వాస్తు ప్రకారం ప్రతి వస్తువు కూడా ఎంతో కొంత శక్తి కలిగి ఉంటుంది.  శక్తి ఏదైనా దాని ప్రభావానికి లోనైనపుడు మంచి లేదా చెడు జరిగే ఆస్కారం ఉంటుంది. కొన్ని రకాల శక్తుల ప్రభవావం సానుకూలంగా ఉండే మరి కొన్ని జీవితం మీద చెడు ప్రభావాన్ని చూపుతాయి. ఎక్కువ కాలం పాటు కదల్చకుండా వాడకుండా పెట్టిన వస్తువలలో రాహు, కేతువులు, శని నివాసం ఉంటారని నమ్ముతారు. ఫలితంగా ఇంట్లోని సభ్యులు ఆర్థిక, ఆరోగ్య సంక్షోభాల బారిన పడే ప్రమాదం ఉంటుంది. వాస్తు ప్రకారం ఎలాంటి వస్తువులు ఇంట్లో ఉంచుకోవాలి? ఎలాంటి వస్తువులను ఇంట్లో ఉంచుకోకూడదు తెలుసుకుందాం.



  • ఇంట్లో ఉపయోగించని పాత ఇనుప వస్తువులు లేదా పనిముట్లు పెట్టుకోకూడదు. వాడని వస్తువులు నెమ్మదిగా తుప్పు పడుతుంటాయి. ఇలా తుప్పు పట్టిన పనిముట్లను ఇంట్లో పెట్టుకోకూడదు. ఇలాంటివి ఇంట్లో ఉంచుకుంటే ఇబ్బందులు తప్పవు. వాస్తు ప్రకారం తుప్పు పట్టిన పనిముట్లు, ఇనుప వస్తువులు చాలా నెగెటివ్ ఎనర్జీని పోగు చేస్తాయి. అలాంటి వస్తువులు ఇంట్లో కనిపిస్తే వెంటనే తొలగించండి.

  • ఆగిపోయిన గడియారాలు ఇంట్లో అసలు పెట్టుకోవద్దు. గోడమీద పనిచెయ్యని గడియారాలు ఉంచడం వాస్తు ప్రకారం చాలా అశుభం. అయితే పని చేయని గడియారాన్ని గోడమీద నుంచి తీసి ఏదో ఒక మూలన పడేస్తారు. పనిచేయని గడియారాన్ని అసలు ఇంట్లో పెట్టుకోకూడదు. దాన్ని బాగు చేయించి వాడుకోవాలి. లేదా తీసి బయట పడేయ్యాలి. ఇలా పనిచేయని గడియారాల వల్ల ఇంట్లో నివసించే వారికి చెడు సమయానికి కారణమవుతాయి. కాలం కలిసి రావడంలేదు అనే మాట తరచుగా వింటుంటాము. ఇలా కాలం కలిసి రాకపోవడానికి ఇంట్లో పనికిరాని గడియారాలు ఉండడం కూడా ఒక కారణం. కాబట్టి చెడిపోయిన గడియారాలు ఇంట్లో పెట్టుకోవద్దు.

  • చాలా మంది ఇత్తడి పాత్రలు స్టోర్ రూమ్ లలో దాచి ఉంచుతారు. వాడని ఇత్తడి పాత్రల్లో తుప్పు చేరుతుంది. ఇత్తడి పాత్రలు చీకట్లో పెట్టడం వల్ల అందులో శని చేరుతుందని నమ్మకం. శని దోషాల వల్ల జీవితంలో చాలా కష్టాల పాలు కావల్సి ఉంటుంది. ఆర్థిక, సామాజిక, ఆరోగ్య పరమైన అనేక రకాల కష్టాలు శనిప్రభావంతో రావచ్చు. కనుక వాడని ఇత్తడి సామను ఇంట్లో పెట్టుకోకూడదు. లేదా వాటిని తరచుగా శుభ్రం చేసి పెట్టుకోవాలి. అలా శుభ్రం చేసుకునే వీలు లేనపుడు, వాటిని ఏళ్ల తరబడిగా వాడనపుడు వాటిని తీసెయ్యడమే మంచిది.

  • వాడని వస్తువులు ఇంట్లోనుంచి తొలగించడం అన్నింటికి మంచిది. వాడకంలో లేని వస్తువులు ఇంట్లో చెత్తసామాను కిందకి వస్తాయి. అవి ఎంత విలువైనవైనా వాటిని వదిలించుకోవడమే మంచిదని వాస్తు శాస్త్రం చెబుతోంది.

  • Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.