Varalakshmi Vratam Pooja Vidhanam:  శ్రావణమాసంలో మంగళగౌరీ పూజ, వరలక్ష్మీ వ్రతం నిర్వహిస్తారు. పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీవ్రతం చేసుకుంటారు ..అయితే ఆ వారం కుదరదు అనుకుంటే ముందుగా వచ్చే శుక్రవారం అయినా ఆ తర్వాత వచ్చే శుక్రవారం అయినా వ్రతాన్ని ఆచరించవచ్చు. అష్టలక్ష్మిలలో వరలక్ష్మీదేవి ప్రత్యేకత వేరు. శ్రీ మహావిష్ణువు యోగనిగ్రలో ఉండే ఈ సమయంలో అమ్మవానిని ఆరాధిస్తే విశేష ఫలితాలుంటాయంటారు పండితులు. మాంగల్యబలం, సత్సంతానం, ఐశ్వర్యం, కుటుంబ సంతోషం కోసం వరలక్ష్మీవ్రతం నిర్వహిస్తారు . వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించే రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇంటిని శుభ్రంచేసి తలకు స్నానేం చేయాలి. పూజామందిరాన్ని శుభ్రంచేసి బియ్యపుపిండితో ముగ్గువేయాలి. మండపం ఏర్పాటు చేసి దానిపై కలశం పెట్టి అమ్మవారి ఫొటోపెట్టి అలంకరణ చేయాలి.  


పూజకు కావాల్సిన వస్తువులు
పసుపు, కుంకుమ, వాయనం ఇచ్చేందుకు అవసరమైన వస్తువులు, ఎర్రటి రవికె వస్త్రం, గంధం, పూలు, పండ్లు, ఆకులు, వక్కలు,కంకణం   దారం, కొబ్బరికాయలు, దీపపు కుందులు, నెయ్యి, కర్పూరం, అగరువత్తులు, బియ్యం,శనగలు, హారతిచ్చేందుకు అవసరమైన పంచహారతి సహా ఎవరి శక్తిమేరకు వారు అన్నీ సమకూర్చుకోవాలి. తెల్లటి దారాన్ని ఐదు లేదా తొమ్మిది పోగులు తీసుకుని దానికి పసుపురాసి దానికి ఐదు లేదా తొమ్మిది పూలు కట్టి తోరం తయారు చేయాలి. ముందుగా పసుపు గణపతిని సిద్ధం చేసుకుని పూజ ప్రారంభించాలి..


గణపతి పూజ


శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం
అనేక దం తం భక్తానాం ఏకదంత ముపాస్మహే
ఏకదంత ముపాస్మహే


వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ
నిర్విఘ్నం కురుమేదేవో సర్వ కార్యేషు సర్వదా॥


ఆగచ్చ వరసిద్ధ వినాయక, అంబికా ప్రియనందన
పూజాగృహాణ సుముఖ, నమస్తే గణనాయక॥
గణపతిపై అక్షతలు చల్లాలి.


ప్రతి నామం ముందు ఓం చేర్చాలి
ఓం సుముఖాయ నమః ఏకదంతాయ నమః  కపిలాయ నమః  గజకర్ణికాయ నమః  లంబోదరాయ నమః   వికటాయ నమః  విఘ్నరాజాయ నమః  గణాధిపాయ నమః  ధూమకేతవే నమః వక్రతుండాయ నమః గణాధ్యక్షాయ నమః  ఫాలచంద్రాయ నమః  గజాననాయ నమః  శూర్పకర్ణాయ నమః  హేరంబాయ నమః స్కందపూర్వజాయనమః  శ్రీ మహాగణాధిపతయే నమః  వినాయకుడిపై పూలు, అక్షతలు ఉంచి...నానావిధ పరిమళపుత్ర పుష్పాణి సమర్పయామి  అని చెప్పుకోవాలి 


ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ధూపం... ఆఘ్రాపయామి(ధూపం వెలిగించాలి)
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః దీపం దర్శయామి (దీపానికి నమస్కరించాలి)
 పళ్ళు లేదా బెల్లం వినాయకుడికి నైవేద్యం పెట్టాలి
ఓం భూర్భువస్సువః తత్సవితుర్వర్యేణ్యం,
భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్!!
నీటిని నివేదన చుట్టూ జల్లుతూ ... సత్యం త్వర్తేన పరిషించామి, అమృతమస్తు, అమృతో పస్తరణమసి... ఓం ప్రాణాయ స్వాహా, ఓం ఆపానాయ స్వాహా, ఓంవ్యానాయస్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా, ఓం బ్రహ్మేణ్యే స్వాహాగుడ సహితఫల నివేదనం సమర్పయామి, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి (నీటిని వదలాలి).


ఓం శ్రీ మహాగణాధిపతయే నమః తాంబూలం సమర్పయామి, తాంబూలానంతరం అచమనంసమర్పయామి. హారతి ఇచ్చి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః కర్పూర నీరాజనం సమర్పయామి. అనంతరం ఆచమనీయం సమర్పయామి! 


మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప
యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే ..  


వినాయకుడి పూజ పూర్తైన తర్వాత భక్తితో నమస్కరించి అక్షతలు తీసి వేసుకోవాలి. అనంతరం వరలక్ష్మీ వ్రతాన్ని ప్రారంభించాలి....