Tirumala Laddu News: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కొలువైన క్షేత్రం తిరుమల. ఈ పుణ్యక్షేత్రావికి మరో పేరు కూడా ఉంది.. అదేంటో తెలుసా.. ఆదివరాహ క్షేత్రం... అసలు ఈ పేరు ఎలా వచ్చింది అనేది తెలుసుకుందాం.! కోరిన కోర్కెలు తీర్చే కోదండరాయుడిగా కీర్తిస్తూ తిరుమల శ్రీవారిని శరణు అంటూ భక్తులు తిరుమలకు వస్తారు. తిరుమల శ్రీవారి కంటే ముందు పుష్కరిణి పక్కన కొలువైన శ్రీ వరాహ స్వామి వారిని దర్శించుకున్నారా.. అలా చేస్తేనే తిరుమల యాత్ర సత్ఫలితం ఇస్తుంది.
Also Read: ఏడాదిలో రోజుల సంఖ్య కన్నా తిరుమలేశుడి ఉత్సవాల సంఖ్యే ఎక్కువ!
తిరుమలకు శ్రీవారు రాకమునుపే
శ్రీమన్నారాయణుడు శ్వేతవరాహరూపంతో అవతరించాడు. హిరణ్యాక్షుణ్ణి శ్రీమహావిష్ణువు వరాహావతారంలో సంహరించిన తర్వాత సాధుసంరక్షణ చేయడానికి భూలోకంలోనే ఉండటానికి అంగీకరించి వేంకటాచలం మీద తన నివాసం ఏర్పరచుకున్నాడు. తిరుమల అప్పటినుంచే ఆది వరాహక్షేత్రంగా పిలుస్తారు. పురాణాల ద్వారా మనకు వరాహ స్వామి వారే శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి స్థలం ఇచ్చారని... అందుకే ఆయనకు తొలి నైవేద్యం, తొలి దర్శనం చేసుకునే సాంప్రదాయం ఉందని తెలుస్తోంది.
వరాహ పుష్కరిణి
తిరుమల లో మీకు వరాహ పుష్కరిణి గురించి తెలుసా... అదే మనం తిరుమలలో పాప నాశనం కోసం స్నానాలు చేసే ప్రాంతం శ్రీవారి పుష్కరిణి. దీనినే వరాహపుష్కరిణి గా కూడా పిలుస్తారు. తిరుమల శ్రీవారి పుష్కరిణి మానవ నిర్మితం కాదు.. స్వయంవ్యక్తం. స్వామి పుష్కరిణి అనే ప్రసిద్ధి ఈ ఒక్క పుష్కరిణికే దక్కింది. ఈ పుష్కరిణి గురించి వరాహ-మార్కండేయ వామన- స్కాంద - బ్రహ్మ - భవిష్యోత్తర పురాణాలు అభివర్ణిస్తున్నాయి.
Also Read: బ్రహ్మోత్సవం అనే పేరెలా వచ్చింది.. దేవతలకు బ్రహ్మోత్సవ ఆహ్వానపత్రం ఎవరిస్తారు!
వేంకటాచలంలో గల మూడుకోట్ల తీర్థాలకు స్వామి పుష్కరిణి అవతారస్థానమని ప్రసిద్ధి. దివ్య తేజోపేతం, సుగంధభరితమైన ఈ పుష్కరిణి సర్వతీర్థాలకు ఉత్పత్తి స్థానమని, శ్రీనివాసుడు వేంకటాద్రిపై అవతరించకముందే ఆవిర్భవించిందని వరాహపురాణం ప్రతిపాదిస్తుంది. వరాహస్వామి నివాసం స్వామిపుష్కరిణీ పక్కనే ఉండడం వల్ల ఆయన ఆజ్ఞచేత గరుడుడు దీన్ని వైకుంఠం నుండి తీసుకొనివచ్చారని.. అందుకే దీనికి వరాహపుష్కరిణి అనే పేరు వచ్చింది.
9 తీర్థాలతో పుష్కరిణి
తిరుమలకు వచ్చే భక్తులు తప్పకుండా స్వామి వారి పుష్కరిణిలో స్నానం చేయాలని ఆశపడుతారు. ఈ పుష్కరిణిలో తొమ్మిది తీర్థాలు ఉన్నాయి. కుబేరతీర్థం, గాలవతీర్థం, మార్కండేయతీర్థం, అగ్నితీర్థం - యమతీర్థం, వశిష్ఠతీర్థం, వరుణతీర్థం, వాయుతీర్థం, సరస్వతీతీర్థం ప్రధానమైనవి. ఈ ఒక్క పుష్కరిణిలో స్నానం చేస్తే తొమ్మిది తీర్థాల్లో స్నానం చేసిన ఫలం దక్కుతుందని భక్తుల విశ్వాసం.
ఈసారి మీరు కూడా తిరుమలకు వెళ్తే తప్పకుండా శ్రీవారి పుష్కరిణిలో స్నానం చేసి... వరహ స్వామివారిని దర్శించుకుని శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోండి.
వెంకటేశ్వర వజ్రకవచం
నారాయణం పరబ్రహ్మ సర్వకారణకారణం
ప్రపద్యే వెంకటేశాఖ్యం తదేవ కవచం మమ
సహస్ర శీర్షా పురుషో వెంకటేశ శ్శిరోవతు
ప్రాణేశ: ప్రాణనిలయః ప్రాణాన్ రాక్షతుమే హరి:
ఆకాశరాట్ సురానాధ ఆత్మానం మే సదావతు
దేవదేవోత్తమ పయాద్దేహం మే వెంకటేశ్వరః
సర్వత్ర సర్వకాలేషు మంగంబాజాని రీశ్వరః
పాలయేన్మామకం కర్మసాఫల్యం నః ప్రయచ్చుతు
య ఏతద్వజ్రకవచ మభేద్యం వెంకటేశితు:
సాయంప్రాతః పఠేన్నిత్యం మృత్యుం తరతి నిర్భయః
ఇతి మార్కండేయకృత వెంకటేశ్వర వజ్రకవచం