జీవీతంలో ఏం జరిగినా ఒక కార్య కారణం ఉంటుందని నమ్ముతాము మనందరం. ఎందుకో అర్థం కాదు కొందరిని చూస్తే ఎప్పటి నుంచో కలుసుకున్న వారిలా ఆత్మీయుల్లా అనిపిస్తుంది. కొందరిని కలిసింది మొదటిసారే అయినా ఎనాటిదో వైరం ఉన్నట్టు నచ్చనే నచ్చరు. అలా జరగడానికి మన గ్రహస్థితులు, జన్మరాశులు కూడా కారణం కావచ్చని జ్యోతిష నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. కొన్ని రాశులతో మన జన్మ రాశికి మంచి స్నేహ సంబంధాలు ఉంటే అవకాశం ఉందట. మరి ఏ రాశి వారికి ఏఏ రాశుల వారితో స్నేహం కుదురుతుందో ఒక సారి తెలుసుకుందాం.
మేషం
మేష రాశిని మార్స్ లీడ్ చేస్తుంది. మేష రాశి వారు చాలా ఎనర్జిటిక్ మనుషులు. డైనమిక్ గా ఉంటారు. అదే సమయంలో కొంత అమాయకత్వం కూడా వీరిలో కనిపిస్తుంది. చాలా కలగోలుపు మనుషులుగా చెప్పుకోవచ్చు. వీరికి మిథున రాశి వారితో స్నేహమైనా, ప్రేమైనా బాగా కుదురుతుంది. మేష రాశి వారిలాగే మిథున రాశి వారు కూడా సర్వసన్నధంగా ఉంటారు. ఉత్సాహవంతమైన జీవితం గడపడానికి ఇష్ట పడతారు. మేష రాశికి సరిగ్గా జోడి కుదిరే మరో రాశి వారు ధనస్సు రాశి వారు. ఈ అగ్నితత్వ రాశి వారు స్వేచ్చగా, స్వతంత్రంగా జీవించడానికి ఇష్ట పడే వీరు జీవితాన్ని సాహసోపేతంగా గడిపేందుకు ఇష్టపడే వీరు మేష రాశి వారితో మంచి స్నేహాన్నైనా, ప్రేమనైనా విజయవంతంగా నెరపగలరు.
వృషభ రాశి
ఈ రాశి వీనస్ ఆధీనంలో ఉంటుంది. వీనస్ అందం, ప్రేమ, సంపదకు సంబంధించిన గ్రహం. వృషభం భూతత్వ రాశి. దృఢమైన వ్యక్తిత్వం, నమ్మకం, వినయం కలిగి ఉండే వీరు కర్కాటక రాశి వారితో చక్కగా కలిసి పోగలరు. కర్కాటక రాశి వారు రుచికరమైన భోజనం, మంచి దుస్తుల మీద ఆసక్తి కనబరిచే వ్యక్తులు. ఎదుటి వారి అభిప్రాయాలకు విలువనిచ్చే వీరికి వృషభ రాశితో చక్కని స్నేహం కుదురుతుంది. కర్కాటకం తర్వాత కన్యా రాశి వారు వృషభం వారికి మంచి జోడి కాగలరు. కన్యా రాశి వారు మంచి కార్య సాధకులు, వినయం కలిగి ఉంటారు. వృషభ రాశి వారు కన్యా రాశి వారితో తోట పని నుంచి వంట పని వరకు రోజు వారి పనుల్లో చక్కగా కలిసి పోగలరు. కాబట్టి వీరి జోడి సౌకర్యంగా ఉంటుంది.
మిథున రాశి
మెర్య్కూరీ ఆధ్వర్యంలో నడిచే రాశి. కమ్యూనికేషన్, ట్రాన్సపోర్టేషన్, టెక్నాలజీకి సంబంధించి గ్రహం. మిథున రాశి వాయుతత్వ రాశి. మిథున రాశి వారు పరిశోధనాత్మక తెలివితేటలు కలిగిన వారు. చాలా చురుకుగా ఆలోచిస్తారు. వీరికి మేష రాశితో మంచి స్నేహం కుదిరే అవకాశం ఉంటుంది. మేషం, మిథున రాశి వారు కలిసినపుడు లక్ష్యం వైపు ఆసక్తిగా అడుగులు వేస్తారు. ఇధ్దరు లక్ష్య శుద్ధికి తపించే మనస్తత్త్వం కలిగి ఉండడం వల్ల వీరిది విజయవంతమైన జంటగా ఉండే అవకాశం ఉంటుంది. మిధునానికి జంట కుదిరే మరో రాశి సింహరాశి. అగ్నితత్వ రాశి అయిన సింహం వారు లైట్ మైండెడ్, చాలా ఫ్రెండ్లీ నేచర్ కలిగి ఉంటారు. ఉల్లాసంగా ఉండే సరదా అయిన మనుషులు వీరు. ఈ ఫన్ లవింగ్ వ్యక్తులు సరిగ్గా అటువంటి మనస్తత్త్వం కలిగిన మిథునం వారితో కలిసినపుడు మరింత ఉత్సాహవంతమైన జీవితం గడిపే అవకాశం ఉంటుంది.
కర్కాటకం
భావోద్వేగాలను ప్రభావితం చేసే చంద్రుడి ఆధ్యర్యంలో నడిచే రాశి కర్కాటక రాశి. ఇది జలతత్వ రాశి. ఈ రాశి వారు కరుణతో సున్నితమైన మనసు కలిగిన వారు. వీరు ఎదుటి వారి నుంచి భద్రతను ఆశిస్తారు. మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ కలిగి ఉంటారు. వీరికి వృషభ రాశి వారితో మంచి జోడి కుదురుతుంది. ఇద్దరూ ఆహార ప్రియులు. కలిసి భోంచెయ్యడం, ఒకరినొకరు చూసుకోవడంలో వీరిని మించిన జంట ఉండదు. అదేవిధంగా కర్కాటకం వారికి మీన రాశి వారితో కూడా బాగా కుదురుతుంది. మీనం జలతత్వ రాశి. కర్కాటక, మీన రాశులిద్దరికి సానుభూతి ఎక్కువ. ఇద్దరూ కుటుంబానికి ప్రాముఖ్యతను ఇచ్చే రకం మనుషులు కనుక వీరు వారి బాంధ్యవ్యం బలంగా ఉండేందుకు ఎంత చెయ్యాలో అంతకంటే ఎక్కువే చేస్తారు. అందువల్ల మంచి జంటగా ఉండగలుగుతారు.
సింహ రాశి
సింహరాశి సూర్యుడి ఆధినంలో ఉండే రాశి. ఆత్మ విశ్వాసం, సెల్ఫ్ ఇమేజ్, మంచి గుర్తింపు కలిగి ఉండే మనుషులు. వీరు ఎక్కడున్న సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉంటుంటారు. ప్రేమించే వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగి ఉంటారు. ప్రతిక్షణం వారి రక్షణ గురించి ఆలోచిస్తారు. వీరికి వాయు తత్వం కలిగిన మిథున రాశి వారు మంచి జోడి కాగలరు. ఒకరి మనసును ఒకరు చాలా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. ఈ జంట ఎల్లప్పుడు ఉల్లాసంగా, ఉత్సాహంగా, బ్రైట్ గా ఉంటుంది. సింహరాశికి మంచి జంట మరో రాశి తులారాశి. ఇది కూడా వాయు తత్వ రాశి. తులా రాశి వారు మంచి ఆతిథ్యం ఇవ్వగలరు. ఈవేంట్స్ చెయ్యటంలో వీరిని మించిన వారు లేరు. సింహ రాశి వారు, తులారాశి వారు ఇద్దరూ కూడా స్టైల్ కాన్షియస్ పీపుల్. మంచి విలాస ప్రియులు కూడా. కనుక వీరి జంట నలుగురిలో ఆకర్శణీయంగా కనిపిస్తుంది.
కన్యా
మెర్య్కూరీ ఆధీనంలో ఉండే రాశి. ఇది భూతత్వ రాశి. వీరు డీటైల్ ఓరియెంటెడ్ పర్ఫెక్షనిస్టులు. ఆరోగ్యం పట్ల శ్రద్ద కలిగిన సున్నిత మనస్కులు. పరిశోదనలో ఆసక్తి కలిగిన వారు. మరో భూతత్వ రాశి వృషభం తో వీరికి మంచి అనుబంధం ఏర్పడే అవకాశం ఉంటుంది. వృషభ రాశి వారు సేవ దృక్పథం కలిగిన మనుషులు. ప్రశాంత జీవితాన్ని కోరుకుంటారు. విహార యాత్రలు చేయడం, ఫాం నుంచి టేబుల్ వరకు కావల్సినవి చెయ్యడం వీరికి ఇష్టం ఇలాంటి వారికి కన్యా రాశి వారు మంచి జోడి కాగలరు. మకర రాశి వారితో కూడా కన్యారాశి వారికి మంచి జోడి కుదురుతుంది. వీరు చాలా ఈజీ గోయింగ్ మనుషులు. కన్య, మకర రాశి వారు కలిస్తే మంచి లక్ష్య సాధకులు కాగలరు.
తులరాశి
తులా రాశి వీనస్ ఆధీనంలో ఉండే రాశి. వాయుతత్వ రాశి. తులా రాశి వారు మంచి ఆతిధ్యం ఇవ్వగలరు. పార్టీలో కావల్సిన ఎంటర్టైన్మెంట్ ను సరిగ్గా ప్లాన్ చెయ్యగలరు. మంచి రోమాంటిక్ పీపుల్. అగ్ని తత్వ రాశి సింహరాశి వీరికి సరైన జోడి. సింహరాశి వారు వివాదాలకు దూరంగా ఉంటారు. ఇతరులకు మంచి అనుభూతులను మిగల్చగల సామర్థ్యం కలిగిన వారు. తులా, సింహ రాశి వారు కలిసినపుడు వీరితో సమయం గడపడం బావుంటుంది. అలాగే తులా రాశి వారికి కుంభ రాశి వారు కూడా మంచి జోడి. ఇద్దరూ కూడా మంచి సోషల్ బీయింగ్స్, ఒక గెట్ టు గెదర్ నుంచి మరో పార్టీకి తిరిగేంత ఎనర్జిటిక్ జోడి. జీవితమంతా ఆసక్తిగా, అనందంగా గడపగలిగే జంట అవుతారు.
వృశ్చిక
మార్స్, ఫ్లూటోల ఆధీనంల ఉండే రాశి. ఇది జలతత్వ రాశి. చాలా అంతర్ముఖంగా ఉంటారు. వారి నమ్మకాలలో వారు జీవితం గడుపుతుంటారు. విపరీతమైన ఆకర్శణ కలిగి ఉంటారు. మకరం వీరికి సరైన జోడి. ఇద్దరూ కలిసి లక్ష్యాలను సాధించడంలో ముందుంటారు. కలిసి వ్యాపారం చేస్తే బాగా కలిసి వస్తుంది. కలిసి చేసే పనుల్లో విజయాలు సాధిస్తూ మంచి జంటగా గుర్తింపు తెచ్చుకోగలుగుతారు. వీరికి నప్పే మరో రాశి మీన రాశి. ఇది జలతత్వ రాశి. వీరి మధ్య అనుబంధం స్రావ్యంగా కొనసాగుతుంది. ఇద్దరి భావోద్వేగాలు, మానసిక స్థితి ఒకే విధంగా ఉండడం వల్ల ఒకరితో ఒకరు బాగా కలిసి పోతారు. కలిసి మెడిటేషన్ చెయ్యడం, కలిసి సినిమాలు చూడడం వంటి వన్నీ బాగా ఎంజాయ్ చెయ్యగలుగుతారు.
ధనస్సు
జూపీటర్ ఆధ్వర్యంలో ఉండే రాశి. ఇది అగ్నితత్వ రాశి. ఉల్లాసంగా ఉండే వ్యక్తులు వీరు. సాహసవంతమైన జీవితం గడిపేందుకు ఆసక్తి కలిగి ఉంటారు. వీరు ఆ జన్మ విద్యార్థులు. ఎప్పుడూ ఏదో ఒక కొత్త విషయం నేర్చుకునేందుకు ఆసక్తి కలిగి ఉంటారు. వీరికి మేష రాశి వారు మంచి జోడి కాగలరు. మేషం కూడా అగ్నితత్వ రాశి. ఆహ్లదకరంగా కనిపించే మనుషులు వీరు పోటితత్వం కలిగి ఉంటారు. ప్రయాణాలను ఇష్ట పడే వీరు ధనస్సు రాశి వారికి మంచి జంట కాగలరు. కుంభ రాశి వారితో కూడా ధనుస్సు రాశి వారు మంచి స్నేహ సంబంధాలు కలిగి ఉండగలరు. కుంభ రాశి వారు స్వేచ్ఛా ప్రియులు. మంచి మానవతా వాదులు కూడా. వీరు త్వరగా ఎవరితోనైనా కనెక్ట్ కాగలరు. వీరితో కలిసి ప్రయాణం ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది. ధనస్సు రాశి వారికి వీరు మంచి స్నేహ బంధాన్ని ఇవ్వగలరు.
మకరరాశి
సాటర్న్ వీరిని అదుపు చేస్తుంది. ఇది భూతత్వ రాశి. వీరికి వృత్తిపరమైన లక్ష్యాలు చాలా ముఖ్యమైనవి. సంప్రదాయ వాదులుగా చెప్పుకోవచ్చు. కన్యా రాశి వారు వీరికి కరెక్ట్ జంట. ఇద్దరిలో కష్టపడి పని చేసే తత్వం ఉంటుంది. లక్ష్యాలను నిర్దేశించుకోవడం కలిసి వాటిని సాధించడంలో ముందుంటారు. ఇద్దరు ఒకరికొకరు అండగా నిలిచే స్వభావం వల్ల విజయవంతంగా ఉంటారు. మకరానికి బాగా దగ్గరగా ఉండగలిగే మరోరాశి వృశ్చికం. ఇది జలతత్వ రాశి. ఇద్దరూ కలిసి ఒకే లక్ష్యం వైపు చూసే లక్షణం కలిగి ఉంటారు. లక్ష్యసాధన ఇద్దరికీ చాలా ముఖ్యమైనదిగా ఉంటుంది. కనుక వీరు మంచి జోడి కాగలరు.
కుంభ రాశి
యూరేనస్ ఆధీనంలో ఉంటుంది. వాయుతత్వ రాశి. మార్పును త్వరగా అంగీకరించే వ్యక్తిత్వం వీరిది. భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. సంప్రదాయ విధానాలను గుడ్డిగా ఆచరించని మనస్తత్వం అవసరమైతే వ్యతిరేకిస్తారు కూడా. మరో వాయుతత్వ రాశి తుల. ఈ రాశివారికి కుంభ రాశి మంచి జోడి కాగలదు. కుంభరాశి వారి లక్ష్య సాధనకు తులరాశి వారు తోడు నిలుస్తారు. ఇద్దరూ సోషల్ బీయింగ్స్ కావడం వల్ల నలుగురిలో మంచి జంటగా పేరు తెచ్చుకుంటారు. ధనస్సు కూడా కుంభరాశి వారికి మంచి స్నేహపూర్వక రాశి. ఈ రెండు రాశుల వారు కూడా మంచి ట్రావెలర్స్. మానవతా వాదులు. కలిసి సేవాకార్యక్రమాలు చెయ్యటం, పర్యటనలు చెయ్యడం వంటివి చేస్తుంటారు.
మీన రాశి
నేఫ్య్టూన్ చేత కంట్రోల్ చెయ్యబడుతుంది ఈ రాశి. జలతత్వ రాశి. వీరు మంచి రొమాంటిక్ వ్యక్తులు. క్రియేటివ్, సెన్సిటివ్ వ్యక్తులు. వీరికి కర్కాటక రాశి వారితో మంచి స్నేహ సంబంధాలు ఏర్పడుతాయి. ఇది కూడా జలతత్వరాశి. ఇద్దరూ కూడా స్పిరిచ్యూవల్, సేవా కార్యక్రమాల మీద ఆసక్తి కలిగి ఉంటారు కనుక ఇద్దరి మధ్య మంచి సయోధ్య ఉంటుంది. కలిసి విందు వినోదాల్లో పాల్గొనడం ఇష్టం ఉంటుంది. అలాగే మీన రాశి వారికి వృశ్చిక రాశి వారితో కూడా మంచి బాంధ్యవ్యం ఏర్పడవచ్చు. వీరి భావోద్వేగాన్ని అర్థం చేసుకుని అందుకు అనువైన బంధాన్ని మెయింటెయిన్ చెయ్యడం వృశ్చిక రాశి వారికి వెన్నతో పెట్టిన విధ్య. ఎప్పుడు స్పేస్ ఇవ్వాలో, ఎప్పుడు హగ్ చేసుకోవాలో వీరికి బాగా తెలుసు అందువల్ల మీన రాశి వారు వీరితో సమయం గడపడానికి ఇష్ట పడతారు.
Also Read: ఈ రాశులవారికి సిక్త్స్ సెన్స్ చాలా ఎక్కువ, మీరున్నారా ఇందులో!