జ్యోతిష్యశాస్త్రంలో గ్రహణాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. గ్రహణం పడుతుందంటే చాలు మన భారతీయులు ఆ రోజు అంతా చాలా జాగ్రత్తగా ఉంటారు. గ్రహణం అయిపోయిన తర్వాత స్నానాలు చేసి భోజనం చేస్తుంటారు. ఎందుకంటే హిందువులు గ్రహణాలను అశుభంగా పరిగణిస్తారు. అయితే, ఈ ఏడాది మొదటి సూర్యగ్రహణం మార్చి 25, ఆ తర్వాత చంద్రగ్రహణం ఏప్రిల్ 8న ఏర్పడనుంది. పదిహేను రోజుల్లోనే రెండు గ్రహణాలు ఏర్పడటం వల్ల కొన్ని రాశుల వారికి శుభం కలగనుందట. ఆ రాశుల వారెవరో ఇక్కడ చూద్దాం..
సింహరాశి: చంద్రగ్రహణం ఈ రాశి వారికి శుభ ఫలితాలను ఇవ్వనుంది. దీంతో విదేశాలకు వెళ్లాలనుకున్న కోరిక అతి త్వరలో నెరవేరుతుంది. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. మీరు ఏ పని మొదలు పెట్టినా అదృష్టం మీ వెంటే ఉంటుంది. మీ ప్రేమ జీవితంలో మీరు సంతోషంగా గడుపుతారు. అంతే కాకుండా మీకు ఇష్టమైన వారితో మనసు విప్పి మాట్లాడతారు. మీ జీవిత భాగస్వామి వల్ల మీ ఆనందం రెట్టింపు అవుతుంది. ఈ ఏడాది మీ జీవితం మొత్తం మారిపోనుంది. పరీక్షల్లో మంచి విజయం సాధిస్తారు. మీ ప్రతిష్టాత్మక ప్రణాళికలు కూడా ఈరోజు విజయవంతమవుతాయి. పరీక్షలు రాసే వారు మంచి ఫలితాలను పొందుతారు.
కన్యా రాశి: సూర్య, చంద్ర గ్రహణాలు ఈ రాశి వారి పంట పండనుంది. ఈ సమయంలో పెట్టే పెట్టుబడులు వారికి ఉహించని విధంగా లాభాలను ఇస్తాయి. రెండు ముఖ్యమైన శుభవార్తలు వినే అవకాశం ఉంది. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం వస్తుంది దీని వల్ల మీ కుంటుంబ సభ్యులు సంతోషాన్ని వ్యక్తం చేస్తారు. మీ ప్రేమ జీవితంలో మీకు అమృతంగా మారుతుంది. ఏ పనులు మొదలు పెట్టినా చాలా ఉత్సాహంగా ముందుకు వెళ్తుంటారు. కెరీర్ పరంగా చాలా బావుంటుంది. ఇన్ని రోజుల పడిన కష్టానికి తగిన ఫలితం దక్కనుంది. మీరు చేసే ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి. ఈ సమయంలో వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగులకు వారి కార్యాలయంలో చక్కగా ఉంటుంది. మీరు చేసే పనిని మీ బాస్ మెచ్చుకుని శాలరీ ఇంక్రిమెంట్ ఇస్తారు.
మేషరాశి: ఈ రాశి వారికి సూర్యుని గమనం మంచిది. మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. వ్యాపారులు అధిక లాభాలు పొందుతారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆఫీసులో సహోద్యోగుల సహాయం అందుతుంది. మీ ప్రాజెక్ట్ విజయవంతమవుతుంది. ఈ రాశి యొక్క వ్యక్తులు కుటుంబ జీవితాన్ని ఆనందిస్తారు. ఎందుకంటే అసంపూర్తిగా ఉన్న అన్ని వ్యాపారాలు త్వరలో పుంజుకుంటాయి. కుటుంబ సభ్యుల మధ్య సాన్నిహిత్యం కూడా పెరుగుతుంది. మీ బలం, సామర్థ్యాలు పెరుగుతూనే ఉంటాయి. మీ కుటుంబానికి మంచి జరుగుతుంది. మీ నైపుణ్యాలు పెరుగుతాయి. మీరు వృత్తిపరంగా కూడా పురోగతి సాధిస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటారు. ఈ సమయంలో శుభవార్త వింటారు. మీ కష్టానికి తగిన ఫలితాలొస్తాయి. వ్యాపారులకు మంచి లాభాలొచ్చే అవకాశాలున్నాయి.
Also Read: తెలివైనవాడికి శత్రువులు ఎందుకుండరు?
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.