Spirituality: పర్సులో చాలామంది డబ్బులతో పాటూ దేవుడి ఫొటోలు, చనిపోయిన వారి ఫొటోలు, చెల్లించిన చెల్లించాల్సిన బిల్లులు  ఉంచుతుంటారు. అయితే...జ్యోతిషశాస్త్రం ప్రకారం పర్సులో డబ్బు తప్ప ఏవి ఉంచకూడదని చెబుతారు నిపుణులు. మహా అయితే గణేష యంత్రం, శ్రీ యంత్రం లాంటి పెట్టుకోవచ్చు కానీ ఇతర వస్తువులేవీ పెట్టకూడదంటారు. ఎందుకంటే పర్సు అంటే లక్ష్మీదేవి కొలువుండే స్థానం. పరిశుభ్రత లేని దగ్గర, గందరగోళ వాతావరణంలో లక్ష్మీదేవి కొలువుండదు. చిందరవందర నోట్లు, చిరిగిపోయిన పేపర్లు, పాత బిల్లులు ఇలా ఏవంటే అవి పర్సులో పెట్టడం వల్ల సంపాదన నిలవకపోవడంతో పాటూ ఆర్థిక నష్టాలు తప్పవంటారు. ఇంతకీ పర్స్ ఎలా ఉండాలి.. ఎలా ఉండకూడదో చూద్దాం....


Also Read: 2023లో ఈ 5 రాశులవారు సక్సెస్ కి కేరాఫ్, కొన్నేళ్లుగా పడుతున్న కష్టాల నుంచి ఊహించనంత ఉపశమనం


​పర్సు/వాలెట్ ఇలా ఉండకూడదు



  • పర్సులో నోట్లను చాలామంది మడిచి పెడతారు. ఇలా అస్సలు చేయకూడదని చెబుతారు జ్యోతిష్యశాస్త్ర పండితులు. పర్సులో నోట్లు ఎప్పుడూ నీటిగా ఉండాలి..మడిచి పెట్టకూడదు. ఇలా చేస్తే ఆర్థిక ఇబ్బందులు వెంటాడతాయట

  • ఎవరికైనా డబ్బు ఇచ్చేటప్పుడు, చెల్లించేటప్పుడు ఎడమచేతిలో తీసి ఇస్తుంటారు..కానీ ఏడమచేతిలో లక్ష్మీదేవిని ఇస్తే అవసరం లేదని విసిరేసినట్టు అని...అలాంటి వారిపై లక్ష్మీ కృప ఉండదంటారు

  • బ్లేడ్లు, కత్తులు లాంటి పదునైన వస్తువులను పర్సులో అస్సలు ఉంచకూడదు. ఆర్థిక సమస్యలు పెరగడంతో పాటూ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోకతప్పదని చెబుతారు

  • చాలా మంది పర్సులో డబ్బు నోట్లు, నాణేలు ఒకే చోట ఉంచుతారు. ఇలా కూడా చేయకూడదు. నోట్లు, నాణేలు ఎప్పుడూ విడివిడిగా ఉంచాలి.

  • ఎవరి దగ్గరైనా అప్పుతీసుకుని తిరిగి చెల్లించాల్సిన మొత్తాన్ని మీ పర్సులో పెట్టొద్దు...బ్యాగులో కానీ, జేబులో కానీ ఉంచి వారికి చెల్లించడం మంచిది

  • అశ్లీలతకు సంబంధించిన కొన్ని వస్తువులు పర్సులో పెట్టి మర్చిపోతారు..లక్ష్మీదేవి ఉండాల్సిన స్థానంలో అసభ్యకరమైన వస్తువులు ఉంచితే నష్టాలు తప్పవని చెబుతారు జ్యోతిష్య  శాస్త్ర నిపుణులు

  • పర్స్ లేదా వాలెట్ ఎప్పుడూ చిరిగిపోకూడదు, వెలిసిపోయి పూర్తిగా పాతబడినట్టు ఉండకూడు..ఈలోగానే మార్చడం మంచిది పర్స్‌లో నోట్లను కుక్కేయకండి..ఇతర వస్తువులు వాటి మధ్యలో అస్సలు పెట్టకండి

  • పర్సులో పాత బిల్లులు, వేస్ట్ పేపర్లు, కరెంట్ బిల్లులు ఉంచితే ఆర్థిక ఇబ్బందులు తప్పవు

  • దేవుడి ఫోటోలు, చనిపోయిన వారి ఫొటోలు, ఎండిన పూలు ఎట్టిపరిస్థితుల్లోనూ పర్సులో ఉంచరాదు..దీనివల్ల ప్రతికూలత పెరుగుతుంది

  • వాస్తుపై నమ్మకం ప్రకారం.. చాలా మంది పర్సులో కేవలం డబ్బులు మాత్రమే కాకుండా బ్యాంకు కార్డులతో పాటు అనేక వస్తువులను దాచుకుంటారు. అయితే పర్సులో ఏమి ఉంచకూడదు


Also Read: ఈ రాశివారికి కొత్త ఏడాది సమస్యలతో ఆరంభం - ఆ తర్వాత అంతా శుభం, 2023 తులారాశి ఫలితాలు


నోట్: కొన్ని పుస్తకాలు, పండితులు చెప్పిన వివరాల ఆధారంగా రాసిన వివరాలివి..వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం