అందమైన ప్రకృతి దృశ్యాలతో, గొప్ప ఆధ్యాత్మిక వారసత్వం కలిగిన ద్వీపం బాలి. పచ్చని పరిసరాలు, పురాతన దేవాలయాలు, శక్తివంతమైన సంప్రదాయాలతో, అందమైన దేశం. అటువంటి బాలీ ద్వీపాన్ని సందర్శించాలని అనుకునే వారిలో నిజమైన ఆధ్యాత్మికతను తట్టి లేపి ఒక ఆత్మజ్ఞానాన్ని ప్రసాధించే కొన్ని సాధనల గురించి ఇక్కడ తెలుసుకుందాం.


చీర నేతతో దేవుడికి థాంక్స్ చెప్పుకోవచ్చు


కానాంగ్ చీర నేతతో భగవంతుడికి మీ కృతజ్ఞతలను సమర్పించుకోవచ్చు. దీనిని రూపొందించడంలో మీలోని సృజనాత్మకతను వెలికి తియ్యవచ్చు. ఈ సమర్పణలన్నీ కూడా అరటి ఆకులతో అల్లి చేసినవి. తర్వాత పూలు, అగరుబత్తుల ధూపంతో నింపిన తర్వాత మీ మనసుకు తోచిన విధంగా మనసుకు నచ్చేట్టుగా వీటిని దేవాలయాలు, పవిత్ర స్థలాల్లో సమర్పించవచ్చు. ఉదయాన్నే చేసే ఈ సమర్పణ మీ కృతజ్ఞతను తెలుపుకునేందుకు, లక్ష్యాలను నిర్ధేశించుకునేందుకు, చుట్టూ ఆవరించి ఉన్న దైవత్వంతో అనుసంధానం అయ్యేందుకు దోహదం చేస్తుంది.


కర్మలను కడిగేసుకొనే వేడుక


మేలుకాట్ శుద్ధీకరణ, బాలినీస్ నీటితో చేసే ఈ ఆచారం బాలీనీస్ సంస్కృతిలో భాగం. ఇది శుద్ధి చెయ్యడం మాత్రమే కాదు పునరుద్ధరణను కూడా ప్రతిబింబించే ఆచారం. మేలుకాట్ లో ఇదొక గొప్ప ఆధ్యాత్మిక ఆచారంగా ప్రసిద్ధి. వైద్య పరమైన, ఆధ్యాత్మిక ప్రక్షాళనా ప్రాశస్థ్యం కలిగిన వేడుకగా చెప్పుకోవచ్చు. బాలినీస్ పూజారుల మంత్రోఛ్ఛారణ నడుమ, అర్పణ, ధ్యానం, ప్రార్థనతోపాటు అక్కడి నీటి కొలనులో ఉత్సవ స్నానం వంటివన్నీ ఈ ఉత్సవంలో భాగంగా ఉంటాయి. ఇది కర్మలను కడిగేసుకునే ఒక వేడుకగా చెప్పుకోవచ్చు. ఈ నీరు కేవలం శరీరాన్ని మాత్రమే కాదు మనసును, ఆత్మను శుద్ధి చేస్తుందని జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీంటి తొలగిస్తుందని నమ్మకం.


అభద్రత దూరం కావాలంటే..


ఇక్కడి మహిళా సర్కిల్స్ లో అడుగుపెట్టడం ద్వారా హీలింగ్ తో పాటు స్వీయ అన్వేషణలోకి అడుగు పెట్టినట్టు ఉంటుంది. ఈ పవిత్ర సమావేశాలు గొప్ప అనుబంధాన్ని, సపోర్ట్ ను, అన్వేషణ సామర్థ్యాన్ని మెలుకొల్పిన భావన కలిగిస్తాయని సెక్రెడ్ ఎర్త్ అనే బ్లాగర్ అన అనుభవాన్ని వివరించారు. వ్యక్తిగత అభివృద్ధికి కట్టుబడి ఉన్న ఈ సమాజంలోకి అడుగుపెట్టడం ద్వారా మీలోని భయాలు, అభద్రతను వదులుకోవచ్చు. అక్కడ ఇప్పటికే ఉన్న ఉమెన్ సర్కిల్ లో చేరడం లేదా కొత్తగా అక్కడి సిస్టర్ హుడ్ తో కొత్తగా ప్రారంభించినా సరే మీరు మీలోని చైతాన్యానికి, ప్రేమ, అనుబంధం, కరుణ పునాదులుగా కలిగిన కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టవచ్చు.


బాలినీస్ డ్యాన్స్.. ఇదొక ఆధ్యాత్మిక అభ్యాసం


బాలినీస్  డ్యాన్స్ వినోదానికి అతీతమైందని యునెస్కో అభివర్ణించింది. ఇది కేవలం ఒక నృత్య రీతి మాత్రమే కాదు ఇదొక ఆధ్యాత్మిక అభ్యాసంగా చెప్పుకోవచ్చు. బాలినీస్ దైవంతో అనుసంధానం కావడానికి, వారి పూర్వికులను గౌరవించడానికి ప్రతీక ఇది. ఈ నృత్య సాధన ఇంట్లో చేసుకోవడానికి, నేర్చుకోవడానికి ఆన్లైన్ టూటోరియల్స్ అందుబాటులో ఉన్నాయి. బాలినీస్ సంగీతంతో పాటు లయబద్దంగా సాగే నృత్యంలో మనల్ని మనం మరిచిపోవచ్చు.


బాలినీస్ చికిత్స విధానంతో సమస్యలకు చెక్


ఉసదాబాలీ బాలినీస్ చికిత్సా విధానం. ఈ వైద్యం ద్వారా పూర్తిస్థాయిలో చికిత్సలు సాధ్యమవుతాయట. బాలీకి చెందిన ఈ పురాతన జ్ఞానం అక్కడి స్థానిక మూలికలతో చేసే వైద్య విధానం. ఉసాదా బాలి సెషన్ లో మూలికలతో వైద్యం, మసాజ్, ఎనర్జీ వర్క్ వంటివి భాగంగా ఉంటాయి.


Also read : గర్భవతిని పాము కాటెయ్యదు, ఎందుకో తెలుసా!


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.