Sri Krishna Tatvam 


సాధారణంగా  శ్రీ మహావిష్ణువు అవతారాలన్నీ రాక్షసులను సంహరించడంతో ముగిసిపోతాయి. కానీ రామ, కృష్ణావతారాలు మాత్రం పరిపూర్ణ అవతారాలు. పైగా ఏ అవతారంలోనూ తానే దేవుడిని అని చెప్పలేదు. కానీ కృష్ణావతారంలో తానే దేవుడిని అని స్పష్టంగా చెప్పాడు కృష్ణపరమాత్మ. అయితే ఎక్కువ మంది కృష్ణుడిని భగవత్ స్వరూపంగా కన్నా గురువుగా, స్నేహితుడిగా(ప్రేమికుడిగా) కొలిచి తరిస్తారు. వాస్తవానికి కృష్ణుడికి భక్తుల కన్నా గురువు, స్నేహితుడిగా భావించే వారి సంఖ్య ఎక్కువని చెప్పాలేమో.


గురుతత్వాన్ని చూపించిన అవతారం:ప్రతి ఒక్కరి జాతకాల్లో దోషాలుంటాయి. కొన్ని దోషాలు పూజల ద్వారా పరిష్కార మవుతాయి. కానీ అస్సలు రెమిడీస్ లేని దోషాలు కొన్ని ఉంటాయి. అలాంటి దోషాలు పూజల వల్ల కూడా పరిహారం కావు. కేవలం గురువు ఆశీర్వచనం ఉంటే పరిష్కారం అవుతాయి. అందుకే వేదం చదువుకున్న పండితుడితో 'శతాయుష్మాన్ భవం..శత మనంతంభవతి' అనే ఆశీర్వచనం పొందాలని భావిస్తారు. తద్వారా కొన్ని దోషాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు. బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాస ఆశ్రమం...ఈ నాలుగు ఆశ్రమ ధర్మాల్లో గురుతత్వాన్ని చూపించిన అవతారం కృష్ణడొక్కటే. అందుకే కృష్ణుడిరాకతో ఇంట్లో ఉంటే దోషాలు తొలగిపోతాయని భావించి స్వామి అడుగులు లోపలకి వేస్తారు.


Also Read: కన్నయ్య మధురకే కాదు ప్రేమ మాధుర్యానికీ అధిపతి, మూర్తీభవించిన వ్యక్తిత్వ వికాసం శ్రీ కృష్ణుడు


సులువుగా కనిపించే అనంతమైనది కృష్ణతత్వం: రాముడిని రామాయణం అంటాం. అంటే రాముడు నడిచిన మార్గం అని అర్థం. కేవలం కృష్ణుడిని మాత్రమే కృష్ణతత్వం అంటారు. తత్వం అంటే ఏ యుగంలో వారైనా అన్వయించుకోవచ్చు. రాముడిని త్రేతాయుగంలో కొందరు పూజించారు...కలియుగంలోనూ పూజలందిస్తున్నాం. కానీ కృష్ణుడిని కొందరు రుషులు పండితులు కూడా తెలుసుకోవాలని తాపత్రయపడ్డారు. వ్యాసభగవానుడు అంతటి వాడే కృష్ణతత్వాన్ని తెలుసుకోవడం కష్టం అని తేల్చేశాడు. సులువుగా కనిపించే అనంతమైనది కృష్ణతత్వం. అందుకే  గురువుగా, స్నేహితుడిగా నువ్వు నా ఇంట్లోకి వచ్చి నన్ను, నా కుటుంబాన్ని చెడుమార్గంలో నడిపించకుండా చూడాలని కృష్ణుడి అడుగులు వేస్తారు.


Also Read: శ్రీ కృష్ణుడు చిన్నప్పుడు ఎలా ఉన్నాడో చూడాలనుకుంది రుక్మిణి, ఏం చేసిందో తెలుసా!




స్నేహధర్మానికి నిదర్శనం కృష్ణతత్వం: వాస్తవానికి కురుక్షేత్రం సంగ్రామం పూర్తికాకముందే అర్జునుడు ఆయుర్దోషం పొందుతాడని(చనిపోతాడని) రుషులు ముందే చెబుతారు. కానీ యుద్ధం చివరి వరకూ అర్జునుడు ఉన్నాడు. మొత్తం యుద్ధం ముగిసిపోయింది..అందర్నీ చంపేశా అని అర్జునుడు అనగానే...కృష్ణుడు అర్జునిడితో రథం కిందకు దిగు అని చెబుతాడు. వెంటనే కృష్ణుడు కూడా కిందకు దిగి రథం చుట్టూ ప్రదిక్షిణ చేస్తాడు. వెంటనే ఆ రథం పెళపెళమని విరిగి బూడిదైపోతుంది. అప్పుడు కృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు...భీష్ముడు, ద్రోణులు, కర్ణుడు లాంటి వారు వేసిన బాణాలతో ఎప్పుడో రథం కాలిపోయింది. కానీ గురువుగా, స్నేహితుడిగా నీవెంట ఉన్నా కాబట్టే  కాలిన రథం కాలినట్టు నీకు కనిపించలేదంటాడు. అదే కృష్ణతత్వం. అర్జునుడినికి దోషాల నుంచి విముక్తి కల్పించినట్టే తమని కూడా కాచుకుని ఉండాలని పాదముద్రలు వేస్తారు.




కృష్ణుడు ఉంటే ఆనందమే: లౌకికంగా చూస్తే కృష్ణుడు ఎక్కడుంటే అక్కడ ఆనందం ఉంటుంది. అందుకే కృష్ణుడు ఉన్న ప్రదేశాన్ని బృందావనం అంటారు. బృంద అంటే తులసి... బృంద అంటే ఆరోగ్యంతో కూడిన ఆనందం. ఆ ఆనందం వనంలా పెరిగితే ఎంతో అద్భుతంగా ఉంటుంది. అందుకే ఇంట్లో సమస్యలన్నీ పరిష్కరించి ఆనందాన్నివ్వమని కృష్ణుడిని ఆహ్వానిస్తాం. కృష్ణుడు ఎక్కడా పని చేయడు..చేయిస్తాడు. యుద్ధం చేయలేదు..అర్జునిడితో చేయించాడు. అలా నిర్వర్తించాల్సిన ధర్మం దిశగా నడిపించని.. వెళుతున్న మార్గంలో అవరోధాలు తొలగించమని.. మనిషిగా పుట్టినందుకు మనిషిగా ప్రవర్తించే నడవడినను నేర్పించమని చెప్పడానికే కృష్ణపాదుకలు వేస్తారు.