వాస్తులో దిక్కుల గురించి ప్రధానంగా వివరించారు. ఒక నిర్మాణం చేపడుతున్నపుడు వాటి ప్రత్యేకత గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం తప్పనిసరి. దిక్కులను సరిగా చూసుకోకుండా నిర్మాణాలు చేపడితే వాస్తుదోషాలు ఏర్పడతాయి. ఇవి ఆ ఇంట్లో నివసించే వారి మీద తప్పనిసరిగా ప్రభావాన్ని చూపుతాయి.
వాస్తు నిర్మాణ శాస్త్రంగా జీవితంలో సుఖ సంతోషాలు నింపడం లక్ష్యంగా పనిచేస్తుంది. ప్రస్తుత కాలంలో పట్టణాలలో వాస్తును అనుసరించి అన్ని నిర్మాణాలు జరగడం లేదనేది కాదనలేని నిజం. ఇంటి, బయటి వాస్తును మనం ఎలాగూ మార్చలేము. కానీ ఇంటిలోపలి నిర్మాణాలు, వస్తువులు, ఇతర అంశాలు వాస్తును అనుసరించి ఏర్పాటు చేసుకుంటే కొంత వరకు నెగెటివ్ ఫలితాలను తప్పించుకోవచ్చు.
ఒక నిర్మాణం అందమైన ఇల్లుగా మారాలంటే మంచి ఎనర్జీతో ఉండాలి. అటువంటి ప్రదేశంలో నివసించే వారి మీద దాని ప్రభావం కచ్చితంగా ఉంటుందనేది వాస్తు శాస్త్ర వాదన. వాస్తు శాస్త్రం ప్రస్తావించిన పరిష్కారాలు ఈ ఎనర్జీని సంతులన పరచడంలో సహకరిస్తాయి. ఎన్నో గుళ్లు, గోపురాలు, కట్టడాలు వేలాది సంవత్సరాలుగా చెక్కుచెదరకుండా నిలిచి ఉండడానికి కారణం సరైన వాస్తు కలిగి ఉండడమే.
దిక్కులు ఎనిమిది. వీటిలో నాలుగు దిక్కులు కాగా మిగతా నాలుగు మూలలుగా చెప్పుకుంటారు. ఈ ఎనిమిది దిక్కులను పాలిస్తూ అష్టదిక్పాలకులు ఉంటారు. ఒక్కో దిక్పాలకుడికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. దక్షిణం దిక్కుకు అధిపతి. యమధర్మరాజు. ఈ దిక్కును పితృదేవతల దిక్కుగా పరిగణిస్తారు.
దక్షిణం వైపు ఇవి పెట్టుకుంటే..
- దక్షిణం వైపు గ్రీకు పురాణాల్లో చెప్పుకునే ఫినిక్స్ పక్షి చిత్రాన్ని పెట్టుకోవడం మంచిది. ఇది సమృద్ధికి సంకేతం.
- చీపురును ఇంట్లో దక్షిణం వైపు ఉంచాలి. అందువల్ల ఇంట్లో సంపద చేరుతుంది.
- జేడ్ మొక్కలను కూడా ఇంట్లో దక్షిణ దిక్కున లేదా హాల్ లేదా డ్రాయింగ్ రూమ్ లో దక్షిణం వైపు పెట్టుకోవాలి.
- బెడ్ రూమ్ లో మంచం దక్షిణం వైపు తల ఉండేలా అమర్చుకోవాలి. అందువల్ల వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ఆగ్నేయం నిద్రకు మంచిది. ఈ దిక్కున భారీ వస్తువులు పెట్టుకోవడం మంచిది.
- విలువైన వస్తువులు, తిజోరీ, బీరువా వంటి సంపద దాచుకునే వస్తువులను దక్షిణం వైపు పెట్టుకోవాలి. ఇలా చేస్తే ఆ ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు.
ఈవస్తువులు దక్షిణంలోఉంచకూడదు
- దక్షిణ దిక్కున చెప్పులు పెట్ట కూడదు. చెప్పులు పెట్టుకునే స్టాండ్ దక్షిణాన పెట్టుకోవద్దు. ఇది ఇంట్లో గొడవలకు కారణం అవుతుంది.
- దక్షిణం వైపు పొరపాటున కూడా తులసి మొక్క పెట్టుకోవద్దు.
- దక్షిణం వైపు పూజ గది నిర్మించుకోవద్దు.
- పడక గదిలో పడుకున్నపుడు పాదాలు దక్షిణం వైపు ఉండకూడదు. వైవాహిక జీవితంలో కలతలు రావచ్చు.
- దక్షిణంలో వంట చెయ్యడం మంచిది కాదు. ఎట్టి పరిస్థితుల్లో వంట గది దక్షిణం వైపు ఉండకూడదు.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.
Also Read: ఇలాంటి పనులు చేస్తే నవగ్రహాల ఆగ్రహానికి గురికాతప్పదు!