Vastu Tips in Telugu: సాధారణంగా చాలా మంది జేబులో డబ్బులు, బండి తాళాలు, పెన్నులు, మొబైల్ ఫోన్స్ ఇలా కొన్ని ముఖ్యమైన వస్తువులను ఉంచుకోవడం సహాజం. నిత్యం ఉపయోగించే వస్తువులను జేబులో పెట్టుకోవడం సాధారణమే. అయినప్పటికీ కొన్ని వస్తువులను జేబులో పెట్టుకోకూడదని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఇవి దరిద్రాన్ని, దురదృష్టాన్ని ఆకర్షించి సంతోషాన్ని దెబ్బతీస్తాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఎలాంటి వస్తువులు జేబులో పెట్టుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. 


మీ జేబులో ఎప్పుడూ ఉంచుకోకూడని ఐదు వస్తువులు: 


1. అవసరం లేని వస్తువులు:


మనలో చాలా మంది జేబుల్లో టిష్యూలు, నగదు రశీదులు, పనికి రానికి పేపర్లు, విజిటింగ్ కార్డులు ఇలా ఎన్నో వస్తువులను జేబుల్లో నింపుతుంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీ జేబుల్లో ఇలాంటి పనికిరాని వస్తువులను పెట్టుకోకూడదు. ఎందుకంటే ఇవి పనికిరాని వస్తువులను.. ఇవన్నీ జేబుల్లో నింపుకుంటే గందరగోళంగా ఉంటుంది. మీ చొక్కా కానీ ప్యాంటు జేబులు చూడటానికి చక్కగా కనిపించాలి. 


2. వాలేట్, డబ్బులు:


జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. ప్యాంటు వెనుక జేబులో డబ్బులు కానీ, పర్సు కానీ ఉంచుకోవడం అశుభానికి సూచిక. జీవితం స్థిరత్వం, భద్రతతో ముడిపడి ఉన్న డబ్బును వెనుక జేబులో ఉంచడమనేది ఆర్థిక భద్రతను సవాల్ చేయడం వంటిది. ఇది ఆర్థిక నష్టాలకు దారితీస్తుంది. ఒకవేళ డబ్బు పెట్టుకోవాల్సి వస్తే ముందు జేబులో పెట్టుకోవాలి. ఈ చిన్న సర్దుబాటు రోజువారీ జీవితంలో మీకు అనుకూల పరిస్థితులను తీసుకువస్తుంది. ఆర్థికంగా ప్రయోజనం కలుగుతుంది. ఇంట్లో కూడా శుభం జరుగుతుంది. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. 


3. పదునైన వస్తువులు:


చాలా మంది జేబులో తాళాలు వంటి పదునైనా వస్తువులను ఉంచుకుంటారు. ఇలా ఉంచుకోవడం వల్ల జీవితంలో కలహాలు వచ్చే అవకాశం ఉంటుందని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. చాలా మంది జేబులో పదునైన వస్తువులను పెట్టుకుంటారు. ఇలా పెట్టుకోవడం ప్రతికూల, హానికరమైన శక్తులను ఆహ్వానించినట్లేనని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. అందుకే ప్రత్యేకమైన పౌచ్ లో కీస్ వంటి పదునైన వస్తువులు తీసుకెళ్లడం బెటర్. ఫలితంగా జీవితంలో ప్రశాంతత, సామరస్యపూర్వక వాతావరణం ఏర్పడుతుంది. 


4. భారీ వస్తువులు:


జేబులో భారీ వస్తువులను పెట్టుకోవడం వల్ల శరీరంలో శక్తి సమతుల్యత దెబ్బతింటుందని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. జేబులు బరువుగా ఉంటే జీవితంలో అసౌకర్యం, అశాంతి భావం ఏర్పడుతుంది. ఇది మీ శక్తిపై ప్రభావం చూపుతుంది. ఆరోగ్యకరమైన శక్తి ప్రవాహాన్ని కొనసాగించేందుకు అవసరమైన వాటిని మాత్రమే జేబులో పెట్టుకోవాలి. జీవిత సమతుల్యత విలువను ఇది ప్రతిబింబిస్తుంది. 


5. స్మార్ట్ ఫోన్:


ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ నిత్యవసర వస్తువుగా మారింది. అవసరమున్నప్పుడు చేతుల్లో పని అయిపోయిన వెంటనే జేబులో ఉంచుకోవడం సహజం. అయితే స్మార్ట్ ఫోన్ ను జేబులో ఉంచుకోవద్దని జ్యోతిష్యం సూచిస్తుంది. షర్ట్ జేబులో పెట్టుకుంటే గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. శరీరంలోని సున్నితమైన శక్తులపై ఎఫెక్ట్ పడుతుంది. మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే స్మార్ట్ ఫోన్ను ప్యాంటు జేబులో లేదా బ్యాగులో పెట్టుకోవడం మంచిది. 



Also Read : Dengue Fever: బాబోయ్ వానలు - దాడికి సిద్ధమవుతోన్న డెంగ్యూ దోమలు, వెంటనే ఈ జాగ్రత్తలు పాటించండి.. లేకపోతే తెలుసుగా?