Lord Shiva Temples: మన దేశంలో ఎన్నో శివాలయాలు ఉన్నాయి. ప్రతి శివభక్తుడు తమ జీవితంలో ఒక్కసారైన తప్పక సందర్శించాల్సిన ప్రసిద్ధ, చారిత్రాత్మకమైన శివాలయాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
జీవితకాలంలో ఒక్కసారైనా సందర్శించాల్సిన టాప్ 7 శివాలయాలు ఇవే:
1. కాశీ విశ్వనాథ్ ఆలయం :
పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటి, లేదా శివునికి అంకితం చేసిన దేవాలయాల్లో కాశీ విశ్వనాథ్ ఆలయం ఒకటి. పవిత్రమైన గంగా నది పశ్చిమ ఒడ్డున వారణాసిలో ఉన్నది. ఈ అద్భుతమైన కాశీ విశ్వనాథ ఆలయం. ఈ ఆలయాన్ని కాశీ విశ్వనాథ లేదా విశ్వేశ్వరర్ అని పిలుస్తారు. కాశీ విశ్వనాథుడు అంటే విశ్వానికి పాలకుడు అని అర్థం. ఈ ఆలయాన్ని సందర్శించడం, పవిత్రమైన గంగా నదిలో స్నానం చేయడం విముక్తి లేదా మోక్షం లభిస్తుందని నమ్ముతుంటారు. జీవితంలో చేసిన పాపాలు తొలగిపోవాలంటే కాశీ విశ్వేశ్వరుడిని దర్శించుకోవాలని పెద్దలు చెబుతుంటారు. జీవితంలో ఒక్కసారైన కాశీని దర్శించుకుంటే ఎంతో పుణ్యం లభిస్తుంది.
2. తుంగనాథ్ ఆలయం :
ప్రపంచంలోనే ఎత్తైన శివాలయం రుద్రప్రయాగ్ జిల్లాలో తుంగనాథ్ అద్భుతమైన పర్వతాల మధ్య ఉంది. ఈ ఆలయం 3680 మీటర్ల ఎత్తులో ఉంది. దాదాపు ఒక సహస్రాబ్ది కాలం నాటిది. ఈ ఆలయాన్ని పంచ కేదార్లలో ఒకటిగా భావిస్తారు. అర్జునుడు (మూడవ పాండవ యువరాజు) ఈ ఆలయానికి పునాది రాయి వేశాడని పురాణాలు చెబుతున్నాయి. ఉత్తర భారత నిర్మాణ శైలిలో నిర్మించిన ఈ దేవాలయం చుట్టూ వివిధ దేవుళ్లకు అంకితం చేసిన పన్నెండు మందిరాలు ఉన్నాయి.
3. మదురై మీనాక్షి అమ్మన్ ఆలయం:
తమిళనాడులోని మదురైలో వైగై నది దక్షిణ ఒడ్డున పురాతన మీనాక్షి అమ్మన్ ఆలయం ఉంది. సుమారుగా 1623, 1655 మధ్య నిర్మించిన ఈ ఆలయం అద్భుతమైన నిర్మాణం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. మీనాక్షి ఆలయంలో ప్రధాన దేవతలు దేవి పార్వతి, మీనాక్షి,శివుడు కొలువై ఉన్నారు. ఈ దేవాలయం దేవుణ్ణి, అమ్మవారిని ఒకేసారి పూజించడం వల్ల మిగతా వాటి కంటే భిన్నంగా ఉంటుంది.
4. లింగరాజ్ దేవాలయం:
భువనేశ్వర్‌లో ఉన్న పురాతన దేవాలయం లింగరాజ్ ఆలయం. ఈ దేవాలయం ఏడవ శతాబ్దంలో జజాతి కేశరి రాజుచే నిర్మించారని పురాణాలు చెబుతున్నాయి. దాని పేరు సూచించినట్లుగా, శివునికి అంకితం చేశారు. ఇక్కడ లింగం, శివుని అభివ్యక్తి, సహజంగా ఉద్భవించిందని చెబుతున్నారు.
5. లేపాక్షి ఆలయం:
వీరభద్ర దేవాలయం అని కూడా పిలిచే ఈ అద్భుతమైన లేపాక్షి దేవాలయం, ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ఉంది. ఇది అద్భుతమైన నిర్మాణానికి ప్రసిద్ధి చెందింది. ఇది పైకప్పుపై అమర్చిన స్తంభాలు, ఆశ్చర్యం కలిగించే గుహలు ఉంటాయి. వీరభద్ర క్షేత్రం కేంద్రంగా పనిచేసిన లేపాక్షి సాంస్కృతికంగా, పురావస్తుపరంగా ముఖ్యమైనది. ఇది ఒకప్పుడు విజయనగర సామ్రాజ్యానికి కేంద్రంగా ఉండేది.
6. ద్రాక్షారామం :
దేశంలోని శివునికి అంకితం చేసిన ఐదు అత్యంత ముఖ్యమైన, శక్తివంతమైన ఆలయాలలో ఒకటి ద్రాక్షారామం ఆలయం. ఇది గోదావరి తూర్పు ఒడ్డున ఉంది. రాజమండ్రి నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయాన్ని పదకొండవ శతాబ్దంలో నిర్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి.
7. మల్లికార్జున స్వామి ఆలయం:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీశైలంలో ఉన్న శ్రీ భ్రమరాంబ మల్లికార్జున దేవాలయం శ్రీశైలం ఆలయం అని కూడా పిలుస్తారు. ఇక్కడ శివపార్వతులు కొలువై ఉన్నారు. పద్దెనిమిది శక్తి పీఠాలలో ఒకటి. శివుని పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటిగా ఉన్న ఈ ఆలయం హిందూమతంలో శైవమతం, శక్తిమతం రెండింటికీ ప్రాముఖ్యతను కలిగి ఉంది.
Also Read: పాములకు రెండు నాలుకలు ఎందుకుంటాయి - సర్పజాతి పుట్టుకకు మూలం ఎవరు!