ఇంటి గోడలకు లేదా అల్మారాల్లో ఫ్యామిలీ ఫొటోలు పెట్టుకుంటే ఆ అందమే వేరు కదూ. అయితే, ఈ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో చూడండి.


ఫ్యామిలీ ఫోటోలు పెట్టుకునే చోటు ఇంట్లోని శక్తి కేంద్రాల మీద ప్రభావం చూపుతుందని అంటారు. ఈ ఫోటోలు అనుబంధాలకు ప్రతీకలు. వీటి ద్వారా ఇంట్లోని ప్రాణ శక్తి ప్రవాహం పెరుగుతుంది. కనుక వీటిని వాస్తు ప్రకారమే ఇంట్లో అమర్చుకోవాలి. దాని వల్ల మరిన్ని సత్ఫలితాలు లభిస్తాయి.


ఫ్యామిలీ ఫోటోలకు మన మనసుల్లో ఒక మంచి స్థానం ఉంటుంది. అవి జీవితంలోని మధురక్షణాలకు ప్రతీకలు. వాటిన చూసిన ప్రతి సారీ ఆ జ్ఞాపకాలను తిరిగి జీవించిన అనుభూతి కలుగుతుంది. ఈ ఫోటోలను ఇంట్లో అలంకరించుకునే సమయంలో కొద్ది జాగ్రత్తలు తీసుకుంటే ఇల్లు మరింత అందంగా, సామరస్యంగా కనిపిస్తుంది. భారతీయ సనాతన నిర్మాణ శాస్త్రమైన వాస్తు శాస్త్రం ప్రకారం.. ఫ్యామిలీ ఫోటోలు ఇంట్లో ఎక్కడ అమర్చుకుంటే మంచి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం.


తూర్పు


తూర్పు ఎదుగుదలకు, తాజాదనానికి ప్రతీక వంటి దిశ. ఇటువైపున ఫోటోలను అమర్చుకుంటే పాజిటివిటి, ఆరోగ్యం ఇంట్లో వెల్లివిరుస్తాయి. అందమైన జ్ఞాపకాన్ని ఇటువైపు అమర్చుకుంటే ఇంట్లో ప్రేమ, ఐకమత్యం నిలిచి ఉంటుంది.


ఉత్తరం


వాస్తు ప్రకారం ఉత్తరం దిక్కు సంపద, సమృద్ధికి సంబంధించిన దిశ. ఇటువైపు ఒక ఫ్యామిలి ఫోటో పెట్టకుంటే  ఇంట్లో సామరస్యం, అభివృద్ది కలుగుతుంది. ఇంట్లో అనుబంధాలు బలంగా కొనసాగుతాయి. 


ఆగ్నేయం


ఆగ్నేయం స్థిరత్వం, శక్తికి నిలయం. ఆగ్నేయంలో ఫ్యామిలి ఫోటో అమర్చుకుంటే కుటుంబానికి స్థిరత్వం, రక్షణ లభిస్తుంది.


ఈశాన్యం


ఈశాన్యం ఆధ్యాత్మిక ప్రాశస్త్యం కలిగిన దిశ. ఈ దిక్కున ఫ్యామిలి ఫోటో పెట్టుకుంటే కుటుంబ సభ్యుల మధ్య ఆధ్యాత్మిక అనుబంధాలు పెంపొందేందుకు దోహదం చేస్తుంది. ప్రేమ తెలుపుతున్న ఫోటొను ఈ దిక్కున పెట్టుకోవడం మంచిది.


చాలా మంది లివింగ్ రూమ్ లో ఫ్యామిలి ఫోటోల ప్రదర్శనకు ఒక గోడను ఎంచుకుంటారు. ఇలాంటపుడు లివింగ్ రూమ్ లోని ఈశాన్య దిక్కులో ఉండే గోడను ఎంచుకుంటే మంచిది. వాస్తు ప్రకారం.. మీ జీవితంలోని అమూల్య జ్ఞాపకాల ప్రదర్శనకు ఇంతకు మించిన ప్రదేశం ఉండదు. ఇది ఆశవహ దృక్ఫథాన్ని కుటుంబసభ్యుల మధ్య పెంపొందేందుకు దోహదం చేస్తుంది. ఇంట్లో సామరస్యత నెలకొంటుంది. కుటుంబ సభ్యుల మధ్య మధుర సంభాషణలు సాగించేందుకు అవకాశం కల్పిస్తుంది.


హాల్ లోనూ, స్టేర్ కేస్ పొడవునా కూడా ఫ్యామిలీ ఫోటోలను ప్రదర్శనకు పెట్టవచ్చు. ఇది ఇంట్లో సాకారత్మక శక్తి ప్రవాహానికి కారణం కాగలదు. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. ఎక్కువ సంఖ్యలో ఫోటోలు పెట్టడం కంటే అందంగా కనిపించే ఒకటి రెండు మంచి ఫోటోలు అలంకరించుకుంటే అందంగా ఉంటుంది. వాస్తు నియమాలను కూడా దృష్టిలో పెట్టుకుని ఫోటోలను ఇంట్లో అమరిస్తే ఇంట్లో శక్తి ప్రవాహం అనుకూలంగా మారుతుంది కూడా. అయితే, దక్షిణ దిక్కు వైపు గోడకు మాత్రం దాన్ని ఫ్యామిలీ ఫొటోలను అమర్చవద్దు. అటువైపు దివంగతులైన పెద్దల ఫొటోలు పెట్టడమే మంచిది. దీనిపై మీరు వాస్తు శాస్త్ర నిపుణుల సూచనలు, సలహాలు తీసుకోవడం మంచిది.


Also Read : Dengue Fever: బాబోయ్ వానలు - దాడికి సిద్ధమవుతోన్న డెంగ్యూ దోమలు, వెంటనే ఈ జాగ్రత్తలు పాటించండి.. లేకపోతే తెలుసుగా?
















గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.