శ్రీకాకుళం జిల్లా శ్రీముఖ లింగం ..ఇక్కడ శ్రీ ముఖలింగేశ్వరాస్వామి, భీమేశ్వరాస్వామి, సోమేశ్వరస్వామి ఆలయాలున్నాయి. చక్కని శిల్పాలతో కనుల పండుగ చేస్తాయి. ఇక్కడ లభించిన అధారాలను బట్టి బౌద్ధ, జైన, హిందూ మతాలు వర్ధిల్లాయనికూడా తేలింది. చిత్రం ఏమిటంటే ఇక్కడ దొరికిన ఏశాసనంలోనూ ఈ ఊరిపేరు ముఖలింగం అని పేర్కొనలేదు. ఇక్కడ లింగం ఇప్పచెట్టు మొదలను నరికి వేయగా అదే ముఖలింగంగా ప్రసిద్ధి చెందింది. ఆ చెట్టు మొదలుపై ముఖం కనిపిస్తుంది అని చెబుతారు. ఆ చెట్టు మొదలే క్రమంగా లింగంగా మారిందంటాకు..ఇప్పచెట్టును సంస్కృతంలో మధుకం అంటారని అందువల్ల ఈ గుడికి మధుకేశ్వరస్వామి ఆలయంగా పేరొచ్చిందని అంటారు.
ఈ ఆలయంలో ఎనిమిది వైపుల ఎనిమిది లింగాలున్నాయి. వరాహిదేవితో పాటూ బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, ఇంద్రాణి. వీరు పార్వతీదేవి అవతారాలు ఇక్కడ ఉంటాయి. దశావతార విగ్రహాలు కూడా ఇక్కడ ఉంటాయి. భీమేశ్వరాలయం శిధిలావస్థలో వుంది. కుమారస్వామి, దక్షిణామూర్తి 4 ముఖాలతో బ్రహ్మ, గణపతి విగ్రహాలున్నాయి. సోమేశ్వరాలయానికి గర్భగుడి మాత్రమే ఉంది. ముఖమండపం లేదు. ఎత్తయిన శిఖరంపై బ్రహ్మాండమైన రాతితో కప్పు వేశారు. ఇది ఒకేరాయి. ఓ సారి పిడుగుపడి ఆరాయి పగిలి అందులో ముక్క క్రింది పడింది. ఆ రాయినే ఎలా అమర్చారన్నది నాటి శిల్పుల గొప్పదనం అనే చెప్పాలి.
ఇక్కడ ఏడు నాలికల అగ్ని విగ్రహం, వినాయకుడు, కాశీ అన్నపూర్ణ, నటరాజు, కొమారస్వామి, హరిహరదేవుల విగ్రహాలు ఎంత్తో అందంగా వున్నాయి. కొన్ని శృంగార శిల్పాల్ని కూడా ఇక్కడ చెక్కారు . ఈ ఆలయం శిధిలావస్థలో వుంది.ఇక్కడ త్రవ్వకాలలో వీణాపాణి అయిన సరస్వతి విగ్రహం, జైనమత ప్రవక్త మహావీరుని విగ్రహం లభించాయి. వీటిని ముఖలింగాలయంలో భద్రపరిచారు. ఇక్కడ అనేక శాసనాలు కూడ దొరికాయి. వీరిద్దరూ కళింగరాజులు. కామార్ణవుడు తన రాజధానిని దంతనగరం నుండి యిక్కడకు మార్చినట్లు కూడ తెలుస్తోంది. తూర్పు గాంగరాజులలో ప్రాముఖ్యుడైన అనంతవర్మ చోడగంగదేవుడు ఉత్కళమును జయించి, తన రాజధానిని సా.శ.1135 లో ఒరిస్సా లోని కటక్ నగరానికి మార్చిన ముఖలింగపు ప్రాముఖ్యత క్రమముగా తగ్గిపోయింది. ఆనాటి వైభవుమునకు తాత్కారణముగ ముఖలింగంలో మూడు శైవ దేవాలయములున్నాయి. ముఖలింగం లోని పాశుపత శైవమత ప్రాబల్యమునకు నిదర్శనముగ అచ్చటి ఆలయములలో లకుశీలుడు విగ్రహములు పెక్కు ఉన్నాయి. లకుశీలుడు తను మత స్థాపకుడనియు, అతడు శివుని అవతారమనియు పాశుపత శైవమతస్థులు నమ్ముదురు. శైవమత గ్రంథములలో కూడా లకులీశుడు శివుని అవతారమని పేర్కొన్నారు.
మహా శివరాత్రికి గొప్ప ఉత్సవం శివరాత్రి అయినా తర్వాత రోజు పడి అనే కార్యక్రమం జరుగుతుంది.. పడి అంటే స్వామివారి ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఉంటాయి అందులో అమ్మవారికి ప్రత్యేకంగా పూజల నిర్వహిస్తారు కుంకుమతో అభిషేకాలు చేసి పడియా కార్యక్రమం ముగిస్తారు అనంతరం చక్ర తీర్థ స్నానాలు చక్కర తీర్థ స్నానాలు అంటే ప్రధానంగా స్వామివారిని దేవాలయం నుంచి బయటకు తీసుకొని వచ్చి అనంతరం వంశధార నది పరిహౌక ప్రాంతంలో సరుబుజ్జిలి అనే ప్రాంతంలో తీసుకొని వచ్చి లక్షలాది మంది భక్తులు మధ్యన స్వామి వారిని ఊరేగిస్తారు నది మధ్యలో మూడు సార్లు స్వామివారిని నెట్లో దించి మళ్లీ పైకి తీస్తారు అని ఒక నమ్మకం ఆ నీతిని తల మీద వేసుకొని లక్షలాదిమంది భక్తులు తిలకిస్తారు.
శ్రీముఖలింగం ఎలా వెళ్లాలంటే..విశాఖపట్నం నుంచి 168 కిలోమీటర్లు, శ్రీకాకుళం నుంచి 58 కిలోమీటర్ల దూరం. శ్రీకాకుళం నుంచి జలుమూరు వెళ్లే బస్సులన్నీ కూడా శ్రీముఖలింగానికి చేరుకుంటాయి. రైలు మార్గంలో వెళ్లేవారు ఆమదాలవలస రైల్వే స్టేషన్ నుంచి 69 కిలోమీటర్లు వస్తుంది. ఒడిశా నుంచి వచ్చేవారు తిలారు రైల్వే స్టేషన్ లో దిగి అక్కడి నుంచి జలుమూరుకి ఆటో గాని లేదా బస్సులో కానీ ఆలయానికి చేరుకోవచ్చు.
మహా శివరాత్రికి ఇక్కడ గొప్ప ఉత్సవం జరుగుతుంది.
శివరాత్రి అయినా తర్వాత రోజు పడి అనే కార్యక్రమం జరుగుతుంది.. పడి అంటే స్వామివారి ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఉంటాయి అందులో అమ్మవారికి ప్రత్యేకంగా పూజల నిర్వహిస్తారు కుంకుమతో అభిషేకాలు చేసి పడియా కార్యక్రమం ముగిస్తారు అనంతరం చక్ర తీర్థ స్నానాలు చక్కర తీర్థ స్నానాలు అంటే ప్రధానంగా స్వామివారిని దేవాలయం నుంచి బయటకు తీసుకొని వచ్చి అనంతరం వంశధార నది పరిహౌక ప్రాంతంలో సరుబుజ్జిలి అనే ప్రాంతంలో తీసుకొని వచ్చి లక్షలాది మంది భక్తులు మధ్యన స్వామి వారిని ఊరేగిస్తారు నది మధ్యలో మూడు సార్లు స్వామివారిని నెట్లో దించి మళ్లీ పైకి తీస్తారు అని ఒక నమ్మకం ఆ నీతిని తల మీద వేసుకొని లక్షలాదిమంది భక్తులు తిలకిస్తారు