Achaleshwar Mahadev Temple: దేశంలో మహాదేవుని ఆలయాలు వేల సంఖ్యలో ఉన్నాయి. ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. వాటిలో చంబల్ లో ఉన్న అచలేశ్వర్ మహాదేవ్ ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. రాజస్థాన్‌లోని ధోల్‌పూర్ జిల్లా - మధ్యప్రదేశ్ సరిహద్దులో ఉంది. ఈ ఆలయం వేల సంవత్సరాల నాటిదని కొందరు చెబితే 1875 నాటిదని మరికొందరు అంటారు.అప్పట్లో చంబల్ లోయ మొత్తం అధీనంలో ఉండేదని అందుకే ఎవ్వరూ అటువైపు వెళ్లేందుకు సాహసించేవారు కాదని మరికొందరు చెబుతారు. రాను రాను ఈ ఆలయం ప్రత్యేకత తెలిసి భక్తులు పోటెత్తడం మొదలెట్టారు...
Also Read: కలలో డబ్బు-బంగారం కనిపిస్తే ఏమవుతుంది, శుభమా-అశుభమా!
అచ్లేశ్వర్ ఆలయం ప్రత్యేకత
దేశంలో ఉన్న పురాతన శివాలయాల్లో 'అచలేశ్వర మహాదేవ మందిరం' ఒకటి. దీనికి దాదాపు 2500 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇక్కడి గర్భగుడిలోని శివలింగానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ శివలింగం రోజులో మూడుసార్లు.. రంగులు మారుతూ ఉంటుంది. ఉదయం ఎరుపు వర్ణంలో, మధ్యాహ్నం కాషాయ రంగులో దర్శనమిస్తుంది. సాయంత్రం కాగానే ఈ శివలింగం నలుపు రంగులోకి మారిపోతుంది. మరో ప్రత్యేకత ఏంటంటే ఈ శివలింగం పక్కకు కదులుతూ ఉంటుంది. ఈ అద్భుత శివలింగాన్ని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తుంటారు.
నంది ప్రత్యేక ఆకర్షణ
ఇక్కడి శివాలయంలో ఇత్తడితో తయారుచేసిన 'నంది' మరో ప్రత్యేక ఆకర్షణ అని చెప్పొచ్చు. పంచలోహాలతో దీన్ని తయారు చేశారు.
Also Read: అష్టకష్టాలు పడ్డాం అంటారు కదా, అవేంటో తెలుసా అసలు!
శాస్రవేత్తలు తెలుసుకోలేకపోయారు
ఈ శివలింగం రంగులు మారడం, కదలడం వెనుకున్న కారణాలు తెలుసుకునేందుకు పురాతత్వ శాస్త్రవేత్తలు చాలా ప్రయత్నాలు చేస్తారు. కానీ..ఈ ఆలయంలో జరిగే అద్భుతాల రహస్యాన్ని ఇప్పటివరకు ఎవరూ తెలుసుకోలేకపోయారు. ఇంత మహిమగల ఆలయం అయినప్పటికీ అప్పట్లో దొంగల అధీనంలో ఉండడం ఓ కారణం, అక్కడకు వెళ్లేందుకు సరైన మార్గం లేకపోవడం మరోకారణంగా..ఎవ్వరూ వెళ్లేవారు కాదు...కానీ రాను రాను అద్భుతాల గురించి తెలిసి భక్తుల రద్దీ ప్రారంభమైంది.
శివషడక్షర స్తోత్రమ్( Shiva Shadakshara Stotram)
ఓంకారం బిన్దుసంయుక్తం నిత్యం ధ్యాయన్తి యోగినః |
కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః ||1||
నమన్తి ఋషయో దేవా నమన్త్యప్సరసాం గణాః |
నరా నమన్తి దేవేశం నకారాయ నమో నమః ||2||
మహాదేవం మహాత్మానం మహాధ్యాన పరాయణమ్ |
మహాపాపహరం దేవం మకారాయ నమో నమః ||3||
శివం శాన్తం జగన్నాథం లోకానుగ్రహకారకమ్ |
శివమేకపదం నిత్యం శికారాయ నమో నమః ||4||
వాహనం వృషభో యస్య వాసుకిః కణ్ఠభూషణమ్ |
వామే శక్తిధరం దేవం వకారాయ నమో నమః ||5||
యత్ర యత్ర స్థితో దేవః సర్వవ్యాపీ మహేశ్వరః |
యో గురుః సర్వదేవానాం యకారాయ నమో నమః ||6||
షడక్షరమిదం స్తోత్రం యః పఠేచ్ఛివసన్నిధౌ |
శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ||7||
ఇతి శ్రీరుద్రయామలే ఉమామహేశ్వరసంవాదే శివషడక్షరస్తోత్రం సంపూర్ణమ్ ||