మే 21 శనివారం పంచాంగం
శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు
తేదీ: 21- 05 - 2022
వారం: శనివారం
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖమాసం, బహుళపక్షం
తిథి : షష్టి శనివారం రాత్రి 8.05 వరకు తదుపరి సప్తమి
వారం : శనివారం
నక్షత్రం: ఉత్తరాషాడ ఉదయం 6.19 తదుపరి శ్రవణం రాత్రి తెల్లవారుజామున 4.46 వరకు
వర్జ్యం : ఉదయం 10.03 నుంచి 11.33
దుర్ముహూర్తం : సూర్యోదయం నుంచి 7.14 వరకు
అమృతఘడియలు : సాయంత్రం 6.52 నుంచి 8.22 వరకు
సూర్యోదయం: 05:30
సూర్యాస్తమయం : 06:22
( తెలుగువారు ముఖ్యంగా తిథి, నక్షత్రం, వర్ద్యం, దుర్ముహూర్తం, రాహుకాలం మాత్రమే చూసుకుని ఏదైనా పనిప్రారంభిస్తారు...మిగిలిన వాటిని పెద్దగా పరిగణలోకి తీసుకోరు. పంచాగం, ప్రాంతం ఆధారంగా సమయాల్లో స్వల్ప మార్పులుంటాయి)
శనివారం సందర్భంగా పాఠకుల కోసం దశరథ ప్రోక్త శనిస్త్రోత్రం
శ్రీ దశరథ ప్రోక్త శనైశ్చర స్తోత్రమ్
అస్య శ్రీ శనైశ్చర స్తోత్ర మంత్రస్య దశరథ ఋషిః
శనైశ్చరో దేవతాః త్రిష్టుపా చందః
శనైశ్చర ప్రీత్యర్దే జపే వినియోగః
దశరథ ఉవాచ
కోణస్థ రౌద్ర మయోథ బభ్రుః
కృష్ణః శనిః పింగళ మంద సౌరిః
నిత్యం స్మృతో యో హరతే చ పీడాం
తస్మై నమః శ్రీరవినందనాయ ||
సురాసుర కింపురుషా గణేంద్రా
గంధర్వ విద్యాధర పన్నాగాశ్చ
పీడ్యంతి సర్వే విషమ స్థితేన
తస్మై నమః శ్రీరవినందనాయ ||
నరా నరేంద్రాః పశవో మృగేంద్రా
వన్యాశ్చ యే కీట పతంగ భృంగా
పీడ్యంతి సర్వే విషమ స్థితేన
తస్మై నమః శ్రీరవినందనాయ ||
దేవాశ్చ దుర్గాణి వనాని యత్ర
సేనానివేశాః పుర పట్టాణాని
పీడ్యంతి సర్వే విషమ స్థితేన
తస్మై నమః శ్రీరవినందనాయ ||
తిలైర్య వైర్మాష గుడాన్నదానై
లోహేనా నీలాంబర దానతోవా
ప్రీణాది మంత్రైర్నిజ వాసరేచ
తస్మై నమః శ్రీరవినందనాయ ||
ప్రయాగ తీరే యమునాతటే చ
సరస్వతీ పుణ్యజలే గుహాయామ్
యో యోగినాం ధ్యానగతోపి సూక్ష్మః
తస్మై నమః శ్రీ రవినందనాయ ||
అస్య ప్రదేశాత్స్వ గృహం ప్రవిష్ట
స్వదీయ వారే సనరః సుఖీ స్యాత్
గృహద్గ తౌ యోన పునః ప్రయాతి
తస్మై నమః శ్రీ రవి నందనాయ ||
స్రష్టా స్వయంభూర్భువ సత్రయస్య
త్రాతా హరిః శం హరతే పినాకీ
ఏకస్త్రిధా ఋగ్యజు సామమూర్తి
తస్మై నమః శ్రీ రవి నందనాయ ||
శన్యష్టకం యః పఠతః ప్రభాతే
నిత్యం సుపుత్రైః ప్రియ బాంధవైశ్చ
పఠేశ్చ సౌఖ్యం భువిభోగయుక్తం
ప్రాప్నోతి నిర్వాణ పదం పరం సః ||
ఇతి శ్రీ దశరథ ప్రోక్త శనైశ్చర స్తోత్రమ్ సంపూర్ణం