Spirituality: తల్లిదండ్రులు, తోడబుట్టినవారు, భర్త, పిల్లలు, బంధువులు, చివరకు స్నేహితులు…ఇలా మనజీవితంలో ఉన్న ప్రతి రిలేషన్ రుణానుబంధమే. అందుకే ఎవరైనా చనిపోయినప్పుడు ఓ మాట అంటారు… రుణం తీరిపోయిందేమో అని. ఆ మాటకి అందరకీ పూర్తిస్థాయిలో అర్థం తెలియకపోయినా అది నిజం అంటారు పండితులు. ఎందుకుంటే రుణం వాళ్లు తీర్చుకున్నా, మీరు తీర్చేసినా వారు మీ జీవితం నుంచి శాశ్వతంగా వెళ్లిపోతారు. అన్ని బంధాలకన్నా కొడుకు అనే బంధం ప్రత్యేకమైనదిగా పరిగణిస్తారు చాలామంది. అయితే కొందరు పుత్రులు..రామాయణంలో శ్రవణ కుమారుడిలా తల్లిదండ్రులకు జీవితాంతం అండగా నిలిస్తే..మరికొందరు రెక్కలొచ్చాక ఎగిరిపోతారు.. ఇంకొందరు చావనీయక, బతకనీయక నిత్యం హింస పెడతారు. మరికొందరు తల్లిదండ్రులైతే ఏం పాపం చేశాం ఇలాంటి కొడుకునిచ్చావని బాధపడతారు. అయితే పుత్రుల కారణంగా మీరు పొందే సంతోషం అయినా బాధ అయినా కేవలం రుణం తీరేవరకే అని చెబుతారు...
Also Read: శోభకృత్ నామ సంవత్సరంలో ఈ రాశివారికి ప్రశాంతత ఉండదు, కక్కలేక-మింగలేక అన్నట్టుంటుంది పరిస్థితి
పుత్రుడిగా పుట్టడానికి ఏడు కారణాలు
- పూర్వ జన్మలో తన సొమ్మును దాచమని ఒక వ్యక్తికి ఇచ్చి అది తీసుకోకుండానే మరణించినవాడు, తాను దాచిన సొమ్ము తీసుకోవడానికి ఆ ఇంట్లో కొడుకుగా జన్మిస్తాడు
- పూర్వ జన్మలో బాకీ పడి ఉంటే..ఆ అప్పు తీర్చేందుకు పుత్రుడిగా పుడతాడు
- గత జన్మలోని శత్రుత్వం మిగిలిపోయినా ఆ లెక్క సెట్ చేయడానికి కొడుకుగా పుడతాడు
- పూర్వ జన్మలో తనకు ఒకడు అపకారం చేసినా వారికి తిరిగిచ్చేయడానికి పుత్రుడిగా జన్మిస్తాడు
- గడిచిన జన్మలో తాను అనుభవించిన సేవ – సుఖాలకు బదులు తీర్చడానికి కొడుకుగా జన్మించి తల్లిదండ్రులకు సేవ చేస్తాడు
- పూర్వ జన్మలో తాను ఏ వ్యక్తి నుంచి ఉపకారం పొందుతాడో ..వారికి ఆ ఉపకారం తిరిగి చేసేందుకు కొడుకుగా పుడతాడు
- ఏమీ ఆపేక్షించనివాడు కూడా పుత్రునిగా జన్మించి తన విధులను తీరుస్తాడు.
- ఇలా కొడుకుగా జన్మించినవారు తమ కర్మలు పూర్తైన వెంటనే మరణిస్తారు..
- కేవలం కొడుకు మాత్రమే కాదు..భార్య – భర్త – సోదరుడు ..చివరికి ఇంట్లో పెంచుకునే కుక్కతో సహా అన్నీ రుణానుబంధాలే..
అన్నీ రుణానుబంధాలే అంటూ చెప్పే శ్లోకాలివే
మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర |
అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మాత్ జాగ్రత జాగ్రత||
తల్లి, తండ్రి, బంధువులు, అన్నదమ్ములు, ధనము, ఇల్లు ఇవన్నీ మిధ్యే. ఏవీ నిజంగా లేవు. అందుకే ఓ మానవుడా సావధానుడవై ఉండు.
కామశ్చ, క్రోధశ్చ, లోభశ్చ దేహే తిష్ఠతి తస్కరాః|
జ్ఞాన రత్నాపహారాయ తస్మాత్ జాగ్రత జాగ్రత||
కామము, క్రోధము, లోభము లాంటి అరిషడ్వర్గములు మనలోని జ్ఞానమనె విలువైన రత్నాలను దొంగిలించేందుకు మన శరీరంలో దాగిఉన్న దొంగలు, అందుకే ఓ మానవుడా సావధానుడవై ఉండు. ఇది గృహస్థాశ్రమానికి సంభిందించనది. యవ్వనంలో ఉండే మనిషి లో పూర్తి స్థాయిలో అహంకారంతో ఉంటాడు. అందం, సంపాదన, వ్యసనం ఇవన్నీ ఉండేది ఈ వయసులోనే. అందుకే కామ, క్రోధాలని జయించాలని చెప్పే శ్లోకం.
జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం పునః పునః|
సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత జాగ్రత||
ఇది వానప్రస్థాశ్రమానికి ప్రతిబింబిస్తుంది…. ఈ జన్మ, వృద్ధాప్యం, భార్య, సంసారం ఇవన్నియు దుఃఖ భరితములే. అందుకే ఓ మానవుడా సావధానుడవై ఉండు.
ఆశయా బధ్యతే జంతుః కర్మణా బహు చింతయా|
ఆయుక్షీణం న జానాతి తస్మాత్ జాగ్రత జాగ్రత||
ఈ మనుషులు ఎప్పుడూ ఏదో చేయవలెననే ఆశతో జీవిస్తారు. కానీ తరగిపోతున్న జీవితకాలం గుర్తించరు. కావున ఓ మానవుడా సావధానుడవై ఉండు. ఇది సన్యాసాశ్రమానికి ప్రతిబింబిస్తుంది. నువ్వు లేచినా లేవకపోయినా నీ బతుకులో పెద్దగా మార్పులుండవని అర్థం.