TTD 2026 diaries and calendars: ప్రతి సంవత్సరం భక్తుల అభిరుచికి అనుగుణంగా అద్భుతమైన క్యాలెండర్లు, డైరీలు విడుదల చేస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానం. 2026 సంవత్సరానికి సంబంధించిన  ఇప్పటికే భక్తుల అందుబాటులోకి తీసుకొచ్చారు. శ్రీవేంకటేశ్వర స్వామి వాహిని అయిన ఈ క్యాలెండర్లు, డైరీలు కేవలం తేదీలు, పంచాంగాలు మాత్రమే కాకుండా, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, TTD కార్యక్రమాలను, ఉత్సవాలకు సంబంధించిన వివరాలు కూడా అందిస్తాయి. 

Continues below advertisement

భక్తులు వీటిని ఇంట్లోనే కాకుండా కార్యాలయాల్లో ఉపయోగించుకుంటారు. TTD 2026 క్యాలెండర్లు వివిధ రకాలుగా ఉన్నాయి. 

12-పేజీల వాల్ హ్యాంగింగ్ క్యాలెండర్ (రూ.130)6-పేజీల భారీ సైజు క్యాలెండర్ (రూ.150)టేబుల్ టాప్ క్యాలెండర్ (రూ.75)

Continues below advertisement

ఇందులో శ్రీవెంకటేశ్వర స్వామి, శ్రీ పద్మావతి అమ్మవారి అద్భుతమైన ఫోటోలు, తిరుమల ఉత్సవాలు, స్వామి అమ్మవార్ల  దర్శనాలు, గురు పౌర్ణమి, బ్రహ్మోత్సవాలు వంటి ముఖ్య ఈవెంట్ల తేదీలు వివరంగా ఉంటాయి. 

తెలుగు పంచాంగం క్యాలెండర్ (రూ.30) ప్రత్యేకంగా ఉపయోగకరం. ఇందులో వ్రతాలు, తిథులు, నక్షత్రాలతో పాటు TTD హెల్ప్‌లైన్ నంబర్లు, సేవల వివరాలు ఉంటాయి. 

శ్రీవారు అమ్మవారు ఉన్న క్యాలెండర్లు (రూ.15) కొనుగోలు చేసేందుకు ఎక్కువ మంది భక్తులు పోటీపడుతుంటారు. ఈ క్యాలెండర్లు  క్వాలిటీ పేపర్‌లో ముద్రించడంతో.. ఇల్లు, కార్యాలయంలో పెట్టేందుకు అనుకూలంగా ఉంటాయి

డైరీల విషయానికి వస్తే, డీలక్స్ డైరీ (రూ.150), చిన్న డైరీ (రూ.120). ఇవి 365 పేజీలతో ప్రతి రోజు పంచాంగ వివరాలు, టిటిడి ట్రస్ట్ సమాచారం, తిరుమల ఆవాసాలు, అర్జిత సేవలు, మాస ప్రతి మాస ఉత్సవాల వివరాలు ఉంటాయి. డైరీల మొదటి పేజీల్లో శ్రీవారి చరిత్ర, టిటిడి కాల్ సెంటర్లు, ఇన్ఫర్మేషన్ సెంటర్లు వివరాలు ఉంటాయి. భక్తులు ఇవి రోజువారీ ప్లానింగ్‌కు, ఆధ్యాత్మిక  వివరాలకు ఉపయోగిస్తారు. ఇవి సబ్సిడైజ్డ్ రేట్లకు అందిస్తారు. 

ఈ డైరీలు, క్యాలెండర్లు ఆఫ్‌లైన్‌లో తిరుమల, తిరుపతి పబ్లికేషన్ స్టాల్స్‌లో (టిటిడి అడ్మిన్ బిల్డింగ్ ప్రతిరూపంలో, గోవిందరాజ స్వామి ఆలయం దగ్గర, శ్రీనివాసం, విష్ణునివాసం) లభిస్తాయి. తిరుచానూర్, విజయవాడ, విశాఖపట్నం, చెన్నై (ఎస్వీ, పద్మావతి ఆలయాలు), హైదరాబాద్ (హిమాయత్‌నగర్, జూబ్లీహిల్స్), బెంగళూరు, న్యూఢిల్లీ, ముంబై, వేలూరు, రాజమండ్రి, కర్నూలు, కాకినాడ, నెల్లూరు కల్యాణమండపాల్లో కూడా అందుబాటులో ఉన్నాయి. ఆన్‌లైన్‌లో www.tirumala.org, ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ల ద్వారా ఆర్డర్ చేసి, డోర్ డెలివరీ పొందవచ్చు. 

డెబిట్/క్రెడిట్ కార్డ్‌ల ద్వారా చెల్లింపు, ప్యాకింగ్-షిప్పింగ్ ఛార్జీలు అదనంగా చెల్లించాలి. విదేశీ భక్తులు కూడా ఈ సౌలభ్యం పొందొచ్చు. భారతదేశం బయటి డెలివరీ కోసం స్పెషల్ అరేంజ్‌మెంట్లు ఉన్నాయి. 

TTD ఈ ఉత్పత్తుల ద్వారా భక్తులకు స్వామి స్మరణను, ధార్మిక జీవనాన్ని ప్రోత్సహిస్తోంది. గత సంవత్సరాల్లా 2026 డైరీలు, క్యాలెండర్లు వేగంగా అమ్ముడుపోతాయి. ఆసక్తి ఉన్న భక్తులు త్వరగా ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో బుక్ చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు.

తిరుమలలో ఉన్నది రాతి విగ్రహం కాదు.. సజీవంగా నిల్చున్న శ్రీ వేంకటేశ్వరుడు -  తిరుమలలో జరిగే సేవలేంటి? ఏ సేవలో ఏం చేస్తారు? ఏ సేవకు వెళితే మంచిది? ఈ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

బంగారం, వెండి ధరల్లో భారీ హెచ్చు తగ్గులు..ఏ ఏ నెలల్లో పుత్తడి ధర తగ్గుతుందో పూర్తి సమాచారం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి