Temples: గ్రహణం రోజు..సూతకాలం ప్రారంభం అయినప్పటి నుంచీ ఆలయాలు మూసివేస్తారు. గ్రహణం ముగిసిన తర్వాత ఆలయాన్ని పూర్తిగా శుద్ధి చేసి మూలవిరాట్ కు ప్రత్యేక పూజలు చేసి, నైవేద్యం సమర్పించి...అప్పుడు భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. దేశవ్యాప్తంగా అన్ని ఆలయాల్లోనూ ఇదే పద్ధతి అనుసరిస్తారు. కానీ కొన్ని ఆలయాలు ఇందుకు మినహాయింపు అనే చెప్పాలి. ఎందుకంటే గ్రహణం సమయంలోనూ ఇక్కడ ఆలయాలు తెరిచే ఉంటాయ్. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు తిరువరప్పు శ్రీకృష్ణ ఆలయం 

Continues below advertisement

కేరళ రాష్ట్రంలో ఉన్న తిరువరప్పు ఆలయంలో కొలువైన కృష్ణుడికి చాలా ఆకలట. ఇక్కడ రోజుకి 10సార్లు నైవేద్యం సమర్పిస్తారు. గ్రహణం అని గుడి మూసేస్తే..స్వామివారు ఆకలికి తట్టుకోలేరని, విగ్రహం సన్నబడిపోతుందని భక్తుల విశ్వాసం. అందుకే ఇక్కడ గ్రహణం సమయంలోనూ గుడిని మూసివేయరు..నైవేద్యం సమర్పిస్తారు. 

లక్ష్మీనాథ్ ఆలయం 

Continues below advertisement

రాజస్థాన్ రాష్ట్రం బికనీర్ లో ఉన్న లక్ష్మీనాథ్ ఆలయం కూడా గ్రహణం సమయంలో మూతపడదు.  ఒకప్పుడు ఈ ఆలయాన్ని గ్రహణం రోజున  మూసేశారట. అప్పుడు స్వామివారు...ఆలయం పక్కనే ఉన్న మిఠాయి దుకాణ వ్యాపారి కలలో కనిపించి చాలా ఆకలిగా ఉంది నైవేద్యం పెట్టమని అడిగారట. ఆ కలను ఆలయ పూజారులకు చెప్పడంతో..అప్పటి నుంచి గ్రహణ సమయంలోనూ ఆలయాన్న మూసివేయకుండా స్వామివారికి నైవేద్యం సమర్పిస్తున్నారు

శ్రీకాళహస్తి 

శ్రీకాళహస్తిలో పంచభూత లింగాల్లో ఒకటైన వాయులింగగా కొలువయ్యాడు శంకరుడు. ఇక్కడ వాయులింగేశ్వరుడు 27 నక్షత్రాలను కవచంగా ధరించి ఉంటాడు. గ్రహాలను శాసించే స్వామికి గ్రహణం దోషం అంటుతుందా? అందకే శ్రీకాళహస్తి ఆలయంలో గ్రహణం సమయంలో రాహు కేతు పూజలు, ప్రత్యేక అభిషేకాలు ఘనంగా జరుగుతాయి. ఈ సమయంలో స్వామివారిని దర్శించుకుంటే గ్రహదోషాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం

అరుణాచలం

కొండనే శివస్వరూపంగా, అగ్నిలింగంగా భావించే ప్రదేశం అరుణాచలం. నిత్యం భక్తులతో కళకళలాడే అరుణాచలం పౌర్ణమి వేళ మరింత రద్దీగా ఉంటుంది. అందుకే గ్రహణం అయినా కానీ అరుణాచలం ఆలయాన్ని మూసివేయరు. ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతాయి మహాకాళేశ్వర ఆలయం 

ఉజ్జయినిలో కొలువైన, కాలానికి అతీతుడైన మహాకాళుడికి గ్రహణ ప్రభావం ఉండదని చెబుతారు పండితులు. జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఈ క్షేత్రంలో గ్రహణం సమయంలోనూ ప్రత్యేక పూజలు జరుగుతాయి ఉత్తరాఖండ్ లో ఉన్న కల్పేశ్వర్ ఆలయాన్ని కూడా గ్రహణం సమయంలో మూసివేయరు  ఢిల్లీలో ఉండే కల్కాజీ ఆలయంలో కొలువైన కల్కా దేవిని కాలచక్రానికే అధిపతిగా పూజిస్తారు. గ్రహాలు, నక్షత్రాలు ఆమె కనుసన్నల్లోనే కదులుతాయని అందుకే గ్రహణ ప్రభావం ఈ ఆలయంపై ఉండదని చెబుతారు

గయలో ఉన్న విష్ణుపాద ఆలయంలో గ్రహణ సమయంలో పిండప్రదానం చేస్తారు కొందరు. అందుకే ఈ ఆలయాన్ని గ్రహణ సమయంలోనూ తెరిచి ఉంచుతారట 

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. పండితులు చెప్పిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల నుంచి సేకరించి అందించిన వివరాలు ఇవి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.

వృషభ రాశివారికి పరాభవ నామ సంవత్సరం అద్భుతంగా ఉంటుందా? 2026 ఉగాది పంచాంగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఉగాది 2026 పరాభవ నామసంవత్సరంలో మీ రాశి ఆదాయం - వ్యయం తెలుసుకోండి!

2026 ఉగాది ఎప్పుడు? రాబోతున్న తెలుగు సంవత్సరం పేరేంటో తెలుసా!