శ్రీ వరాహస్వామివారి ఆలయ విమాన గోపురానికి బంగారు పూత పూసిన‌ రాగి రేకులు అమర్చేందుకు 2020, డిసెంబరు 6 నుంచి 10వ తేదీ వరకు బాలాలయ సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించారు. అప్ప‌ట్లో ఆలయం ముఖ మండపంలో నమూనా ఆలయం ఏర్పాటు చేసి గర్భాలయంలోని మూలవర్ల తరహాలో అత్తి చెక్కతో విగ్రహాలు పెట్టారు.  స్వామి, అమ్మవార్లకు నిత్యకైంకర్యాలన్నీ ఇక్కడే నిర్వహిస్తున్నారు. విమాన గోపురం ప‌నులు పూర్తి కావ‌డంతో జీర్ణోద్ధ‌ర‌ణ, అష్ట‌బంధ‌న మ‌హాసంప్రోక్ష‌ణ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. Also Read: దొంగలే పాలకులు.. పాలకులే దొంగలు...కలికాలం అంటే ఇదేన‌వంబ‌రు 24: రాత్రి 7.30 నుండి 9.30 గంట‌ల వ‌ర‌కు శ్రీ విష్వ‌క్సేనుల వారిని శ్రీ‌వారి ఆల‌యం నుంచి ఊరేగింపుగా వ‌సంత మండ‌పానికి తీసుకొచ్చి మృత్సంగ్ర‌హ‌ణం నిర్వహిస్తారు.  రాత్రి 9.30 నుంచి 10.30 గంట‌ల వ‌ర‌కు శ్రీ వ‌రాహ‌స్వామివారి ఆల‌యంలో అంకురార్ప‌ణ కార్య‌క్ర‌మాలు చేప‌డ‌తారు. న‌వంబ‌రు 25:  ఉద‌యం 7 నుంచి 10 గంట‌ల వ‌ర‌కు శ్రీ వ‌రాహ‌స్వామివారి ఆల‌య యాగ‌శాల‌లో వైదిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు. రాత్రి 8 - 10 గంట‌ల వ‌ర‌కు క‌ళాక‌ర్ష‌ణ‌, ప్ర‌బంధ పారాయ‌ణం, వేద‌పారాయ‌ణం చేప‌డ‌తారు.న‌వంబ‌రు 26,27: ఉద‌యం 8 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు, తిరిగి రాత్రి 8 నుంచి 10 గంట‌ల వ‌ర‌కు శ్రీ వ‌రాహ‌స్వామివారి ఆల‌య యాగ‌శాల‌లో వైదిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు. న‌వంబ‌రు 27: శ్రీ వ‌రాహ‌స్వామివారి ఆల‌యంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం జ‌రుగ‌నుంది.న‌వంబ‌రు 28: ఉద‌యం 8 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు శ్రీ వ‌రాహ‌స్వామివారి ఆల‌య యాగ‌శాల‌లో వైదిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు. మ‌ధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు మ‌హాశాంతి పూర్ణాహుతి, మ‌హాశాంతి తిరుమంజ‌నం చేప‌డ‌తారు. రాత్రి 8 నుండి 10 గంట‌ల వ‌ర‌కు యాగ‌శాల‌లో వైదిక కార్య‌క్ర‌మాలు, శ‌య‌నాధివాసం నిర్వ‌హిస్తారు.న‌వంబ‌రు 29:  ఉద‌యం 7.30 నుంచి 9 గంట‌ల వ‌ర‌కు శ్రీ వ‌రాహ‌స్వామివారి ఆల‌యంలో పూర్ణాహుతి, ప్ర‌బంధ శాత్తుమొర‌, వేద శాత్తుమొర నిర్వ‌హిస్తారు. ఉద‌యం 9.15-9.30 గంట‌ల వ‌ర‌కు ధ‌నుర్ ల‌గ్నంలో అష్ట‌బంధ‌న మ‌హాసంప్రోక్ష‌ణ జ‌రగ‌నుంది. రాత్రి 7- 8.30  వ‌ర‌కు శ్రీ వ‌రాహ‌స్వామివారి ఆల‌యంలోని శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఉత్సవమూర్తి ఆల‌య మాడ వీధుల్లో భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిస్తారు.Also Read: జీవిత కాలంలో ఒక్కసారైన దర్శించుకోవాల్సిన శైవ క్షేత్రాలివిAlso Read: అప్సరసలంటే ఎవరు.. మొత్తం ఎంత మంది ఉన్నారో తెలుసా..!Also Read: పన్నెండు నెలల్లో కార్తీక మాసం ఎందుకు ప్రత్యేకం .. ఈ నెలలో ఈ పనులు మాత్రం చేయకండి..!Also Read: దక్షుడు, ఇంద్రుడు, చంద్రుడు, రాముడు, కుమారస్వామి ప్రతిష్టించిన శివలింగాలివే...ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి