Vastu Tips: స్నానం చేయడం అనేది శరీరాన్ని శుభ్రపరిచే ప్రక్రియ మాత్రమే కాదు, అలసటను దూరం చేయడానికి  మానసిక ఉల్లాసాన్ని పొందడానికి ఇది సులభమైన మార్గం. కానీ చాలా మంది స్నానం చేసిన తర్వాత కొన్ని చిన్న తప్పులు చేస్తారు, ఇది ఆరోగ్యంపైనే కాకుండా ఇంటి శక్తి , వాస్తుపై కూడా ప్రభావం చూపుతుంది.

Continues below advertisement


స్నానం చేసిన తర్వాత ఎలాంటి తప్పులు చేయకూడదో తెలుసుకుందాం.


బాత్‌రూమ్‌లో నీరు నిల్వ ఉంచడం


చాలామంది స్నానం చేసిన తర్వాత బాత్‌రూమ్‌లో మురికి నీటిని వదిలేస్తారు. ఇలాంటి నీరు నిల్వ ఉంచడం అశుభంగా పరిగణిస్తారు. ఇది రాహువు , కేతువుల ఆగ్రహానిరి గురి చేస్తుందని , ఇంట్లో పేదరికం పెంచుతుందని నమ్మకం.  అందువల్ల, స్నానం చేసిన తర్వాత ఎప్పుడూ బకెట్‌ను శుభ్రం చేసి, అందులో తాజాగా నీరు నింపాలి. మురికి నీటిని దాచి ఉంచకుండా వంపేయాలి.


 నేలపై వెంట్రుకలు వదలడం


తలకు స్నానం చేసిన తర్వాత మీ జుట్టును బాత్‌రూమ్‌లోనే వదిలేయడం వల్ల మురికిగా ఉండటమే కాకుండా, ఇది ఇంట్లో ప్రతికూల శక్తిని కూడా ఆకర్షిస్తుంది. ఇలా చేయడం వల్ల శని , కుజుడు అసంతృప్తి చెందుతారని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే ప్రతిసారీ స్నానం చేసిన తర్వాత బాత్‌రూమ్‌ను శుభ్రం చేసుకోవాలి. ఊడిన జుట్టుని బాత్రూమ్ లో వదిలేయకుండా వెంటనే తీసివేయాలి


తడి బట్టలు బాత్‌రూమ్‌లో వదలడం


చాలా మంది స్నానం చేసిన వెంటనే తడి బట్టలను బాత్‌రూమ్‌లోనే వదిలేస్తారు. ఈ అలవాటు ఆరోగ్యం , వాస్తు రెండింటికీ హానికరం. తడి బట్టలు బ్యాక్టీరియా   ఫంగస్‌కు కారణమవుతాయి. కాబట్టి బట్టలను వెంటనే ఎండలో లేదా గాలిలో ఆరబెట్టడం మంచిది.


స్నానం చేసిన వెంటనే సింధూరం పెట్టుకోవడం


వాస్తు శాస్త్రం ప్రకారం, స్నానం చేసిన వెంటనే సింధూరం పెట్టుకోవడం మంచిది కాదు. ఈ సమయంలో శరీరం  మనస్సు స్థిరపడటానికి సమయం పడుతుంది. తొందరపడి సింధూరం పెట్టుకోవడం వల్ల వైవాహిక జీవితంపై ప్రతికూల ప్రభావం పడుతుంది . భర్త ఆయుష్షుపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది.


చెప్పులు వేసుకుని స్నానం చేయవద్దు


స్నానం చేసేటప్పుడు చెప్పులు వేసుకోవడం కూడా వాస్తు ప్రకారం మంచిది కాదు.  ఈ అలవాటు శారీరకంగా ప్రమాదకరమే కాకుండా, సానుకూల శక్తిని కూడా పోగొట్టేస్తుంది.  పరిశుభ్రత , భద్రత కోసం చెప్పులు లేకుండా స్నానం చేయడం మంచిది.


ఆరోగ్యానికి సంబంధించిన తప్పులు


స్నానం చేసిన తర్వాత తలుపు మూసి ఉంచడం వల్ల లోపల తేమ ఏర్పడుతుంది, ఇది ఫంగస్ మరియు బూజుకు కారణమవుతుంది. ఈ తేమ గోడలను పాడు చేయడమే కాకుండా చర్మం శ్వాసకోశ వ్యాధులకు కూడా కారణమవుతుంది.


తడి పాదాలతో బయటకు రావడం వల్ల జారిపోయే ప్రమాదం పెరగడమే కాకుండా, పాదాలలో ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం కూడా పెరుగుతుంది. అందువల్ల, స్నానం చేసిన తర్వాత పాదాలను బాగా తుడవాలి.


గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు  ఆధారంగా మాత్రమే ఉంటుంది.  ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు, సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.


ఇక తిరుమల శ్రీవారికి ఏ ఏ సేవలున్నాయి? ఏ సేవలో ఏం చేస్తారు? ఏ సేవకు వెళితే మంచిది... పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి