Tirumala New Year 2025: నూతన సంవత్సరం 2025 జనవరిలో తిరుమలలో జరిగే విశేష ఉత్సవాల వివరాలను TTD వెల్లడించింది. ఏ తేదీల్లో ఏ ఉత్సవాలను నిర్వహిస్తారో జాబితా ఇక్కడ తెలుసుకోండి. జనవరి 9న చిన్న శాత్తుమొర ఉత్సవం నుంచి జనవరి 29 శ్రీ పురంధర దాస ఆరాధన మహోత్సవాలు వరకూ వైభవంగా జరగనున్నాయి..ఈ నెలలో అత్యంత ముఖ్యమైన రోజు వైకుంఠఏకాదశి...
Also Read: నూతన సంవత్సరం 2025 ఆరంభం ఈ రాశులవారికి బంగారంలా ఉంటుంది!
జనవరి 09
చిన్న శాత్తుమొర
జనవరి 10
వైకుంఠ ఏకాదశి, స్వర్ణ రథోత్సవం, వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభం
జనవరి 11
వైకుంఠ ద్వాదశి, స్వామి పుష్కరిణి తీర్థ ముక్కోటి చక్ర స్నానం.
జనవరి 15
ప్రణయ కలహోత్సవం మరియు గోదా పరిణయం.
జనవరి 17
తిరుమళిసై ఆళ్వార్ వర్ష తిరు నక్షత్రం.
జనవరి 18
శ్రీ త్యాగరాజ ఆరాధనోత్సవం
జనవరి 19
పెద్ద శాత్తుమొర, వైకుంఠ ద్వార దర్శనం ముగింపు.
జనవరి 20
శ్రీ కూరత్తాళ్వార్ వర్ష తిరు నక్షత్రం.
జనవరి 23
అధ్యాయనోత్సవాలు సమాప్తం.
జనవరి 24
తిరుమల నంబి చెంతకు శ్రీ మలయప్పస్వామి వేంచేపు.
జనవరి 25
సర్వ ఏకాశశి జనవరి 26: గణతంత్ర దినోత్సవం
జనవరి 27
మాస శివరాత్రి.
జనవరి 29
శ్రీ పురంధర దాస ఆరాధన మహోత్సవాలు
Also Read: 2025 జనవరి మొదటి వారం మేష రాశి to కన్యా రాశి 6 రాశుల వారఫలాలు!
వైకుంఠ ఏకాదశి ప్రత్యేకం
మరోవైపు జనవరి 10న ముక్కోటి ఏకాదశి/ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ...వైకుంఠ ద్వార దర్శనాల టోకెన్ల జారీపై టీటీడీ ఇప్పటికే కీలక ప్రకటన చేసింది. జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నారు..దీనికి సంబంధించి తిరుపతి, తిరుమలలో సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్ల జారీకి 91 కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు. తిరుమలేశుడి వైకుంఠ ద్వార దర్శనాలు జనవరి 10 నుంచి ప్రారంభం కానున్నాయి. జనవరి 10, 11, 12 తేదీలకోసం జనవరి 9న టోకెన్లు జారీ చేయనున్నారు. ఆ తర్వాత మూడు రోజులకు ఆ ముందు రోజు టోకెన్లు జారీ చేస్తామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. ఆధార్ కార్డ్ చూపించి ఈ టోకెన్లు పొందాలని...ఈ పది రోజుల పాటూ టోకెన్లు ఉన్న భక్తులను మాత్రమే శ్రీవారి దర్శనానికి అనుమతిస్తామని..టోకెన్లు లేని భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించేది లేదని స్పష్టం చేశారు.
వైకుంఠ ఏకాదశి ప్రత్యేక ఏర్పాట్లు
జనవరి 10 నుంచి 19 వరకు పది రోజుల పాటు రోజుకు దాదాపు 70 వేలకు పైగా భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు టీడీపీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఆన్ లైన్ లో విడుదల చేయగా.. రోజుకు 40 వేల చొప్పున 10 రోజులకు 4 లక్షల సర్వదర్శన టోకెన్లను తిరుపతిలో 8, తిరుమలలో ఒక కేంద్రం ద్వారా జారీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
డిసెంబరు 30వ తేదీ నుంచి శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ప్రారంభమవుతాయి. వైకుంఠ ఏకాదశికి 11 రోజులు ముందు నుంచీ ధనుర్మాసంలో శ్రీవారి సన్నిధిలో అధ్యయనోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఇక జనవరి 7న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. జనవరి 10న వైకుంఠ ఏకాదశి రోజు ఉదయం 9 నుంచి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు స్వర్ణరథంపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తారు. జనవరి 11 వైకుంఠ ద్వాదశి రోజు ఉదయం 5.30 నుంచి 6.30 గంటల వరకు చక్రస్నానం నిర్వహిస్తారు.
Also Read: మేషం to మీనం .. 2025 సంవత్సరం ఏ రాశివారి అదృష్టం ఎలా ఉంది!