Tirumala News

Continues below advertisement


తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తుల కోసం AI చాట్‌బాట్‌ అందుబాటులోకి తీసుకురానున్న తిరుమల తిరుపతి దేవస్థానం


అమెజాన్ వెబ్ సర్వీసెస్ ప్రతిపాదన ఆమోదించిన టీటీడీ 


13 భాషల్లో అందుబాటులోకి రానున్న సేవలు


దర్శనం, వసతి, విరాళాల సమాచారం క్షణాల్లో తెలుసుకునే అవకాశం


ఫిర్యాదులు, అభిప్రాయాలు సులువుగా తెలియజేసేందుకు అవకాశం


తిరుమల శ్రీవారి భక్తులకు త్వరితగతిన సేవల కోసం తిరుపతి దేవస్థానం (టీటీడీ) కొత్త అడుగులు వేస్తోంది. ఈ మధ్య  వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ప్రారంభించిన టీటీడీ, ఇప్పుడు కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత చాట్‌బాట్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ చాట్‌బాట్ భక్తులకు శ్రీవారి దర్శనం, సేవలు, వసతి గదులు, విరాళాలు వంటి అన్ని వివరాలను క్షణాల్లో అందజేస్తుంది. అంతేకాదు, ఫిర్యాదులు, సలహాలు కూడా ఈ వేదిక ద్వారా స్వీకరించే అవకాశం ఉంటుంది.టీటీడీ బోర్డు ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపిన తర్వాత, అత్యుత్తమ సేవలు అందించగల సంస్థల నుంచి టెండర్లు ఆహ్వానించింది. అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్), గూగుల్ క్లౌడ్ వంటి ప్రముఖ సంస్థలు ఈ పోటీలో పాల్గొన్నాయి. వీటిలో ఏడబ్ల్యూఎస్ ఏటా కేవలం రూ.50 లక్షలకే సేవలు అందించేందుకు ముందుకు రావడంతో, టీటీడీ దాని ప్రతిపాదనను ఆమోదించింది. 


ఈ చాట్‌బాట్ దాదాపు 13 భారతీయ భాషల్లో పనిచేసేలా రూపొందుతోంది. స్పీచ్ టు టెక్స్ట్, టెక్స్ట్ టు స్పీచ్ సౌకర్యాలతో భక్తులు తమ సొంత భాషలోనే సమాచారం పొందవచ్చు, పంపవచ్చు.సాఫ్ట్‌వేర్ అభివృద్ధి బాధ్యతను టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) చేపట్టింది. ఈ చాట్‌బాట్ ద్వారా ఆన్‌లైన్ బుకింగ్‌లు, దర్శన టైమింగ్స్, గదుల అందుబాటు, ప్రసాద వివరాలు వంటివి సులభంగా తెలుసుకోవచ్చు. భక్తుల రద్దీని బట్టి సమయోచిత సమాచారం, రూట్ మ్యాప్స్ కూడా అందుతాయి. ఈ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా టీటీడీ భక్తి అనుభవాన్ని మరింత సౌకర్యవంతంగా, సమగ్రంగా మలచనుంది. త్వరలోనే ఈ సేవలు ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు. ఇది శ్రీవారి భక్తులకు డిజిటల్ యుగంలో ఆధ్యాత్మిక సేవలను మరింత చేరువ చేసే మైలురాయి అవుతుంది.


 13 భారతీయ భాషల్లో పనిచేస్తుంది  AI చాట్బాట్. స్పీచ్-టు-టెక్స్ట్,  టెక్స్ట్-టు-స్పీచ్ సౌకర్యాలతో భక్తులు తమ మాతృభాషలోనే సమాచారం పొందొచ్చు. శ్రీవారి దర్శన టైమింగ్‌లు ,  రద్దీ వివరాలు, ఆన్‌లైన్ బుకింగ్‌లు (దర్శన టికెట్లు, వసతి గదులు), ప్రసాదం, విరాళాలు, రూట్ మ్యాప్‌లు  రియల్-టైమ్ అప్‌డేట్స్ తో పాటూ..ఫిర్యాదులు , సూచనలు కూడా స్వీకరిస్తుంది. దీంతో భక్తులకు శ్రీవారి సేవలు మరింత సులువుగా, త్వరితగతిన అందనున్నాయి....


వారణాసి నుంచి శివుడి ప్రపంచ సంచారం, SSMB29 లో మహేష్ క్యారెక్టర్ పై క్లారిటీ! 'సంచారి' పాటలో శివతత్వం!


కుంభకోణం చుట్టూ కొలువైన నవగ్రహ దేవాలయాలు! వివాహం, సంతానం అన్ని సమస్యలకు పరిష్కారం!


తిరుమలలో ఉన్నది రాతి విగ్రహం కాదు.. సజీవంగా నిల్చున్న శ్రీ వేంకటేశ్వరుడు -  తిరుమలలో జరిగే సేవలేంటి? ఏ సేవలో ఏం చేస్తారు? ఏ సేవకు వెళితే మంచిది? ఈ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి