2025 అక్టోబర్ 09 రాశిఫలాలు - Rasi Phalalu Today in Telugu 9 October 2025

Continues below advertisement

మేష రాశి

ఈ రోజు మేషరాశి వారికి శుభ ఫలితాలున్నాయి. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. సంతోషంగా ఉంటుంది. వ్యాపారులకు చిన్న ప్రయాణం ద్వారా లాభం ఉంటుంది. ఉద్యోగులు కొత్త ఆఫర్ లేదా పదోన్నతి పొందే అవకాశం ఉంది. సంతానం నుంచి శుభవార్త అందుతుంది.  కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.

Continues below advertisement

శుభ సంఖ్య: 5రంగు: ఎరుపుపరిహారం: హనుమంతునికి బెల్లం , శనగలను సమర్పించండి.

వృషభ రాశి

సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే వారికి ఈ రోజు మంచిది. మీ గౌరవం, ప్రతిష్టను పెంచే అవకాశాలు లభిస్తాయి. అధికారులు , ప్రభుత్వం ద్వారా సత్కారం అందుకుంటారు. ఆధ్యాత్మిక పనుల్లో మనస్సు లగ్నమవడం వల్ల మానసిక శాంతి లభిస్తుంది. ప్రేమ జీవితంలో భాగస్వామి ప్రవర్తనలో మార్పులు కనిపిస్తాయి. చిన్న వ్యాపారులు ఆశించిన దానికంటే తక్కువ లాభం పొందవచ్చు.

శుభ సంఖ్య: 6రంగు: తెలుపుపరిహారం: లక్ష్మీదేవి ముందు దీపం వెలిగించండి.

మిథున రాశి

ఈ రోజు మిథున రాశి వారు బిజీగా ఉంటారు. పని చేసే ప్రదేశంలో మార్పులు   కొత్త బాధ్యతలు లభిస్తాయి. కుటుంబ జీవితంలో కొన్ని ఫిర్యాదులు వినవలసి రావచ్చు. జీవిత భాగస్వామి ఏదో ఒక విషయంలో కోపంగా ఉంటారు. సోదరి వివాహంలో అడ్డంకులు తొలగిపోతాయి. స్నేహితులు ,బంధువుల సహకారం లభిస్తుంది. విద్యార్థులు కోరుకున్న ఫలితాలు సాధించి సంతోషిస్తారు.

శుభ సంఖ్య: 3రంగు: ఆకుపచ్చపరిహారం: గణేశునికి దూర్వను సమర్పించండి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ రోజు ఆనందంగా ఉంటుంది. భూమి , ఆస్తికి సంబంధించిన వివాదాలలో మీ వైపున నిర్ణయం రావచ్చు. పోటీల్లో విజయం సాధించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల సహకారం మరియు ప్రోత్సాహం లభిస్తుంది. ప్రయాణించేటప్పుడు జాగ్రత్త వహించండి . వాహనంపై ఖర్చు చేసే అవకాశాలు ఉన్నాయి.  

శుభ సంఖ్య: 2రంగు: తెలుపుపరిహారం: శివునికి పాలు సమర్పించండి.

సింహ రాశిఈ రోజు సింహ రాశి వారు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.  ఏకాగ్రత లేకపోవడం వల్ల పని ఆగిపోవచ్చు. ఆరోగ్య సంబంధిత సమస్యలు ఉంటే వైద్యుడిని సంప్రదించండి. వ్యాపారంలో రహస్య శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండండి. కొత్త పెట్టుబడి లేదా వ్యాపారం ప్రారంభించడానికి రోజు అనుకూలంగా ఉంటుంది. రోజు చివరిలో కొంత ఉపశమనం లభిస్తుంది.

శుభ సంఖ్య: 1రంగు: బంగారుపరిహారం: సూర్య భగవానుడికి నీరు సమర్పించండి.

కన్యా రాశికన్య రాశి వారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది. కుటుంబ సమస్యలను పరిష్కరించడానికి సమయం గడుపుతారు, దీనివల్ల కొన్ని ముఖ్యమైన పనులు పూర్తికావు. వ్యాపారంలో ఆశించిన లాభాలురావు. జీవిత భాగస్వామితో ప్రత్యేక చర్చలుంటాయి. కుటుంబంలో ఓ సభ్యుడి ఆరోగ్యం క్షీణించవచ్చు. అకస్మాత్తుగా ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి.

శుభ సంఖ్య: 5రంగు: ఆకుపచ్చపరిహారం: విష్ణు సహస్రనామం పారాయణం చేయండి.

తులా రాశిఈ రోజు తులా రాశి వారికి మానసిక శాంతి లభిస్తుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడటం వల్ల ఆందోళన తగ్గుతుంది. ఆస్తికి సంబంధించిన ఏదైనా సమస్య పరిష్కారం అవుతుంది. విద్యార్థులు పరీక్షలలో విజయం సాధిస్తారు. కుటుంబ జీవితంలో ప్రేమ , సామరస్యం కొనసాగుతుంది. పిల్లల సహకారం కూడా లభిస్తుంది.

శుభ సంఖ్య: 7రంగు: గులాబీపరిహారం: దుర్గామాతకు ఎర్రటి  పూలు సమర్పించండి.

వృశ్చిక రాశివృశ్చిక రాశి వారికి ఇది కలిసొచ్చే సమయం. వ్యాపారంలో కొత్త మార్పులు చేయడానికి సమయం శుభంగా ఉంటుంది.   వివేకంతో తీసుకున్న నిర్ణయాలు లాభాలను తెస్తాయి. ఏదైనా సలహా పాటించే ముందు అన్ని అంశాలను పరిగణించండి. వాహనం కొనడానికి రోజు అనుకూలంగా ఉంది. ఇంట్లో సౌకర్యాలు పెరుగుతాయి.

శుభ సంఖ్య: 9రంగు: ఎరుపుపరిహారం: మంగళవారం హనుమాన్ చాలీసా పారాయణం చేయండి.

ధనుస్సు రాశిఈ రోజు ధనుస్సు రాశి వారికి ఆర్థిక ఉపశమనం లభిస్తుంది. ఏదైనా అప్పు ఉంటే  దానిని తీర్చగలుగుతారు. భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టడానికి ప్లాన్ చేస్తారు. జీవిత భాగస్వామి సహకారంతో సంబంధాలు బలపడతాయి. సంతానం విజయం సాధించడం వల్ల మనస్సు సంతోషంగా ఉంటుంది.  

శుభ సంఖ్య: 8రంగు: పసుపుపరిహారం: విష్ణు భగవానుడిని పూజించండి

మకర రాశిమకర రాశి వారు ఈ రోజు తమ తెలివిని ఉపయోగించాలి. కొత్త వ్యాపారం ప్రారంభించడానికి ఇది మంచి సమయం. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబంలో ఉన్న ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. వివాహం చేసుకునే సభ్యునికి మంచి ప్రతిపాదన రావచ్చు. ప్రేమ జీవితంలో మాధుర్యం కొనసాగుతుంది.

శుభ సంఖ్య: 4రంగు: నీలంపరిహారం: శని దేవునికి ఆవాల నూనెను సమర్పించండి.

కుంభ రాశికుంభ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యక్తిగత పనులను పూర్తి చేస్తారు.  మీ కోసం కొన్ని కొనుగోళ్లు కూడా చేస్తారు. కుటుంబంలో కొంతమంది మీ పురోగతిని చూసి అసూయపడవచ్చు. ప్రభుత్వ ఉద్యోగం చేసేవారు పదోన్నతి లేదా గౌరవం పొందే అవకాశం ఉంది. విద్యార్థులు ఏకాగ్రతతో ఉండాలి.

శుభ సంఖ్య: 2రంగు: ఊదాపరిహారం: రావి చెట్టుకు నీరు సమర్పించండి.

మీన రాశిమీన రాశి వారికి ఈ రోజు ఉత్సాహంగా ఉంటుంది. పాత పెట్టుబడుల నుంచి లాభం ఉంటుంది. కొత్త మార్గాల ద్వారా ఆదాయం వచ్చే అవకాశాలు లభిస్తాయి. తండ్రితో కుటుంబ చర్చలు ఉపయోగకరంగా ఉంటాయి. రాజకీయాలు  సామాజిక సేవలో ఉన్నవారికి ప్రజల మద్దతు లభిస్తుంది 

శుభ సంఖ్య: 3రంగు: నీలంపరిహారం: విష్ణువుకు తులసి దళాలను సమర్పించండి.