Kale Hanuman temple: మనదేశంలో హనుమంతుడి గుడి లేని గ్రామం ఉండదు. రామాయణంలో రామునికి నమ్మిన బంటుగా ఉన్న హనుమంతుడు అంటే భక్తులకు ఎంతో ప్రీతి. భూత ప్రేత పిశాచాల నుంచి తమను తమ గ్రామాన్ని కాపాడే శక్తి హనుమంతుడికే ఉందని భక్తులు నమ్ముతారు. అందుకే ప్రతి గ్రామంలోనూ ఆ గ్రామ రక్షకుడిగా హనుమంతుడి ఆలయాన్ని ఏర్పాటు చేసుకుంటారు. అలా మన దేశంలో ప్రతి గ్రామంలోనూ హనుమంతుడి విగ్రహాలు ఆలయాలు కనిపిస్తాయి.


అయితే హనుమంతుడి విగ్రహాల్లో చాలావరకు సింధూరం పూసి ఉంటుంది. అందుకే హనుమంతుడు నారింజ రంగులో మనకు దర్శనం ఇస్తారు. కానీ రాజస్థాన్లోని జైపూర్ లో మాత్రం హనుమంతుడి విగ్రహం నల్లరంగులో ఉంటుంది. అందుకే ఈ హనుమంతుడి ఆలయాన్ని కాల హనుమాన్ జి మందిరం గా ప్రసిద్ధి చెందింది. జైపూర్ లో ఉన్నటువంటి ఈ సుప్రసిద్ధ ఆలయం 1000 సంవత్సరాల పురాతనమైనదని స్థానికులు చెబుతున్నారు. ఈ ఆలయాన్ని సందర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు తరలివస్తారు. 


ఈ కాలే హనుమాన్ ఆలయానికి సంబంధించి పురాణాల్లో ఒక కథ ఉంది. హనుమంతుడు సూర్య దేవుడి వద్ద అనేక విద్యలు నేర్చుకున్నాడు. హనుమంతుడికి సూర్యుడు గురువు ఇదిలా ఉంటే సూర్యదేవుడి కుమారుడైన శని దేవుడిని వెతికి తెస్తే గురుదక్షిణ అవుతుందని హనుమంతుడికి సూర్యభగవానుడు ఆదేశించాడు. 


దీంతో హనుమంతుడు శని జాడ కోసం వెతకడం ప్రారంభించాడు. అయితే శని మాత్రం హనుమంతుడిని కష్టపెట్టాడు. అంత సులభంగా లభించలేదు. అయితే హనుమంతుడి భక్తిని చూసి గురువు పట్ల అతని నిష్టను చూసి శని ఆశ్చర్యపోయాడు. అనంతరం హనుమంతుడికి శని దర్శనం ఇచ్చాడు. ఈ ప్రక్రియ హనుమంతుడు తన గురుదక్షిణ పూర్తి చేశాడు. 



అయితే శని గ్రహం హనుమంతుడిని సమీపించినప్పుడు ఆయన రంగు నల్లగా మారింది. అందుకే ఈ ఆలయంలో హనుమంతుడి విగ్రహం నలుపు రంగులో ఉంటుంది. అయితే ఎవరైతే హనుమంతుడిని పూజిస్తారో వారికి శని గ్రహం ప్రభావం నుంచి బయటపడవచ్చు అని పురాణాల్లో పేర్కొన్నారు. అందుకే ఈ ఆలయంలో హనుమంతుడిని దర్శించుకోవడం ద్వారా శని ప్రభావం నుంచి బయటపడవచ్చని భక్తుల నమ్మకం ఈ ఆలయంలో దర్శించుకునేందుకు నవజాత శిశువులను ఎక్కువగా తీసుకొని వస్తారు. ఎందుకంటే నరదృష్టి బారిన పడకుండా హనుమంతుడి ఆశీర్వాదం తోడ్పడుతుందని భక్తుల నమ్మకం.


అలాగే ఎవరైతే శనిదోషంతో ఇబ్బంది పడుతూ ఉంటారు వారు హనుమంతుడిని ఆరాధించడం ద్వారా శని దోషం నుంచి బయటపడవచ్చు.  ఈ కాల హనుమాన్ మందిరంలో హనుమంతుడికి ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు ముఖ్యంగా హనుమాన్ జయంతి రోజున ఇక్కడ ప్రత్యేకమైన పూజలు చేస్తారు.  ఈ హనుమంతుడిని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తారు. 


 రాజస్థాన్ రాజధాని జైపూర్ లో ఉన్న ఈ ఆలయాన్ని చేరుకునేందుకు అనేక మార్గాలు ఉన్నాయి.  ఢిల్లీ నుంచి నేరుగా జైపూర్ కు రోడ్డు మార్గం ద్వారా  ఐదు గంటల్లో చేరుకోవచ్చు.  ఇక దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి జైపూర్ కు నేరుగా విమానాలు ఉన్నాయి. . జైపూర్ విమానాశ్రయం నుంచి ఈ దేవాలయం 30 కిలోమీటర్ల దూరంలో ఉంది.


Also Read: ఆగష్టు 22 రాశిఫలాలు - ఈ రాశులవారికి ఈ రోజు నూతన వాహన యోగం , ఆర్థిక లాభం!