Krishna Janmashtami 2022 Date: ఆగస్టు 18 or 19 శ్రీ కృష్ణ జన్మాష్టమి ఎప్పుడు జరుపుకోవాలి

తిథులు తగులు, మిగులు (ముందు రోజు తర్వాత రోజు) వచ్చినప్పుడు పండుగను ఏ రోజు జరుపుకోవాలనే సందిగ్ధం ఉంటుంది. ఈ ఏడాది రాఖీ పౌర్ణమి విషయంలోనూ అదే జరిగింది. ఇప్పుడు శ్రీకృష్ణ జన్మాష్టమికి సంబంధించి అదే డైలమా

Continues below advertisement

శ్రీకృష్ణ జన్మాష్టమి 2022
తిథులు ముందురోజు, తర్వాతి రోజు వచ్చినప్పుడు పండుగ ఏ రోజు జరుపుకోవాలనే డైలమా ఉంటుంది. నిన్నటి వరకూ  రాఖీ పౌర్ణమి విషయంలో ఇదే జరిగింది...ఇప్పుడు శ్రీకృష్ణ జన్మాష్టమికి సంబంధించి అదే సందిగ్ధం నెలకొంది. అయితే శ్రీ కృష్ణ జన్మాష్టమి ఏరోజు జరుపుకోవాలని చర్చించుకునే ముందు అష్టమి తిథి ఉన్న సమయాన్ని చూద్దాం..

Continues below advertisement

  • ఆగస్టు 18 గురువారం సప్తమి తిథి రాత్రి 12.16 నిముషాల వరకూ ఉంది..తదుపరి అష్టమి వచ్చింది
  • ఆగస్టు 19 శుక్రవారం సూర్యోదయానికి అష్టమి తిథి ఉంది. శుక్రవారం అర్థరాత్రి 1.04 వరకూ ఉంది
  • పంచాంగం ప్రకారం శ్రీకృష్ణ జన్మాష్టమి ఆగస్టు 19 శుక్రవారం జరుపుకోవాలన్నది క్లారిటీ ఉంది.
  • ఆగస్టు 18న జరుపుకోవాలన్న వాదన ఎందుకు తెరపైకి వచ్చిందంటే... శ్రీకృష్ణుడు అష్టమి తిథి అర్థరాత్రి 12 గంటలకు జన్మించాడని, అందుకే ఆగస్టు 18న ఆ సమయానికి అష్టమి రావడంతో అదేరోజు శ్రీకృష్ణాష్టమి జరుపుకోవాలంటున్నారు.
  • హిందువుల పండుగల్లో 90% సూర్యోదయానికి ఉన్న తిథినే పరిగణలోకి తీసుకుంటారు. అందుకే అష్టమి తిథి గురువారం అర్థరాత్రి వచ్చినప్పటికీ శుక్రవారం ఉదయానికి తిథి ఉండడమే కాదు ఆ రోజు కూడా అర్థరాత్రి ఉంది కాబట్టి ఆగస్టు 19 శుక్రవారం పండుగ చేసుకోవాలంటున్నారు పండితులు

Also Read: నిద్రలేవగానే చాలామంది అరచేతులు చూసుకుని లేస్తారు, ఇది మంచిదా కాదా!

కృష్ణుడు జన్మించిన శ్రావణ బహుళ అష్టమిని కృష్ణాష్టమి పర్వదినంగా జరుపుకుంటారు. కన్నయ్య చిన్నప్పుడు గోకులంలో పెరగడం వల్ల గోకులాష్టమి అని కూడా అంటారు. కృష్ణాష్టమి రోజున ఒకపూట భోజనం చేసి శ్రీకృష్ణునికి పూజ చేసి శ్రీకృష్ణని దేవాలయాలు దర్శించుకునే వారికి కోటి జన్మల పుణ్య ఫలం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఆలయాల్లో కృష్ణ అష్టోత్తర పూజ, కృష్ణ సహస్ర నామా పూజ చేయించుకునే వారికి వంశాభివృద్ధి, అష్టైశ్వర్యాలు చేకూరతాయి. ఈ రోజున కృష్ణుడిని పూజిస్తే సకల పాపాలు నశిస్తాయని, ధర్మార్థ కామ మోక్ష ప్రాప్తి కలుగుతుందని స్కంధ పురాణం చెబుతుంది. సంతానం లేని వారు, వివాహం కావాల్సిన వారు ఈ పుణ్యదినాన బాల కృష్ణుడిని సంతాన గోపాల మంత్రంతో పూజిస్తే అనుకున్నది నెరవేరుతుంది.

Also Read: ఈ 5 రాశుల అబ్బాయిలను పెళ్లిచేసుకున్న అమ్మాయిలు అదృష్టవంతులు

ఓం నమో నారాయణాయ, నమోభగవతే వాసుదేవాయ సర్వం శ్రీకృష్ణ చరణార విందార్పణమస్తు! 
ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ రుక్మిణీ శాయ నమః! 
ఓం అచ్యుతా అచ్యుతాహరే పరమాన్ రామకృష్ణ పురుషోత్తమ విష్ణు వాసుదేవభగవాన్ అనిరుధ్య శ్రీపతే శమయ దుఃఖమశేషం నమః! 
ఈ మంత్రాన్ని 108 సార్లు ధ్యానం చేసేవారిని దుఃఖం దరిచేరదంటారు

కృష్ణాష్టమి రోజు పూజతో పాటుగా భగవానుడి స్మరణ కూడా ముఖ్యమే. ఆ గోపాలుని వైభవాన్ని తెలియచేసే భాగవతం, భగవద్గీతలను ఈ రోజు ఎంతో కొంత పఠించాలి. అలా కృష్ణుని తలుస్తూ కొలుస్తూ కృష్ణాష్టమి రాత్రిని గడపాలి. కృష్ణుడు అర్ధరాత్రి జన్మించాడు కాబట్టి, కొందరు రాత్రివేళ కృష్ణుడిని పూజించి మర్నాడు ఉదయం దగ్గర్లో ఉన్న వైష్ణవ ఆలయాలకు వెళ్లి ఉపవాసం విరమిస్తారు. 

Continues below advertisement