Tirumala: తిరుమల శ్రీవారి భక్తుల సౌకర్యార్థం మెరుగైన సౌకర్యాలు కల్పించేలా ఎన్నో చర్యలు తీసుకుంటున్న తిరుమల తిరుపతి దేవస్థానం ఈ మేరకు మరో మరో సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఈ మేరకు తిరుపతి TTD పరిపాలనా భవనంలో జరిగిన సమీక్షలో అలిపిరి చెక్ పాయింట్ పునరుద్ధరణ, భద్రత పెంపుపై చర్చించారు. TTD ఈవో శ్రీ జె శ్యామల రావు టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి ఈ సమీక్ష నిర్వహించారు. ముందుగా అలిపిరి టోల్ ప్లాజా వద్ద ఆధునిక సౌకర్యాలు, పటిష్ట భద్రత అంశాలపై GMR గ్రూప్‌నకు చెందిన రాక్సా సంస్థ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. భక్తుల చెకింగ్, లగేజీ స్కానింగ్ కి ప్రస్తుతం తీసుకుంటున్న సమయం, దాని వల్ల వస్తున్న సమస్యలపై అధికారులతో చర్చించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా వేగంగా వాహనాలు, లగేజీ స్కానింగ్ చేసేందుకు చర్యలు చేపట్టాలని GMR అనుబంధ సంస్థ అయిన రాక్సా సంస్థ ప్రతినిధులకు ఈవో సూచించారు. అలిపిరి చెక్ పాయింట్ వద్ద చెకింగ్ సమయాన్ని తగ్గించేందుకు దీర్ఘకాలిక, స్వల్ప కాలిక పరిష్కార మార్గాలను సూచించాలని కోరారు. టిటిడి విజిలెన్స్ విభాగం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని భక్తుల లగేజీ, వాహనాల స్కానింగ్ లో జాప్యం లేకుండా చర్యలు చేపట్టాలని ఈవో ఆదేశించారు.
సమావేశంలో ముఖ్యాంశాలు ఇవే తనిఖీ సమయంలో క్రాస్ ఓవర్‌లను నివారించేందుకు చర్యలు చేపట్టాలి ప్రస్తుతం ఉన్న లగేజ్ స్కానర్‌ల స్థానంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త స్కానర్లు ఏర్పాటు చేయాలి
లగేజ్ స్కానింగ్ ప్రక్రియ వేగవంతం అయ్యేలా లగేజ్ స్కానర్‌లను పెంచాలి
భక్తుల లగేజ్ కన్వేయర్ బెల్ట్‌ల ను పెంచి భద్రతా తనిఖీలో ఎక్కువ సమయాన్ని తగ్గించే అంశాన్ని పరిశీలించాలి అలిపిరి టోల్ ప్లాజాలో చివరి రెండు భద్రతా లేన్‌లలో భద్రతా సిబ్బంది అదనంగా ఉండేలా నియామకాలు పెంచాలి రాబోయే రెండు దశాబ్దాల పాటు భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక భద్రతా అంశాల ప్రతిపాదనలు సూచించాలని రాక్సా ప్రతినిధులను కోరారు ఈవో.
అత్యాధునిక తనిఖీ కేంద్రంగా అలిపిరి టోల్ ప్లాజా సెంటర్ ను మార్చడం వల్ల భక్తులు ఎక్కువ సమయం అక్కడ వేచి ఉండాల్సిన పరిస్థితి రాదు. వచ్చినవారు వచ్చినట్టుగా స్కానింగ్ చేసేసి లగేజీని మరింత వేగంగా భక్తులకు అందించవచ్చు. భక్తుల వాహనాలు, లగేజీని తక్కువ సమయంలో స్కాన్ చేయడం సమయం ఆదా అవుతుంది, అలిపిరి వద్ద రద్దీ తగ్గుతుందన్నారు. ఈ మేరకు అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ లలో స్కానింగ్ చేసి లగేజీని జాగ్రత్తగా అందిస్తున్న అంశాలను పరిశీలించాలని రెండువారాల క్రితం జరిగిన సమావేశంలో సూచించారు టీటీడీ ఈవో. ఇంకా భక్తులంతా తమ లగేజీని డిపాజిట్ చేసి తిరుమల చేరుకునేసరికి తిరిగి వారి లగేజీ అందించే అంశంపైనా TTD ఐటీ విభాగం, విజిలెన్స్ శాఖ కసరత్తు చేయాలని సూచించారు.
తిరుమలలో ఉన్నది రాతి విగ్రహం కాదు.. సజీవంగా నిల్చున్న శ్రీ వేంకటేశ్వరుడు - తిరుమలలో జరిగే సేవలేంటి? ఏ సేవలో ఏం చేస్తారు? ఏ సేవకు వెళితే మంచిది? ఈ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
బంగారం, వెండి ధరల్లో భారీ హెచ్చు తగ్గులు..ఏ ఏ నెలల్లో పుత్తడి ధర తగ్గుతుందో పూర్తి సమాచారం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి