కిచెన్‌కు ఎంపిక చేసే రంగులు కేవలం అభిరుచిని బట్టి మాత్రమే కాదు కొన్ని వాస్తు నియమాలను కూడా అనుసరించి ఉండాలి. అక్కడ తయారయ్యే ఆహారం ఆరోగ్యాన్ని, ఆయుష్షును అందించేది కనుక ఆ పరిసరాలు కచ్చితంగా ప్రశాంతతను కలిగించేవిగా ఉండాలి.


వాస్తులో రంగులకు ప్రత్యేక స్థానం ఉంటుంది. వాస్తు శాస్త్రం పురాతన భారతీయ నిర్మాణ పరిజ్ఞానం. ఇది జీవితాన్ని ప్రభావితం చేసే ప్రకృతిలోని అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని రూపొందించిన విజ్ఞానం. వంటశాల అంటే కేవలం భోజనం తయారయ్యే చోటు మాత్రమే కాదు. అక్కడి నుంచి శక్తి వినిమయం మొదలవుతుంది. కిచెన్ కు ఉపయోగించే రంగుల విషయంలో వాస్తు ఎలాంటి సూచనలు చేస్తుందో తెలుసుకుందాం.


పింక్ (గులాబి)


గులాబి రంగు చాలా సందర్భాల్లో ప్రేమను, భక్తిని సూచిస్తుంది. ఈ రంగు కిచెన్ కు చాలా సున్నితమైందిగా చెప్పవచ్చు. ఈ రంగు కిచెన్ కి ఎంపిక చేస్తే గులాబి రంగు కిచెన్ లో వంట చెయ్యాలన్నఇంట్రెస్ట్ రాకపోవచ్చు, ఇంట్లోని ఆ భాగంలో బద్దకంగా అనిపించవచ్చు. ఒకవేళ పింక్ కిచెన్ కి వాడాలని అనుకుంటే దానితో మరేదైన ప్రకాశవంతమైన రంగుతో కాంబినేషన్ గా వాడుకోవడం మంచిది.


బూడిద రంగు (గ్రే)


బూడిద రంగు చాలా సహజమైన రంగులా అనిపిస్తుంది. బూడిదద రంగును వాస్తు కొంత ఉదాసీనమైన రంగుగా భావిస్తుంది. ఈ రంగును కిచెన్ కు వాడితే అదే ఉదాసీనత ఆవరిస్తుంది. కిచెన్ కొంచెం ఎక్కువ ఉత్సాహంగా కనిపించాల్సిన ప్రదేశం కనుక ఈ రంగు పనికి రాదు. గ్రే కలర్ కిచెన్ కు వాడాలని అనుకుంటే మరేదైన బ్రయిట్ కలర్ తో కలిపి వాడాలి.


తెలుపు


తెలుపు చాలా సార్లు శుభ్రమైన పరిసరాలను గుర్తు చేస్తుంటుంది. అయితే ఇది వంటింటికి వాడినపుడు కొంచెం అతిగా అనిపించవచ్చు. కనుక కేవలం తెల్లని రంగు కాకుండా దీనితో పసుపు లేదా ఆకు పచ్చలను కాంబినేట్ చేసి వినియోగించవచ్చు.


బ్రౌన్ (జేగురు)


బ్రౌన్ భూమిని సూచించే కలర్. ఇది కిచెన్ కు తగిన రంగులా అనిపిస్తుంది కానీ ఇది కిచెన్ మొత్తానికి వాడితే చాలా నిరాశగా నీరంగా అనిపించవచ్చు. అభివృద్ధి కుంటుపడే ప్రమాదం ఉంటుంది. బ్రౌన్ వాడాలనుకుంటే లేత రంగుతో కలిపి వాడితే బావుంటుంది.


ఎరుపు


ఎరుపు రంగు కిచెన్ కి వాడకూడదు. ఇది శక్తివంతంగా, ఆడంబరంగా కనిపించే రంగు అయినప్పటికీ కిచెన్ లో వాడేందుకు మంచిది కాదని వాస్తు సూచిస్తోంది. ఆహారం మీద ఒక ఆడంబరదాయకమైన ప్రభావం కనబరుస్తుందట. ఎరుపు బదులుగా మరేదైనా రంగును ఉపయోగించడమే మంచిదని వాస్తు చెబుతోంది.  


ఇంటికి రంగులు ఎంపిక చేసుకునే సమయంలో తప్పకుండా ఒకసారి వాస్తు రంగుల గురించి ఏం చెప్పిందో తెలుసుకుని ప్రతి గదికి రంగులు ఎంపిక చేసుకోవడం మంచిది. పైన పేర్కొన్న రంగులను కాకుండా.. మిగతా రంగుల్లో మీకు నచ్చిన రంగును ఎంపిక చేసుకోండి. ఇంటి వైబ్రేషన్ బావుంటేనే ఇంట్లోని వారికి మన:శ్శాంతిగా ఉంటుంది. ఇంటికి సంబంధించిన ప్రతి చిన్న విషయమూ ముఖ్యమైనదే అని గుర్తుంచుకోవాలి.


Also Read : Pigeon Nest: ఇంట్లో పావురం గూడు కడితే మంచిదేనా? ఏం జరుగుతుంది?