాలి?
15 నుంచి 59 సంవత్సరాల వయసువారు, ఆరోగ్యంగా ఉన్నవారు లెంట్ నియమాలు పాటిస్తారు. మినహాయింపులు ఉంటాయా?
అనారోగ్య సమస్యలు ఉన్నవారు, గర్భిణులు, బలహీనులు, బాలింతలు, చిన్నారులు, వృద్ధులకు ఈ నియమాల నుంచి మినహాయింపు ఉంటుంది. అయితే దాన ధర్మాల విషయంలో ఎవరికీ మినహాయింపు ఉండదు. లెంట్ నియమాలు పాటించినా లేకున్నా దాన ధర్మాలు చేయాలి, ప్రార్థనలు చేయాలి. లెంట్ లో అతి ముఖ్యమైన రోజు శుక్రవారం
ఈ 40 రోజుల్లో వచ్చే ప్రతి శుక్రవారం అత్యంత పవిత్రమైనవి. ఏసు శుక్రవారం మరణించడంతో ఈ రోజు అత్యంత ముఖ్యమైన రోజు
ఆదివారం మినహాయింపు
లెంట్ లో ఆదివారాలు ఉపవాసం నుంచి మనహాయింపు ఉంటుంది. ఎందుకంటే అవి ఏసు పునరుత్థాన్ని జరుపుకునే రోజులు
4వ శతాబ్ధంలో ప్రారంభమైన లెంట్ మొదట్లో కేవలం 6 రోజులు మాత్రమే ఉండేదట...ఆ తర్వాత 40 రోజులకు విస్తరించింది. అంటే హిందువులు అయ్యప్ప స్వామిపై భక్తితో చేసే మండల దీక్షలా. అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న స్వాములు మండల దీక్షలో భాగంగా పలు నియమాలు పాటిస్తారు, మద్యం - మాంసానికి దూరంగా ఉంటారు. సాత్విక ఆహారం తీసుకుంటారు, ఒక్కపూటే భోజనం చేస్తారు, నిత్యం రెండు పూటలా అయ్యప్ప స్వామి పూజ చేస్తారు...ఇంచుమించు క్రైస్తవులు పాటించే లెంట్ నియమాలు కూడా ఇలానే ఉంటాయ్. అయితే లెంట్ సమయంలో ఉపవాసం అంటే కేవలం ఆహారం మానేయడం కాదు.. ప్రార్థనలు చేయడం, దానధర్మాలు చేయడం అత్యంత ముఖ్యం అని చెబుతారు మత పెద్దలు.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. మత పెద్దలు చెప్పినవి, మత గ్రంధాల నుంచి సేకరించి అందించిన వివరాలు ఇవి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.