రోజూ నిద్ర లేవగానే తులసి మొక్కను దర్శించడం, ప్రదక్షిణలు చేయడం వల్ల సప్త ద్వీపాలతో కూడిన సమస్త భూ మండలాన్ని, అందులోని తీర్థాలను, క్షేత్రాలను దర్శించినంత పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతారు. తులసి మొక్కను నాటినా, నీరు పోసినా, తాకినా, పెంచిన మోక్షం సిద్ధిస్తుందంటారు. అందుకే తులసిని దేవతా వృక్షంగా భావిస్తారు హిందువులు. అలాంటి పరమ పవిత్రమైన చెట్టు కేవలం దైవ సంబంధమైన పూజకే కాదు మన ఇంట్లో జరగబోయే మంచిచెడులను మనకు ముందే తెలియజేస్తుందంటారు.




తులసి మొక్క ఒక్కోసారి నీళ్లుపోయికపోయినా ఏపుగా పెరుగుతుంది…మరోసారి ఎంత జాగ్రత్తగా చూసుకున్నా ఎండిపోతుంది. ఇంకోసారి రంగులు మారుతుంటుంది. ఎంత జాగ్రత్తగా చూసుకున్నా ఇలా జరుగుతోందేంటనే భావన చాలామందికి కలుగుతుంది. అయితే భయపడాల్సి ఏమీ లేదుకానీ…మనింట్లో ఏం జరగబోతుందో తులసి మొక్క చెబుతుందని అంటారు పండితులు.



  1. తులసి చెట్టు ఎప్పుడూ పచ్చగా ఉంటే...ఆ ఇంట్లో ఆనందం, సంతోషం ఉంటాయి. ఇంట్లో వారికి ఎలాంటి సమస్యలు రావని అర్థం.

  2. ఒకవేళ నీళ్ళు పోయకున్నా తులసి మొక్క బాగా పచ్చగా, ఏపుగా పెరుగుతున్నా...ఆ మొక్క చుట్టూ చిన్న చిన్న మొక్కలు మరికొన్ని వచ్చినా.... ఇంట్లో వారికి అదృష్టం కలిసి వస్తుందని చెబుతారు.

  3. పచ్చగా కళకళలాడుతున్న తులసి ఆకులు అకస్మాత్తుగా ఎండిపోతే.... ఆ ఇంటి యజమానికి ఆరోగ్యపరంగా కీడు జరుగబోతోందని అర్థం. అంటే అనారోగ్యం బారిన పడతారని హెచ్చరిక.

  4. ఆకులు ఉన్నట్టుండి రంగుమారితే... ఇంట్లో ఉన్నవారు క్షుద్ర శక్తుల బారిన పడనున్నారని అర్థం. ఎవరైనా గిట్టనివారు క్షుద్రశక్తులు ప్రయోగించినప్పుడే తులసి ఆకులు రంగు మారుతాయని చెబుతారు.


అంటే తులసి మొక్కకు భక్తితో పూజ చేయడమే కాదు... ఆరోగ్యంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. మొక్కలో మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి.




తులసి ఆకులను ఎప్పుడు తుంచరాదంటే….


సనాతన సంప్రదాయాల ప్రకారం ఆది, మంగళ, గురు, శుక్రవారాల్లో…. ద్వాదశి అమావాస్య, పున్నమి తిథుల్లో తులసి ఆకులను తుంచరాదు. రాత్రి వేళ, స్నానం చేయకుండా, పాదరక్షలతో తులసి మొక్కను ముట్టుకోరాదు. మరో ముఖ్య విషయం ఏంటంటే తులసి ఆకులను ఒంటిగా కాకుండా మూడు ఆకుల దళంతో తుంచాలని చెబుతారు. తులసిని ఈశాన్యం మూలకి కానీ…తూర్పువైపు కానీ నాటాలి. సూర్యుడి కిరణాలు పడేలా చూడాలి….


తులసీ స్మరణేరైవ సర్వపాపం వినశ్యతి తులసీ స్పర్శనేరైవ సశ్యంతి వ్యాదయో నృణామ్"


ఈ దేవతా వృక్షాన్ని స్మరిస్తేనే సర్వపాపాలు నశిస్తాయని...తులసి మాలను ముట్టుకుంటే వ్యాధులు దూరమవుతాయని హిందువుల విశ్వాసం. తులసి మొక్క ఆకులు, కొమ్మలు, గింజలు, వేర్లు అన్నింటినీ వైద్య రంగంలో ఉపయోగిస్తారు.