ఇల్లు, ఇంటి వాకిలిని రకరకాలుగా అలంకరించుంటూ ఉంటారు. ఆకర్శణీయంగా, మంగళకరంగా ఉండాలని ఆరాటపడుతుంటారు. అందుకే గడపకు అందమైన ముగ్గులు వేస్తారు. పువ్వులు, ఆకుల తోరణాలే కాదు, పూసలు, గంటలతో అలంకరించిన ద్వారబంధాలను కూడా కడుతుంటారు. కొందరైతే ఇంటి గడపను లక్ష్మీ స్వరూపంగా పూజిస్తుంటారు. ముఖద్వారపు తలుపుల మీద దేవుడి ఫోటోలు సైతం అలంకరణగా పెడుతుంటారు. అది మంచిదో కాదోీ తెలుసుకుందాం.


కొంత మంది వాస్తు పండితులు దేవుడి చిత్రాన్ని ఇంటి మఖద్వారపు తలుపుల మీద పెట్టకూడదని నమ్ముతారు. అందుకు వారు కారణాలు కూడా సహేతుకంగా వివరిస్తున్నారు కూడా. దేవుడు మీ ఇంట్లో కొలువై ఉండి మీకు సకల శుభాలను కలిగించాల్సిన వాడు. మీరు ద్వార పాలకుడిగా ఇంటి ముందే ఆపేస్తున్నారనేది వారి అభిప్రాయం. ఆయన మీ ఇంటి ద్వారపాలకుడు కాదని గుర్తించాలని అంటుంటారు.


కొన్ని నియమాలు పాటిస్తూ కొన్ని దేవతా స్వరూపాలను ముఖద్వార తలుపుకు అలంకరించడంలో తప్పులేదని మరికొంత మంది వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. అలా పెట్టుకోవాలని అనుకుంటే పాటించాల్సిన నియమాలను కూడా వారు సూచించారు. అవేమిటో తెలుసుకుందాం.


ఈ దేవతల ఫోటోలు ఓకే


ఇంటి ముఖద్వారపు తలుపు మీద గణపతి, హనుమంతుడు లేదా లక్ష్మీ రూపాలను అలంకరించుకోవచ్చు. ఈ దేవతా స్వరూపాలను ద్వారం వద్ద పెట్టుకుంటే తప్పు లేదు కానీ కొన్ని నియమాలు మాత్రం తప్పక పాటించాలి.


నియమాలు



  • దేవుడి ఫోటో పెద్దదిగా ఉండాలి. ఆ ఫోటొ కచ్చితంగా గాజు ప్రేంలో పెట్టి బింగించాలి.

  • ముఖద్వారం వద్ద ఎల్లప్పుడు వెలుతురుగా ఉండాలి. అన్ని సమయాల్లో అక్కడ దీపం లేదా లైట్ వెలుగుతుండాలి. మీరు ఇంట్లో ఉన్నా లేకపోయినా ఆ స్థలంలో చీకటి ఉండకూడదు.

  • ప్రతి రోజూ ఆ దేవుడి బొమ్మను శుభ్రపరచాలి. దుమ్ముధూళీ చేరకుండా జాగ్రత్త పడాలి. వీలైనపుడు ఒక పూమాల వేయడం మరచిపోవద్దు.

  • వీలును బట్టి ప్రతిరోజూ ఆ చిత్రం ముందు ఒక దీపం లేదా అగరుబత్తి వెలిగించడం మరింత మంచిది.

  • దేవుడి చిత్రం ముఖద్వారం దగ్గర ఉంటే అక్కడ చెప్పులు విడవ కూడదు. అంతకాదు దానికి దగ్గరలో చెప్పులు భద్రపచకూడదు.

  • ఇంటి ముఖద్వారం ఉన్న దిక్కును అనుసరించి అక్కడ దేవుడి చిత్రం పెట్టుకోవాలో వద్దో పండితుల సలహా తీసుకోవడం కూడా అవసరం.


ఇంటి గుమ్మం అందంగానూ, కళగానూ అలంకరించి పెట్టుకోవాలనే ఆశ అందరికీ ఉంటుంది. కానీ నియమాలను పాటించడం కూడా ముఖ్యమని మరచిపోవద్దని పండితులు చెబుతున్నారు.


Also Read : గురువారం సబ్బుతో స్నానం చేయకూడదా? జ్యోతిష్య నిపుణులు ఏం చెబుతున్నారు?




Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలు, పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు.. ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.