Vastu Tips: మనం రోజంతా ఏ విధంగా గడుపుతామనేది... మనం నిద్ర లేచిన విధానంపై ఆధారపడి ఉంటుందని చాలా మంది చెబుతుంటారు. రాత్రంతా ప్రశాంతంగా పడుకుని ఉదయం తాజాగా నిద్ర లేస్తే ఆ రోజంతా హ్యాపీగా గడిచిపోతుంది. అయితే మనం తెలిసో.. తెలియకనో ఉదయం నిద్రలేవగానే కొన్ని తప్పులు చేస్తుంటాం. ఆ తప్పులు ఏంటో మనం తెలుసుకోవాలి. నిద్రలేవగానే దేవుడు ఫొటోకు దండం పెట్టుకోవడం, తమకు ఇష్టమైన వారి ముఖాలు చూడటం, చిన్నపిల్లలను చూడటం, లేదంటే తమ ముఖం తామే చూసుకోవడం లాంటివి చేస్తుంటారు. అయితే వీటన్నింటిని కొంతమంది మూఢనమ్మకాలు అంటూ కొట్టిపారస్తుంటారు. కానీ కొంతమంది చెడు జరిగితే ఉదయాన్నే ఎవరి ముఖం చూశామో అంటూ మండిపడుతుంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఉదయం లేవగానే ఎలాంటి తప్పులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉదయం నిద్రలేచిన తర్వాత చేయకూడని పనులు:
1. అద్దంలో ముఖం చూడకూడదు:
ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే చాలా ముఖం అద్దంలో చూసుకుంటారు. అలాంటి తప్పు చేయకూడదని వాస్తు శాస్త్రం సలహా ఇస్తుంది. ఇది చాలా అశుభకరమైనదిగా, రోజంతా పనిచేసే సామర్ధ్యం తగ్గిస్తుందని చెబుతుంది. నిద్రలేచిన వెంటనే అద్దంలో చూడటానికి బదులుగా మీకు ఇష్టమైన దైవాన్ని చూడటం మంచిది.
2. ఆగిపోయిన గడియారాన్ని చూడొద్దు:
ఉదయం లేచిన వెంటనే ఆగిపోయిన గడియారాన్ని చూడకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది. దీని వల్ల కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు, గొడవలు పెరుగుతాయి. వాస్తవానికి మీ ఇంట్లో గడియారాన్ని ఆగిపోకుండా చూడటం ఉత్తమం.
3. పాచిపాత్రలను చూడకూడదు:
ఉదయం లేవగానే వంటగదిలో ఉన్న పాచిపాత్రలను చూస్తే ప్రతికూల శక్తి ఆకర్షిస్తుంది. ఇలా చేయడం లక్ష్మీదేవికి కోపం తెప్పిస్తుంది. ఉదయం అపరిశుభ్రమైన పాత్రలు చేస్తే శరీరంలో పాజిటివ్ ఎనర్జీ తక్కువగా ప్రవరిస్తుంది. రాత్రి భోజనం చేసిన వెంటనే వంటగదిని శుభ్రం చేసుకోవాలి. లేదంటే పేదరికం వెంటాడుతుంది.
4. క్రూరమైన జంతువులను చూడకూడదు:
మీరు ఉదయం లేవగానే క్రూరమైన జంతువులను కానీ వాటికి సంబంధించిన చిత్రాలను కానీ చూడకూడదు. వీటిని చూడటం అరిష్టంగా పరిగణిస్తారు. ఉదయం లేవగానే మీరు ఆవును చూస్తే చాలా అద్రుష్టంగా భావించవచ్చు.
5. నీడను చూడకూడదు:
ఉదయం నిద్రలేవగానే మీ నీడను కానీ ఇతరుల నీడను కూడా చూడటం శ్రేయస్కారం కాదు. నీడను చూడటం రాహువు సంకేతమని భావిస్తారు. ఎవరైనా నీడను చూసినట్లయితే వారు రోజంతా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొవల్సి వస్తుంది.
6. ఫోన్ చూడటం:
చాలా మందికి ఉదయం నిద్రలేవగానే ఫోన్ చూసే అలవాటు ఉంటుంది. అందులో ఏవైనా చెడు వార్తలు ఉంటే వాటిని చూడగానే.. ఆరోజంతా మనస్సు ఆందోళనకరంగా ఉంటుంది. రోజంతా ఇబ్బందిగా ఉంటుంది. మనసు కకావికలం అవుతుంది. మనకు అలా జరుగుతుందమోనని భయం వేస్తుంది.
ఉదయం లేవనగానే ఈ పనులు చేయాలి:
ఉదయం నిద్రలేవగానే ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడే పనులు చేయాలి. యోగా, ధ్యానం వంటివి చేయాలి. సూర్యరశ్మి తగిలే విధంగా రోజుకు ఒక అరగంటపాటు నడిస్తే శరీరానికి కావాల్సిన విటమిన్ డి మనకు అందుతుంది. పచ్చని వాతావరణం, ఇష్టమైన వారి ముకాలు చూడటం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు మనలో మంచి ఆలోచనలు వస్తాయి. రోజంతా మంచి జరుగుతుంది.