Sravana Masam 2026: చాంద్రమానాన్ని అనుసరించి ఐదోనెల శ్రావణం. ఈ నెలలో వచ్చే పౌర్ణమినాడు చంద్రుడు శ్రవణం నక్షత్రంలో సంచరించడంతో శ్రావణం అనే పేరొచ్చింది. శ్రీ మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన ఈ నెలలో ప్రత్యేక పూజలు, నోములు, ఉపవాసాలకు అనుకూలం. శ్రావణం ఆరంభం నుంచి చివరి వరకూ..ప్రతి రోజూ ప్రత్యేక పూజలే. వేంకటేశ్వరుడి జన్మనక్షత్రం శ్రవణం..అందుకే అమ్మవారిని ప్రశన్నం చేసుకుంటే స్వామివారి అనుగ్రహం లభిస్తుందని భక్తుల విశ్వాసం.ఈ నెలలో ఆచరించే చిన్న పుణ్యకార్యమైనా విశేష ఫలితాలను ఇస్తుందని చెబుతారు

Continues below advertisement

శ్రావణమాసం 2026 ప్రారంభం- ముగింపు తేదీలు (Sravana masam 2026 starting and ending dates) శ్రావణ సోమవారం (Shravana Somavar Puja Dates )

దక్షిణాయనంలో విశేషమైన నెలల్లో ఒకటి శ్రావణం. శివ కేశవులకు బేధం లేకుండా పూజించే నెల ఇది. ఈ నెలలో వచ్చే సోమవారాలు అత్యంత మహిమాన్వితమైవి. సాధారణంగా సోమవారం శివుడికి ప్రత్యేకం. శ్రావణమాసంలో వచ్చే సోమవారం మరింత విశిష్టమైనది. ప్రతి సోమవారం రుద్రాభిషేకం, బిళ్వార్చన చేస్తే శుభ ఫలితాలు పొందుతారు. శివుడిని పూజించిన తర్వాత పార్వతీదేవికి కుంకుమతో పూజ చేస్తే సౌభాగ్యం సిద్ధిస్తుంది.  శ్రావణ మంగళవారం (Sravana Mangala Gowri Vratham) 

Continues below advertisement

వివాహిత స్త్రీలకు ప్రత్యేకమైన  రోజు శ్రావణ మంగళవారం. ఈ నెలలో వచ్చే మంగళవారం గౌరీ వ్రతం ఆచరిస్తే దాంపత్యజీవితం సంతోషంగా ఉంటుందని నమ్మకం. శ్రావణంలో వచ్చే మంగళవారాల్లో గౌరీపూజ చేస్తే దాంపత్యజీవితం సంతోషంగా ఉంటుందని విశ్వాసం. శ్రావణమాసంలో గౌరీపూజ చేసి ముత్తైదువులకు తాంబూలం , వాయనం అందిస్తే సౌభాగ్యం. శ్రావణ శుక్రవారం (Sravana sukravaram pooja vidhanam)

శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీవ్రతం ఆచరిస్తే  భోగభాగ్యాలు కలుగుతాయని విశ్వాసం. ధనం, భూమి, విజ్ఞానం, ప్రేమ, కీర్తి, సంతోషం, శాంతి, బలం ఇవన్నీ అష్టలక్ష్ముల రూపంలో ఉన్నాయని చెబుతారు. అందుకే శ్రావణ శుక్రవారం పూజ సౌభాగ్యాన్నిస్తుంది శ్రావణ శనివారం (Shravana Shanivara 2025)

శ్రావణమాసంలో వచ్చే సోమవారం, మంగళవారం, శుక్రవారం మాత్రమే కాదు..శనివారం కూడా ప్రత్యేకమే. ఈ రోజు శ్రీ వేంకటేశ్వరస్వామిని  పూజిస్తే  కష్టాలన్నీ తొలగిపోతాయని విశ్వాసం. శ్రీవేంకటేశ్వర ఆరాధనతో పాటూ మీ ఇంటి ఇలవేల్పుని పూజిస్తే సకల శుభాలు చేకూరుతాయి. శ్రావణంలో వచ్చే శనివారాల్లో ఉపవాసం ఉండి ఆలయంలోప్రదక్షిణలు చేస్తే కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. 

 2026 శ్రావణమాసం ఆగష్టు 13 గురువారం నుంచి సెప్టెంబర్ 11 శుక్రవారం వరకు.. శ్రావణమాసం గురువారం ప్రారంభమైంది.. నాలుగు శుక్రవారాలు వచ్చాయి.. పౌర్ణమి తిథి కూడా శుక్రవారమే వచ్చింది. సాధారణంగా శ్రావణ పౌర్ణమి కన్నా ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీవ్రతం ఆచరిస్తారు. అయితే ఈ ఏడాది పౌర్ణమి తిథి శుక్రవారం రావడంతో ఆ ముందువారం  వరలక్ష్మీవ్రతం ఆచరించాలి. పౌర్ణమి రోజే శుక్రవారం రావడంతో ఆ రోజు కూడా పున్నమి ఘడియలు దాటిపోకుండా  వ్రతం చేసుకోవచ్చ. ఇక గౌరీపూజ చేసుకునేవారికి ఈ ఏడాది శ్రావణ మంగళవారాలు నాలుగు వచ్చాయి. శుక్రవారాలు కూడా నాలుగు వచ్చాయి. సెప్టెంబర్ 11 కూడా శుక్రవారం వచ్చినా ఆ రోజు అమావాస్యతో శ్రావణం ముగుస్తుంది...భాద్రపదమాసం ప్రారంభమవుతుంది.