Sri Rama Navami 2023: మనిషిగా జన్మించాక ఎలాగో ఒకలా బతికేయడం కాదు..ఎలా బతకాలో తెలుసుకోవాలి. ఎలాంటి జీవితం గడపాలి, వ్యక్తిత్వం ఎలా ఉండాలి, కుటుంబంతో ఎలా ఉండాలి, బంధుమిత్రులతో ఎలా మెలగాలి, చుట్టుపక్కలవారితో ఎలా మమేకమవ్వాలి, కష్టసుఖాల్లో ఎలా ముందుకు సాగాలి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మరి ఇన్ని లక్షణాలు ఒక్కరికే ఉండడం సాధ్యమా అంటే ఈ ప్రశ్నకు ఒకేఒక్క సమాధానం శ్రీరామచంద్రుడు. పేరుకే దేవుడైనా మనిషిగా ఎలా బతకాలో బతికి చూపించాడు దశరథ తనయుడు శ్రీ రాముడు. శ్రీరామనవమి సందర్భంగా సంపూర్ణ రామాయణం చదవలేని వారు 108 నామాలు చదువుకుంటే చాలు....
ఓం శ్రీ సీతా లక్ష్మణ భరత శత్రుజ్ఞ హనుమత్ సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. నూట ఎనిమిది నామాలలో సంపూర్ణ రామాయణం 1.శుద్ధబ్రహ్మ పరాత్పర రామ2.కాలాత్మక పరమేశ్వర రామ3.శేషతల్ప సుఖనిద్రిత రామ4.బ్రహ్మద్యమర ప్రార్ధిత రామ5.చందకిరణ కులమండన రామ6.శ్రీమద్దశరధనందన రామ7.కౌసల్యాసుఖవర్ధన రామ8.విశ్వామిత్రప్రియధన రామ9.ఘోరతాటకఘాతక రామ10.మారీచాదినిపాతక రామ11.కౌశిక మఖసంరక్షక రామ12.శ్రీ మదహల్యో ద్దారక రామ13.గౌతమమునిసంపూజిత రామ14.సురమునివరగణసంస్తుత రామ15.నవికధావితమృదుపద రామ16.మిధిలాపురజనమోదక రామ17.విదేహమానసరంజక రామ18.త్రయంబకకార్ముకభంజక రామ19.సితార్పితవరమాలిక రామ20.కృతవైవాహిక కౌతుక రామ21.భార్గవదర్పవినాశక రామ22.శ్రీ మాధయోద్యా పాలక రామ23.ఆగణితగుణగణభూషిత రామ24.అవనితనయాకామిత రామ25.రాకాచంద్రసమానన రామ26.పితృవాక్యాశ్రితకానన రామ27.ప్రియగుహావినివేధితపద రామ28.తత్ క్షాళితనిజమృదుపద రామ29.భరద్వాజముఖానందక రామ౩౦.చిత్రకూటాద్రినికేతన రామ31.దశరధసంతతచింతిత రామ32.కైకేయీతనయార్థిత రామ౩౩.విరచితనిజపాదుక రామ34.భారతార్పిత నిజపాదుక రామ35.దండకవనజనపావన రామ36.దుష్టవిరాధవినాశాన రామ37.శరభoగసుతీక్షార్చిత రామ38.అగస్త్యానుగ్రహవర్ధిత రామ39.గృద్రాధిపగతిదాయక రామ40.పంచవటీతటసుస్థిత రామ41.శూర్పణఖార్తి విధాయక రామ42.ఖరదూషణముఖసూదక రామ43.సీతాప్రియహరిణానుగ రామ44.మరిచార్తికృదాశుగా రామ45.వినష్ట సేతాన్వేషక రామ46.గృధ్రాధిపగతిదాయక రామ47.శబరిదత్తఫలాశన రామ48.కబంధభాహుచ్చేధన రామ49.హనుమత్సేవితనిజపద రామ50.నతసుగ్రివభిష్టద రామ51.గర్వితవాలివిమోచక రామ52. వానరదుతప్రేషక రామ53.హితకరలక్ష్మణసంయుత రామ54.కపివరసంతతసంస్మృత రామ55.తద్గతి విఘ్నద్వంసక రామ56.సీతాప్రాణాదారక రామ57.దుష్టదశాన ధూషిత రామ58. శిష్టహనూమద్భూషిత రామ59.సీతూధితకాకావన రామ60.కృతచూడామణిదర్శన రామ61. కపివరవహనశ్వాసిత రామ62.రావణధనప్రస్థిత రామ63.వనరసైన్యసమావృత రామ64.శొశితసరిధీశార్థిత రామ65.విభిషణాభయదాయక రామ66.సర్వతసేతునిభందక రామ67.కుంబకర్ణ శిరశ్చెదక రామ68.రాక్షససంఘవిమర్ధక రామ69.ఆహిమహిరావణ ధారణ రామ70.సంహ్రృతదశముఖరావణ రామ71.విభావముఖసురసంస్తుత రామ72.ఖస్థితధశరధవీక్షిత రామ73.సీతాదర్శనమోదిత రామ74.అభిషిక్త విభీషణ రామ75.పుష్పకయానారోహణ రామ76.భరధ్వజాభినిషేవణ రామ77.భరతప్రాణప్రియకర రామ78.సాకేత పురీభుషన రామ79.సకలస్వీయసమానత రామ80.రత్నలసత్పీఠాస్థిత రామ81.పట్టాభిషేకాలంకృత రామ82.పార్థివకులసమ్మానిత రామ83.విభీషణార్పితరంగక రామ84.కీశకులానుగ్రహకర రామ85.సకలజీవసంరక్షక రామ86.సమస్తలోకోద్ధారక రామ87.అగణితమునిగాణసంస్తుత రామ88.విశ్రుత రాక్షసఖండన రామ89.సితాలింగననిర్వృత రామ90.నీతిసురక్షితజనపద రామ91.విపినత్యాజితజనకజ రామ92.కారితలవణాసురవధ రామ93.స్వర్గతశంబుక సంస్తుత రామ94.స్వతనయకుశలవనందిత రామ95.అశ్వమేధక్రతుదీక్షిత రామ96.కాలావేదితసురపద రామ97.ఆయోధ్యజనముక్తిద రామ98.విధిముఖవిభుదానందక రామ99.తేజోమయనిజరూపక రామ100.సంసృతిబన్ధవిమోచక రామ101.ధర్మస్థాపనతత్పర రామ102.భక్తిపరాయణముక్తిద రామ103.సర్వచరాచరపాలక రామ104.సర్వభవామయవారక రామ105.వైకుంఠలయసంస్ఠీత రామ106.నిత్యనందపదస్ఠిత రామ107.కరుణా నిధి జయ సీతా రామ108.రామరామ జయరాజా రామరామ రామ జయసీతా రామ....
Also Read: ఆయన ఆకాశం - ఆమె పుడమి, అందుకే వారి కళ్యాణం లోకకళ్యాణానికి కారకం, ప్రకృతికి పులకరింతకు ప్రతీక
భారతదేశంలో ధర్మ బద్ధ జీవనానికి నిలువెత్తు నిర్వచనం శ్రీరాముడు. మనిషి ఇలా బ్రతకాలి అని ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపి.. మనిషి జన్మకు ఉన్న విశిష్టతను చాటిచెప్పిన పురుషోత్తముడు. అయనము అంటే నడక అని అర్థం . రామాయణము అంటే రాముని నడక అని అర్థం. సరిగ్గా గమనిస్తే శ్రీ మహవిష్ణువు దశావతారాల్లో ఒక్క రామావతారంలో తప్ప ఇక ఏ అవతారం గురించి ప్రస్తావనలోనూ అయనము అనే మాట వినియోగించలేదు. ఎందుకంటే రామావతారంలో స్వామి పరిపూర్ణముగా మానవుడే.
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే |సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే ||
Also Read: ఈ 16 సుగుణాలే రాముడిని ఆదర్శపురుషుడిని చేశాయి!