మే 4 బుధవారం పంచాంగం


శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు


తేదీ: 04- 05 - 2022
వారం:  బుధవారం 


శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖమాసం, శుక్లపక్షం


తిథి  : చవితి బుధవారం పూర్తిగా ఉంది గురువారం సూర్యోదయం సమయానికి పంచమి వస్తుంది  
వారం : బుధవారం 
నక్షత్రం: మృగశిర  రాత్రి తెల్లవారుజాము 3.55 వరకు తదుపరి ఆరుద్ర
వర్జ్యం : ఉదయం 7.32 నుంచి 9.18  
దుర్ముహూర్తం : ఉదయం 11.32 నుంచి 12.22  
అమృతఘడియలు :  సాయంత్రం 6.30 నుంచి 8.16 వరకు 
సూర్యోదయం: 05:36
సూర్యాస్తమయం : 06:16


( తెలుగువారు ముఖ్యంగా తిథి, నక్షత్రం, వర్ద్యం, దుర్ముహూర్తం, రాహుకాలం మాత్రమే చూసుకుని ఏదైనా పనిప్రారంభిస్తారు...మిగిలిన వాటిని పెద్దగా పరిగణలోకి తీసుకోరు. పంచాగం, ప్రాంతం ఆధారంగా సమయాల్లో స్వల్ప మార్పులుంటాయి)


Also Read: మాహిష్మతిని జయించిన మహావీరుడి గురించి తెలుసా


బుధవారం వినాయకుడికి అత్యంత ప్రీతికరమైన రోజు.బుధవారం వినాయకుడికి ఎర్ర మందారాలతో పూజించడంవల్ల అనుకున్న కార్యాలు నెరవేరుతాయి.చక్కటి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. ముఖ్యంగా గణేషుడి ముందు గుండీలు తీస్తే చాలామంచిది అంటారు. అంటే భక్తులు గుంజీలు తీయడం గణనాథుడికి ఇష్టమా...దీని వెనుక ఓ కథ ప్రచారంలో ఉంది. 


శ్రీ మహావిష్ణువు ఓసార కైలాసానికి వెళ్లాడట. అక్కడ మర్యాదలన్నీ అయ్యాక శివ,కేశవులిద్దరూ కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఇంతలో అక్కడకు వచ్చిన గణపతి చటుక్కున్న శ్రీహరి చేతిలో ఉన్న సుదర్శన చక్రాన్ని విచిత్రంగా చూసి చటుక్కున తీసుకుని నోట్లో పెట్టేసుకున్నాడు. విష్ణువు ఎంత బతిమాలినా వినాయకుడు ఆ చక్రం తిరిగివ్వలేదు. చిన్నపిల్లాడు కదా ఏం చేద్దాం అని ఆలోచించిన శ్రీమహావిష్ణువు రెండు చేతులతో చెవులు పట్టుకుని సరదాగా గుంజీలు తీయడం ప్రారంభించాడట. అది చూసి బాలగణేషుడు నవ్వటం మొదలెట్టాడట.అప్పుడు గణపతి నోట్లోంచి విష్ణుచక్రం కిందపడింది. అలా తనపని పూర్తిచేసుకోవడం కోసం సాక్షాత్తూ విష్ణుమూర్తి గుంజీలు తీయడంతో..అప్పటి నుంచి భక్తులు కూడా వినాయకుడిని ప్రసన్నం చేసుకునేందుకు గుంజీలు తీయడం ప్రారంభించారు.


గణపతి మంత్రం


ఓం శ్రీ గణేశాయ నమః ||


వినాయకుని శ్లోకం


శుక్లాం బరదరం విష్ణుం శశి వర్ణం చతుర్భుజం ||
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే ||
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం || 
అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే ||


వక్ర తుండ మహా కాయ సూర్య కోటి సమ ప్రభ ||
నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా ||
ఓమ్ శ్రీ మహా గణాధి పతయే నమః ||


ఆగజానన ఫద్మార్కం ||
ఘజాననం ఆహర్నిషం ||
ఆనెకదంథం భక్తానాం ||
ఏకదంతం ఊపాస్మహెయ్ ||


ఘజాననం భూత ఘనాధి శెవితం ||
ఖపిత్త ఝంబూఫాల శార భక్షితం ||
ఊమాసుతం షొక వినాష ఖారనం ||
ణమామి విఘ్నెస్వర ఫాద ఫంకజం ||


ఘనానాం ట్వం ఘనపథి ఘం హవామహె ||
ఖవిం ఖవీనాం ఊపమస్ర వస్తమం ||
ఝ్యెష్త ఋఆజం భ్రహ్మనాం భ్రహ్మనస్పథ ||
ఆఅనష్రున్వన్న ఓఒథిభి శీధ శాదనం ||


యత్పురుషాయ విద్మహె ||
వక్రతుందాయ ఢీమహె ||
తన్నొ డంథిహి ఫ్రచొదయాత్ ||


Also Read: పుట్టింట్లో అవమానాన్ని భరించలేక అగ్నిలో దూకిన పార్వతి, పరమేశ్వరుడు ఏం చేశాడంటే